-ఏపీఐఐసీ, టీఎస్‌ఐఐసీల మధ్య వార్
-కొనసాగుతున్న ఆంధ్రా ఆధిపత్యం
రాష్ట్ర విభజన అనంతరం కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆంధ్రా ఉద్యోగుల ఆధిపత్యం కొనసాగుతున్నది. ఏపీఐఐసీ సంస్థ ఆస్తుల పంపిణీ, బాధ్యతల అప్పగింతలో అది కొట్టవచ్చినట్టు కనబడింది. విచిత్రంగా టీఎస్‌ఐఐసీలో కూడా ఆంధ్రా అధికారులే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చీఫ్ జనరల్ మేనేజర్ వంటి బాధ్యతలను కూడా ఆంధ్రా అధికారికే అప్పగించారు. అలాగే ఏపీకి సొంత భవనాలు అట్టిపెట్టుకున్న అధికారులు తెలంగాణకు లీజు భవనాలిచ్చారు.-కొనసాగుతున్న ఆంధ్రా ఆధిపత్యం
ఆస్తుల పంపిణీ బాధ్యతలను ముగ్గురు ఆంధ్రా అధికారులు చీఫ్ ఇంజినీర్ ఆర్ చెంచయ్య, జీఎం పర్సనల్ టీవీ రమణమూర్తి, సీజీఎం ఫైనాన్స్ సత్తిరాజు నిర్వహించారు. దాంతో ఆంధ్రాకే అంతా అనుకూలమైంది. టీఎస్‌ఐఐసీ ఎండీ జయేశ్ రంజన్ తెలంగాణకు న్యాయం చేయలేక పోయారని ఉద్యోగులు అంటున్నారు.
ఇక పరిశ్రమల కమిషనరేట్‌లో తెలంగాణకు కేటాయించిన చాంబర్లలో ఆంధ్రా కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నారు. ఆంధ్రా కమిషనర్ తెలంగాణకు కేటాయించిన గదిలో తన ఛాంబర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. బషీర్‌బాగ్ పరిశ్రమల భవన్ 4, 5, 6 అంతస్తుల్లో కొనసాగుతుండగా, ఐదోది ఏపీఐడీసీకి సంబంధించినది. ఐతే సొంత ఆస్తి కింద ఉన్న అంతస్తులు ఏపీఐఐసీకి కేటాయించి, లీజు అంతస్తును తెలంగాణకు ఇచ్చారు. అంటే తెలంగాణ ప్రభుత్వం దీనికి ప్రతి నెలా కిరాయి చెల్లించాల్సిందేనన్న మాట! ఇక ఆంధ్రా అధికారులు అవసరానికి మించిన స్థలాల్లో ఛాంబర్లను ఏర్పాటు చేసుకున్నారు. సగటున ఆంధ్రా ఉద్యోగులకు 412 చ.అ. దక్కితే తెలంగాణ ఉద్యోగులకు కేవలం 165 చ.అ.లు కేటాయించారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి