-గత ప్రభుత్వ నిర్ణయాలనే అమలుచేస్తే కొత్త ప్రభుత్వమెందుకు..?
-సొంత పార్టీలో ఉనికి కోసమే టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు
-కిషన్‌రెడ్డి, పొన్నాలపై కేటీఆర్ ఫైర్
యూపీ ఏ ప్రభుత్వం రూపొందించి, ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లులోని అంశాలనే బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్నదని బీజేపీ నేతలు పేర్కొనడంపై పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. గత ప్రభుత్వ నిర్ణయాల నే అమలు చేస్తామంటే కొత్త ప్రభుత్వమెందుకుని ప్రశ్నించారు. ఎన్డీఏ-2, బీజేపీ ప్రభుత్వమని చెప్పుకునే బదులు యూపీఏ-3అని పేరు పెట్టుకుంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు. తాజ్‌బంజారాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య చేస్తున్న విమర్శలపై తీవ్రం గా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఉనికి ప్రదర్శించుకునేందుకు.. పార్టీ హైకమాండ్ దగ్గర మెప్పు కోసమే పొ న్నాల విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. -సొంత పార్టీలో ఉనికి కోసమే టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు
-కిషన్‌రెడ్డి, పొన్నాలపై కేటీఆర్ ఫైర్
కొంతమంది రాజకీయ నిరుద్యోగులు, సొంతపార్టీలో ప్రాధాన్యంలేని వారుచేసే విమర్శలను పెద్ద గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో కనీసం 10 మంచి నిర్ణయాలు తీసుకోలేదు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 66రోజుల్లోనే కీలకమైన 43 నిర్ణయాలను తీసుకొని వాటి అమలుకు ప్రయత్నిస్తున్నది...అని మంత్రి తెలిపారు. సర్వేపై ఎవరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. ప్రభుత్వం నిర్వహించే సర్వేపై ప్రజలకు లేని ఇబ్బంది ప్రతిపక్ష పార్టీ నేతలకు ఎందుకని ప్రశ్నించారు.
హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారం కల్పించే విషయం ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఉందని, దానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అంగీకరించిందని చెప్తున్న కిషన్‌రెడ్డి.. ఆరోపణలు చేసేముందు ఆ బిల్లును స్పష్టంగా చదవాలని సూచించారు. హైదరాబాద్‌పై ఇతరుల పెత్తనం చెలాయించాలంటూ, పరాధీనం చేయాలంటూ ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులకు కిషన్‌రెడ్డి లేఖలు రాయడం ఎంతమాత్రం సరికాదని అన్నారు.
వెంకయ్యనాయుడు రాసిచ్చిన మాటలు చదివే ముందు అందులో ఏముందో ఒకసారి చూసుకుని చదవాలని సూచించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు రూపొందించేటప్పుడే తెలంగాణకు వ్యతిరేక నిర్ణయాలను టీఆర్‌ఎస్ వ్యతిరేకించిందని కేటీఆర్ గుర్తుచేశారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే అంశంపై యూపీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను రూపొందించేందుకు ప్రయత్నిస్తే అడ్డుకున్నామని చెప్పారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి