- పాలిటెక్నిక్ సీట్లలో ఏపీ అధికారుల ఫీట్లు
- ముంపుగ్రామాలతోపాటు ఏపీకి తరలిపోయిన తెలంగాణ పాలీరెసిడెన్షియల్ కాలేజీ

పాలిటెక్నిక్ సీట్లలో తెలంగాణకు ధోఖా చేసేందుకు ఏపీ రాష్ట్ర అధికారులు కుట్రలు పన్నుతున్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో మూడు ప్రాంతాల్లో గిరిజన రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటుచేశారు. తెలంగాణలో ఎస్టీ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీని భద్రాచలంలో, ఆంధ్ర ప్రాంతంలో పాడేరులో, రాయలసీమలోని శ్రీశైలంలో రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేశారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఏపీలో కలపడంతో తెలంగాణకు సంబంధించిన ఎస్టీ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీ ఏపీలో కలిసిపోయింది. దీంతో అసలు తెలంగాణలో రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీయే లేకుండా పోయింది. మరోవైపు హైదరాబాద్‌లోని నాలుగు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఆంధ్ర విద్యార్థులకు కౌన్సిలింగ్‌లో సీట్లు ఇచ్చేందుకు పాలీసెట్ 2014 ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే సాకుతో 52శాతం సీట్లు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
పదో షెడ్యూల్‌లో ఉన్న సంస్థలనే రెండురాష్ర్టాలు పంచుకోవాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే హైదరాబాద్‌లోని నాలుగు పాలిటెక్నిక్ కాలేజీలు విభజన బిల్లులోని పదో షెడ్యూల్‌లో లేనందున కాలేజీలపై అధికారం పూర్తిగా తెలంగాణదేనంటున్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో ఏపీకి చెందిన విద్యార్థులకు సీట్లు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలంగాణ పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు రాజనరేందర్‌రెడ్డి, తారాసింగ్, మల్లికార్జున్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి