గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, ఆగస్టు 09, 2014

హౌసింగ్ దొంగలను వదిలిపెట్టం...!

- పంచాయితీరాజ్‌శాఖకు ఇండ్ల నిర్మాణ పథకం బాధ్యతలు!
- నిజామాబాద్‌కు ఎయిమ్స్ తరహా ఆస్పత్రి
- జక్రాన్‌పల్లిలో మినీ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
- నిజామాబాద్‌లో సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్
హౌసింగ్ పథకాన్ని ఇకనుంచి పంచాయతీరాజ్‌శాఖకు అప్పగించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సూత్రప్రాయంగా తెలియజేశారు. నిజామాబాద్‌లో గురువారం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. శాఖలవారీగా అధికారులతో సమీక్షించిన ఆయన హౌసింగ్‌లో జరిగిన అవినీతిపై స్పందించారు. ఒక నియోజకవర్గంలోనే 41వేల ఇండ్ల నిర్మాణాలు జరిగాయని, దీంట్లో అన్ని అవకతవకలే ఉన్నాయని ఆయన మండిపడ్డారు. సీఐడీకి హౌసింగ్ అవినీతిపై విచారణకు అదేశించానని ఈ విషయంలో చాలా సీరియస్‌గా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
nameసీఐడీ విచారణలో దొంగలుగా తేలితే ఎవరిని వదిలిపెట్టేదిలేదని తేల్చిచెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ నాయకుల హస్తం ఉన్నా తప్పు చేసిన ప్రతిఒక్కరిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దొంగలు ఇట్లనే ఉంటే హౌసింగ్ స్కీం మీకు అప్పగిస్తే మళ్లీ మొదటికే వస్తదేమోననే భయం నాకుంది, దొంగ పనిచేసిన ఎవ్వరిని వదిపెట్టేది లేదు. అందరూ జైలుకు పోవాల్సిందే. దీనిపై కొంతమంది నాపై విమర్శులు చేస్తున్నారు, వారికి సీఐడీ విచారణ తర్వాత సమాధానమిస్తా అని కేసీఆర్ అన్నారు. తె హౌసింగ్ అవినీతిపరులపై ఫిర్యాదుకు భయపడితే తనకు ప్రత్యేకంగా నివేదిక సమర్పించాలని సూచించారు. నిజాంసాగర్ మెయిన్ కెనాల్ పనులను రూ.505 కోట్ల వ్యయంతో 15 ప్యాకేజీల పనులను 2008లో చేపట్టి ఇంతవరకు పూర్తి చేయకపోవడంపై ఆయన ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కబ్జాలకు గురైన పట్టించుకునేవారు లేరని, ఏం తమాషాగా ఉందా? అంటూ అధికారులపై మండిపడ్డారు.

శుక్రవారంలోగా పూర్తినివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. పెండింగ్ పనుల కాంట్రాక్టర్‌లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆయన ఆదేశించారు. తెలంగాణవాటర్‌గ్రిడ్‌ను ఏర్పాటు చేసిన తర్వాత సింగూర్ నీటిని నిజామాబాద్ , మెదక్ జిల్లా తాగునీటి అవసరాలకే వాడుకోవచ్చన్నారు. బీఆర్జీఎఫ్ నిధులు వెనక్కిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. జక్రాన్‌పల్లిలో ఎయిర్‌పోర్ట్ కోసం కేటాయించిన 2000 ఎకరాలను కబ్జాలకు గురికాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులదేనని ఆయన స్పష్టంచేశారు. త్వరలోనే ఏయిర్‌పోర్ట్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఎస్టీ సబ్‌ప్లాన్ కింద ఐటీడీఏ తరహా గిరిజన అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పారు. ఎన్సీఎస్‌ఎఫ్‌కు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాకు చెందిన నాలుగు ఫ్యాక్టరీలను రైతులకే కోఆపరేటివ్ చేసి అప్పగించాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుందని, దీనిపై మూడు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలు మహారాష్ట్రకు వెళ్ళి అక్కడి పరిస్థితి అధ్యనం చేసి రావాల్సిందిగా కేసీఆర్ ఆదేశించారు. ఎన్‌సీఎస్‌ఎఫ్‌తో పాటు ఎన్‌ఎస్‌ఎఫ్‌ను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉంద న్నారు. దీంతోపాటు నిజామాబాద్‌లో ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఏర్పాటుచేస్తామని ఆయన హామీఇచ్చారు.

ఇండ్ల స్థలాల దరఖాస్తులు తీసుకోండి

నిజామాబాద్ నగరంతోపాటు ఆర్మూర్, కామారెడ్డి, బోధన్ మున్సిపాలిటీ ఏరియాలలో అర్హులైన నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వడం కోసం దరఖాస్తులు స్వీకరించాల్సిందిగా సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. రూ.మూడున్నర లక్షలతో ఇండ్ల నిర్మాణం చేసి ఇచ్చేందుకు తగిన స్థలాన్ని గుర్తించాలని సూచించారు. బల్దియాల పరిధిలో కూరగాయల కోసం మోడల్ మార్కెట్లను, చేపలు, మాంసం విక్రయాల కోసం ఏసీ మార్కెట్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రజాప్రతినిధులను గౌరవిస్తే పనులు సులువవుతాయని , ఇగోలు పెట్టుకోకుండా రథానికి రెండు చక్రాల మాదిరిగా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి