అదిగో వచ్చెను తెలగాణా బిల్!
వచ్చెనసెంబ్లీ చర్చలకొరకై!
ఒకటో రెండో మూడు రోజులో
సమయం పట్టును చర్చలకొరకై!
కానీ, బిల్లుకు ప్రెసిడెంటిచ్చెను
ఆరువారముల సమయమ్మిప్పుడు!!
ఇంత సమయమ్ము నిచ్చుట కేదో
బలమైన కారణమ్ముండవలెనయా!
అనుమానమ్మెదొ పొడసూపెను మది!
కాలమిచ్చి యిక సాగదీయుటకె
కాదుగదా సీమాంధ్రుల కుట్రల
లాబీయింగుల మహిమమ్మిదియే?
కేంద్రము పూనిన కార్యము చక్కగ
సకాలమ్ములో నెరవేరును గద!
భేషు భేషనును తెలగాణమ్మే!
దీప్తిమంతమై కాంగ్రెసు వెలుగును!!
త్వరత్వరగా చర్చల జరిపించియు
కేంద్రముకంపగ యత్నించుటయే
ముందరనున్న మహత్కార్యమ్మిది!
తాత్సారమ్మిక చేయగనేలా?
కుట్రచేయుచో తిప్పికొట్టెదము!
మంచికేయైన కొనియాడెదము!
త్వరగా తేల్చుడు వారములోనే
త్వర త్వర త్వర త్వర త్వర త్వరగా!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
1 కామెంట్:
ఇది ఎవరికి చెందుతుందో వారికి!
ఒకరి బ్లాగులోని టపాను, బ్లాగు యజమాని అనుమతి లేకుండా తస్కరించి, తన బ్లాగులో వాడుకొనేవారినేమనాలి? కుళ్ళుబోతులనాలి! కుసంస్కారులనాలి! బ్లాగును పేర్కొననీ, కాని బ్లాగులోని టపానే తస్కరిస్తే, తస్కరులే అనవలసి వుంటుంది. వారు శాంతి కాముకులా? టపాలోని అంశాన్ని వెక్కిరించేవారు, సంస్కారులా? నేను ప్రత్యక్షంగా వారిని ఏమీ అనలేదే? గుమ్మడికాయల దొంగ అంటే, భుజాలు తడుముకోవలసిన అవసరమేముంది? నేను మాకు అన్యాయం చేసినవారిని అంటున్నాను. వారిననలేదే? అంతమాత్రంచేత సంస్కారం వీడాలా? నేను అనుసరించే ఛందం అనుకరించి కుతర్కం బోధిస్తే వినడానికి ఎవరూ ఇక్కడ కాచుకొని లేరు! వారి హద్దుల్లో వారుంటేనే మంచిది!
కామెంట్‌ను పోస్ట్ చేయండి