-రాష్ట్ర పోస్టులు జిల్లా జాబితాలో, జిల్లా పోస్టులు రాష్ట్ర జాబితాలో...
తెలంగాణ ఉద్యోగసంఘాల అభ్యంతరాలు
ఆయుష్, ట్రెజరీస్ ఎకౌంట్స్, గణాంక, వైద్యం ఆరోగ్యం, టూరిజం, రోడ్లు, భవనాలు, నీటిపారుదల, దేవాదాయం తదితర శాఖలలోని రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి పోస్టులపై కమలనాథన్ కమిటీ అవగాహనారాహిత్యంతో క్యాడర్‌స్ట్రెంత్ జాబితా ప్రకటించిందని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు మండిపడ్డారు. 56 శాఖాధిపతుల కార్యాలయాలలో జరిగిన అన్యాయాలను వివరిస్తూ మెంబర్‌సెక్రటరీ పీవీ రమేశ్‌కు టీఎన్జీవో నగరశాఖ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్ ముజీబ్, ట్రెజరీస్ ఎకౌంట్స్ టీఎన్జీవో అధ్యక్షులు ఎన్ నరేందర్‌రావు, ఎకానమిక్స్, స్టాటిస్టిక్స్ విభాగం ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వేణుమాధవ్ తదితరులు విజ్ఞాపనలను అందచేశారు.
ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క తీరులో శాఖాధిపతుల కార్యాలయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారని, ఫలితంగా కొన్ని పోస్టులు ఒకసారి రాష్ట్రస్థాయిలోకి, మరోసారి జిల్లాస్థాయిలోకి మారిపోతున్నాయని వారు ఎత్తిచూపారు.
దేవాదాయశాఖలో అక్రమంగా తెచ్చుకున్న సూపరింటెండెంట్‌పోస్టులను రాష్ట్రస్థాయి జాబితాలో ప్రకటించారని, అదే సమయంలో ఆయుష్‌శాఖలోని నిజామియా జనరల్ హాస్పిటల్ ఉద్యోగులను, సిటీకాలేజీ ఉద్యోగులను మాత్రం జిల్లాక్యాడర్‌లో చేర్చారని జేఏసీ నాయకులు వివరించారు. ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ శాఖ నుండి వివిధ శాఖలు గణాంకాల అవసరాల కోసం డిప్యూటేషన్ పద్ధతిలో తీసుకున్న అధికారుల కేటగిరీలను నిర్ణయించడంలో కనీస పద్ధతులు పాటించలేదన్నారు. ఈ శాఖలో ఒకే క్యాడర్ ఉన్న ఉద్యోగులను కొన్ని శాఖలవిషయంలో రాష్ట్రస్థాయి ఉద్యోగులుగా, మరికొన్నింట జిల్లా అధికారులుగా పరిగణించారన్నారు. ఇదేవిధంగా పశుసంవర్ధకశాఖ, సహకారశాఖ, హార్టికల్చర్, పురావస్తుశాఖ, సిరీకల్చర్ శాఖలలోని పోస్టులను తారుమారు చేశారని విమర్శించారు.

ఇవీ లోపాలు...

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి