గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఆగస్టు 03, 2014

పులిచింతల నిర్వాసితులను తరిమేస్తున్న ఏపీ సర్కారు...!

-పులిచింతల నిర్వాసితులను తరిమేస్తున్న ఏపీ సర్కారు
-ప్రాజెక్టులో 15 టీఎంసీల నీటి నిల్వకు సన్నాహాలు
-పునరావాసం చూపకుండానే ఖాళీచేయాలని నోటీసులు
-రోడ్డున పడనున్న తెలంగాణ బిడ్డలు..
-నీటి నిల్వ వాయిదా వేయాలని డిమాండ్
కన్నతల్లిలాంటి ఊరును, సొంత ఇంటిని త్యాగం చేసి రోడ్డున పడ్డది తెలంగాణ బిడ్డలు! ప్రాజెక్టు కట్టి కోట్లకు పడగలెత్తేది కోస్తాంధ్ర రైతులు! అసమాన త్యాగం చేసిన ముంపు బాధితులకు కనీసం ఉండడానికి ఇల్లు పూర్తిగా కట్టివ్వకుండానే ఊర్లను ఖాళీచేయాలని ఏపీ సర్కారు హుకుం జారీచేసిం ది. ఉన్న ఇంటిని కోల్పోయి, ఉండేందుకు గూడు లేక ఘొల్లుమంటున్నారు పులిచింత ప్రాజెక్టు నిర్వాసితులు. కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల పూర్తి ఆయకట్టు స్థిరీకరణ, మూడో పంటకు నీరు, ఏడాదంతా నీటి వినియోగం కోసం కృష్ణానదిపై గుంటూరు జిల్లా పులిచింతల, నల్లగొండ జిల్లా వజినేపల్లి మధ్య 45.77 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించారు. దీంతో నల్లగొండ జిల్లాలో 13 గ్రామాలు పూర్తిగా, నాలుగు గ్రామాలు పాక్షికంగా మునిగిపోతున్నాయి. 2004లో మొదలైన ప్రాజెక్టును గత ఏడాది అప్పటి సీఎం కిరణ్ ప్రారంభించారు. గత ఏడా ది జూలైలోనే గ్రామాలు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీచేశారు.

తాజా నోటీసులతో నిర్వాసితుల్లో ఆందోళన:

ప్రాజెక్టులో 15 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని ఏపీ భారీ నీటి పారుదలశాఖ మంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దీంతో నిర్వాసితులు గ్రామాలను ఖాళీచేయాల్సిందిగా పులిచింతల జగ్గయ్యపేట కార్యాలయం పేరుతో నిర్వాసితులకు నోటీసులు జారీచేశారు. నల్లగొండ జిల్లాలో 13,545 ఎకరాల భూమి ముంపులో పోగా.. 5534 ఇండ్లు ముంపులో పోయాయి. 13 చోట్ల 647.02 ఎకరాల్లో 5916 ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు.

పూర్తికాని పునరావాసం:

ప్రాజెక్టుతో ముందుగా మునిగే చింత్రియాల, కిష్టాపురం, అడ్లూరు, వెల్లటూరు ఖాళీ చేయాలి. అడ్లూరు, వెల్లటూరు, వజినేపల్లిల పునరావాసం పనులు ఇంకా కొనసాగుతున్నాయి. చింత్రియాల రెండో ఆర్‌అండ్‌ఆర్ కేంద్రంలో పట్టాలు ఇవ్వలేదు. రెబల్లే మొదటి ఆర్‌అండ్‌ఆర్ కేంద్రంలో 150 ఇండ్లలో సగం కూడా పూర్తికాలేదు. మేళ్లచెర్వులో రెండో ఆర్‌అండ్‌ఆర్ కేంద్రం భూసేకరణ దశలోనే ఉంది.

punaralochana
నెమలిపురి రెండో కేంద్రం భూములను కొంత మంది ఆంధ్రోళ్లు ఆక్రమించారు. కిష్టాపురం, అడ్లూరు, నెమలిపురి, వెల్లటూరు పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతులు సమకూర్చినా మిగిలిన చోట నిర్మాణదశలో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీల భూములకు ప్యాకేజీలు అమలుకాలేదు. ఏడేండ్ల క్రితం చేసిన సర్వేను పరిగణనలోకి తీసుకోవటంతో 18 ఏండ్లు నిండిన వారికి ప్యాకేజీ దక్కడంలేదు. మహిళలకు ప్యాకేజీ ఇవ్వాలనే డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు. ఇండ్లు పూర్తికాక, వసతుల్లేక, పరిహారం అందకగ్రామాలు ఖాళీ చేయాలని ఆంధ్రా సర్కారు ఆదేశాలు ఇవ్వటంతో నిర్వాసితుల్లో గుబులు మొదలైంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి