గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, ఆగస్టు 06, 2014

సచివాలయంలో సామరస్యానికి చెల్లుచీటీ...!

- వివాదాలను పెంచుతున్న చంద్రబాబు సర్కార్
- ఏపీ సచివాలయం తరలించాలని గవర్నర్‌ను కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం
- నేడు సీఎం కేసీఆర్ సమీక్ష

గిచ్చి కయ్యం పెట్టుకుంటున్న చంద్రబాబు సర్కార్ తీరుతో సచివాలయ పరిసరాల్లో సామరస్య వాతావరణం దెబ్బతింటున్నదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో ఒకే సచివాలయ ప్రాంగంణంలో రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు ఎక్కువ రోజులు కొనసాగడం సముచితం కాదని, ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నరసింహన్‌ను కోరనుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రత్యేకంగా సచివాలయ విషయంపై సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిసింది.
రోడ్డు భవనాలశాఖ అధికారులు పూర్తి సమాచారాన్ని సేకరించి ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి అందించనున్నారు. సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించిన డీ బ్లాక్‍లో ఇంకా నలుగురైదుగురు ఆంధ్ర అధికారులు ఇంకా తిష్ఠవేసి ఉన్నారు. వారిని వెంటనే పంపిచేందుకు కూడా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం ఆదేశించే అవకాశముంది. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే విధంగా నిర్మించిన జీ బ్లాక్‌ను కూడా రాష్ట్ర సచివాలయానికి అప్పగించాలని సీఎం కేసీఆర్ గవర్నర్‌ను కోరనున్నారని తెలిసింది.
భవనాల కొరత..: తెలంగాణ ప్రభుత్వానికి సచివాలయంలోని ఏ,బీ, సీ, డీ బ్లాక్‌లను కేటాయించారు. అయితే అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఈ నాలుగు బ్లాక్‌ల్లోనే సర్దుబాటు చేయడం కుదరడంలేదు. దీంతో మొత్తం శాఖలకు కావాల్సిన స్థలం ఎంత? ఈ బ్లాకుల్లో అందుబాటులో ఉన్న స్థలం ఎంత? తదితర వివరాలను రోడ్డు భవనాల శాఖ అధికారులు సిద్ధం చేశారు.

కనీసం మరో రెండు బ్లాక్‌ల మేర స్థలం కొత్తగా అవసరం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించిన బ్లాక్‌ల్లో కొంత స్థలాన్ని తెలంగాణకు కేటాయించాల్సి ఉంటుంది. పైగా సచివాలయంలో పనిచేసే అధికారులు, మంత్రులు, సందర్శకులకు పార్కింగ్ స్థలం లభించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సచివాలయాన్ని ఇక్కడి నుంచి తరలిస్తే తప్ప సమస్యకు పరిష్కారం లభించదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దీనికితోడు ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుకు తెలంగాణ సిబ్బందికి ఆగ్రహం తెప్పిస్తున్నది. సామరస్య వాతావరణాన్ని చెడగొట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు.విద్యుత్ కొరతతో రైతాంగం విలవిలలాడుతుంటే విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి అగ్గికి ఆజ్యం పోస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!  జై జై తెలంగాణ!


2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Siggu malina thothu kodakaa.....nee bathukanthaa edupena?
edusthuune bathakandi. Adi mee jaathi lakshanam.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

jvraoగారూ మీరింత కుసంస్కారులా? ఈ వ్యాఖ్యవల్ల మీ సీమాంధ్రులెంత దుర్మార్గులో తెలుస్తోంది. నాకు ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నో మీ సీమాంధ్రులు రాశారు. ఇలాగే విషాన్ని చిమ్మారు. ఎంత కుటిలత్వమున్నది మీలో! ఇంత కుళ్ళును మీ మనస్సుల్లో ఉంచుకొని మనమందరం అన్నదమ్ములం అని నంగనాచి కబుర్లు చెప్పారు...మన రాష్ట్రం కలిసే ఉండాలని నమ్మబలికారు...ఎందుకు? తెలంగాణులను అమాయకులను చేసి దోచుకుందుకు! అందుకే మీ దౌష్ట్యాన్నీ, దురాలోచనల్నీ, దురాగతాల్నీ నేను ఎండగడుతున్నాను. ఎంత నిర్భయంగా నన్ను తిడుతున్నారు! దోచుకునేదీ మీరే...తిట్టేదీ మీరే...! మరి మేం ఏమీ అనవద్దా? మీ దొంగవేషాల్ని బట్టబయలుచేయవద్దా? ఎంత నంగనాచివేషాలు...! ఇంత కోపమా...ఇంత కసియా...ఇంత వెక్కిరింపా...? మాకివి రావా? మేమూ అనలేమా? మా సంస్కారం ముందు మీలాంటివాళ్ళు కొట్టుకపోతారు. మాకున్న సంస్కారం అలాంటిది...మీకున్న ఇలాంటిది...తిట్లూ...శాపనార్థాలూనూ...!

మా తెలంగాణ జాతి లక్షణం సంస్కారయుతంగా మెలగడం. మీ సీమాంధ్రజాతి (మీలాంటివారి) లక్షణం కుసంస్కారులుగా మారి మమ్మల్ని తిట్టడం. మీకూ మాకూ పోలికేమిటి?

మా బ్లాగుల్లోకి ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? మరోసారి రాకండి...ఇలా దుర్భాషలాడకండి. మరోమారు ఇలాగే రాస్తే మర్యాద దక్కదు. జాగ్రత్త!

కామెంట్‌ను పోస్ట్ చేయండి