గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, ఆగస్టు 08, 2014

సచివాలయంలోనూ కబ్జాబుద్ధులే...!

- సెక్రటేరియట్‌లో మరింత జాగా ఇవ్వాలని ఆంధ్రా సర్కార్ వాదన
- ఇచ్చేదిలేదన్న తెలంగాణ అధికారులు
 తెలంగాణ సచివాలయంలో అదనపు భవనాలు, స్థలాన్ని అక్రమించుకునేందుకు ఆంధ్రా సర్కార్ ప్రయత్నిస్తున్నది. విభజన బిల్లులో పేర్కొన్నట్లుగా ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని 58-42 నిష్పత్తి ప్రకారం విభజించి రెండు రాష్ర్టాల ప్రభుత్వాల పరిపాలనకు భవనాలను కేటాయించారు. అయితే తమకు కేటాయించిన స్థలం సరిపోవడం లేదని, రెండు రాష్ర్టాల సెక్రటేరియట్‌లకు కామన్ యుటిలిటీ కింద కేటాయించిన భవనాలు, స్థలాలనుంచి కొంత అదనంగా కేటాయించాలంటూ గవర్నర్‌కు ఆంధ్ర ప్రభుత్వం లేఖ రాసింది. 
secrofcrto
తెలంగాణ సచివాలయానికి ఏ, బీ, సీ, డీ బ్లాకులు, ఆంధ్రకు హెచ్ సౌత్, హెచ్ నార్త్, జే, కే, ఎల్ బ్లాకులను కేటాయించారు. సచివాలయం మొత్తం స్థలం 92,315 చదరపు గజాలుకాగా తెలంగాణకు కేటాయించిన భవనాలు, స్థలాల విస్తీర్ణం 35,818 చదరపు గజాలు. ఆంధ్ర కేటాయించినది 49, 342 చదరపు గజాలు. ఇందులో జీ-బ్లాక్ ఉపయోగంలోలేని భవనం విస్తీర్ణం 4664 చదరపు గజాలు. రెండు రాష్ర్టాలకు కామన్ యుటిలిటీ కింద పోస్టాఫీసు, క్యాంటీన్, చర్చ్, గుడి, ఎస్‌బీహెచ్, ఆంధ్రాబ్యాంక్, జనరేటర్ రూమ్, ఇంటర్ స్టేట్ పోలీస్ వైర్‌లెస్ భవనాలను కేటాయించారు.

వీటి విస్తీర్ణం 1052 చదరపు గజాలు. వీటిపై కన్నేసిన ఆంధ్రా సర్కార్ కామన్ యుటిలిటీకింద ఉన్న వాటిలో మరికొన్నింటిని కేటాయించాలంటూ గవర్నర్‌కు లేఖ రాసింది. దీనిపై తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రస్తుత సచివాలయంలో ఆంధ్ర ప్రభుత్వానికి భవనాలు ఇవ్వడమే ఎక్కువంటే ఇంకా అదనపు భవనాలు అడగటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ సలహాదారువద్ద బుధవారం ఆంధ్ర సెక్రటేరియట్‌కు అదనపు స్థలాల కేటాయింపుపై రెండు ప్రభుత్వాల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రకు అదనపు స్థలం కేటాయించడం వీలు కాదని, అవసరమనుకుంటే హెచ్ బ్లాక్ సౌత్ వింగ్‌పై మరో అంతస్తును నిర్మించుకోవాలని తెలంగాణ అధికారులు కరాఖండిగా చెప్పినట్లు సమాచారం.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!  జై జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Ee edupu eppudu manuthaavuraa daridragottu vedhavaa...

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

jvraoగారూ మీరింత కుసంస్కారులా? ఈ వ్యాఖ్యవల్ల మీ సీమాంధ్రులెంత దుర్మార్గులో తెలుస్తోంది. నాకు ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నో మీ సీమాంధ్రులు రాశారు. ఇలాగే మీలోని విషాన్ని చిమ్మారు. ఎంత కుటిలత్వమున్నది మీలో! ఇంత కుళ్ళును మీ మనస్సుల్లో ఉంచుకొని మనమందరం అన్నదమ్ములం అని నంగనాచి కబుర్లు చెప్పారు...మన రాష్ట్రం కలిసే ఉండాలని నమ్మబలికారు...ఎందుకు? తెలంగాణులను అమాయకులను చేసి దోచుకుందుకు! అందుకే మీ దౌష్ట్యాన్నీ, దురాలోచనల్నీ, దురాగతాల్నీ నేను ఎండగడుతున్నాను. ఎంత నిర్భయంగా నన్ను తిడుతున్నారు! దోచుకునేదీ మీరే...తిట్టేదీ మీరే...! మరి మేం ఏమీ అనవద్దా? మీ దొంగవేషాల్ని బట్టబయలుచేయవద్దా? ఎంత నంగనాచివేషాలు...! ఇంత కోపమా...ఇంత కసియా...ఇంత వెక్కిరింపా...? మాకివి రావా? మేమూ అనలేమా? మా సంస్కారం ముందు మీలాంటివాళ్ళు కొట్టుకపోతారు. మాకున్న సంస్కారం అలాంటిది...మీకున్న ఇలాంటిది...తిట్లూ...శాపనార్థాలూనూ...! మా బ్లాగుల్లోకి ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? మరోసారి రాకండి...ఇలా దుర్భాషలాడకండి. మరోమారు ఇలాగే రాస్తే మర్యాద దక్కదు. జాగ్రత్త!

కామెంట్‌ను పోస్ట్ చేయండి