ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరుణంలో పాల్కురికి సోమనాథుని రచనలను, కావ్యాలను, జీవిత చరిత్రను, భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వీరశైవ మత సిద్ధాంతానికి పునాది వేసిన ఘనత ఆయనకే దక్కుతుందని టీయూ తెలుగు విభాగం చైర్మన్ డాక్టర్ గుమ్మన్న గారి బాలశ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. మెదక్ జిల్లాలోని జోగిపేటలోని నెహ్రూ మెమోరియల్ డిగ్రీ కళాశాలలో యూజీసీ, సేరో హైదరాబాద్, ఓయూ తెలుగు విభాగం సహకారంతో "ప్రథమాంధ్ర ప్రజాకవి-పాల్కురికి సోమనాథుడు" అంశంపై రెండు రోజుల జాతీయసదస్సును నిర్వహించారు. శనివారం సదస్సులో బాలశ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ఉమ్మడిరాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ సాహిత్యాన్ని, కవులను, విద్యావేత్తలను విస్మరించారన్నారు. పాల్కురికి సోమనాథుడి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టకపోవడమే దీనికి నిదర్శనమన్నారు.
ఉమ్మడిరాష్ట్రంలో నన్నయ్య, తిక్కన్న, శ్రీనాథ కవులకు పదప్రయోగ నిఘంటువులను రూపొందించారని, సోమనాథునికి రూపొందించకపోవడం వివక్షేనన్నారు.
ఉమ్మడిరాష్ట్రంలో నన్నయ్య, తిక్కన్న, శ్రీనాథ కవులకు పదప్రయోగ నిఘంటువులను రూపొందించారని, సోమనాథునికి రూపొందించకపోవడం వివక్షేనన్నారు.
ఈ సందర్భంగా...
-తొలితెలుగు స్వతంత్ర కవి పాల్కురికి సోమనాథునిపై విశేషమైన కృషి, పరిశోధనకు వీలుగా ప్రభుత్వం సోమనాథ పీఠం ఏర్పాటు చేయాలి.
-పాలకుర్తిలో సోమనాథుని నివాసస్థలాన్ని జాతీయ పర్యాటక స్థలంగా తీర్చిదిద్దాలి.
-ఏటా తెలంగాణలోని... ఒక విశిష్ట రచయితకు, కవికి, పరిశోధకుడికి సోమనాథుడని పేరిట ఆవార్డ్ ప్రకటించాలి.
-సోమనాథుని విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించాలి.
-తెలుగు విశ్వవిద్యాలయాన్ని సోమనాథ (తెలుగు) విశ్వవిద్యాలయంగా మార్చాలి.
-పాఠ్యపుస్తకాల్లో ఆయన కావ్యాలను, జీవిత చరిత్రను జోడించాలి.
-ఆయన పదప్రయోగ నిఘంటువుని ముద్రించాలి.
-సమగ్ర రచనలను పునరుద్ధరించి, స్వల్పధరలకే తెలంగాణులకు అందుబాటులో ఉండేట్టు చేయాలి.
-సోమనాథుని జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలి
అని తీర్మానించారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి