- పరిపాలన సౌలభ్యం పేరుతో 2008లో విభజన..
- ఆప్షన్ల పేరుతో ఇక్కడే తిష్ఠ
- ఐదేండ్లు దాటినా కదలని సీమాంధ్ర ప్రొఫెసర్లు
జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో సీమాంధ్రులు తిష్ఠవేసుకుని కూర్చున్నారు. 2008లోనే జరిగిన విభజన సందర్భంగా ఆప్షన్లు ఇచ్చి, ఐదేండ్లు కాలపరిమితి విధించినా.. ఆ గడువు దాటిపోయినా ఇంకా తమ కుర్చీలను పట్టుకునే వేళ్లాడుతున్నారు. జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని జేఎన్‌టీయూ హైదరాబాద్, జేఎన్‌టీయూ సుల్తాన్‌పూర్, జేఎన్‌టీయూ మంథని, జేఎన్‌టీయూ జగిత్యాల కళాశాలల్లో ఇప్పటికీ 85% మంది ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. అదే సీమాంధ్రలోని అనంతపురం, కాకినాడ కాలేజీల్లో కనీసం 5 శాతం ఉద్యోగాలు కూడా తెలంగాణకు దక్కకపోవడం గమనార్హం. సీమాంధ్రులు తిష్ఠవేసిన స్థానాలు ఖాళీ కాకపోవడంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులకు జేఎన్‌టీయూహెచ్‌లో ఉద్యోగావకాశాలు లేకుండా పోతున్నాయి. ఇప్పటికే అక్కడ పనిచేస్తున్నవారికి పదోన్నతులూ దక్కడం లేదు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా సీమాంధ్రులు కుర్చీలను వదలకపోవడంపై తెలంగాణ నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. - ఆప్షన్ల పేరుతో ఇక్కడే తిష్ఠ
- ఐదేండ్లు దాటినా కదలని సీమాంధ్ర ప్రొఫెసర్లు
2008లో మూడు ముక్కలు
స్వతంత్ర ప్రతిపత్తిగల జేఎన్‌టీయూ హైదరాబాద్‌ను 2008లో పరిపాలన సౌలభ్యం పేరుతో విభజించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జేఎన్‌టీయూహెచ్‌కు అనుబంధంగా అప్పటికే 700 వృత్తి విద్యాకళాశాలలు (ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీ ఫార్మసీ) ఉండేవి. పరిపాలన ఇబ్బందికరంగా మారిందనే సాకుతో కూకట్‌పల్లి జేఎన్‌టీయూహెచ్‌ను అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి మూడు ముక్కలు చేశారు. జేఎన్‌టీయూ-హైదరాబాద్, జేఎన్‌టీయూ-అనంతపురం, జేఎన్‌టీయూ-కాకినాడగా విభజించారు.
అనంతపురంలోని యూనివర్సిటీకింద అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలను, కాకినాడలోని యూనివర్సిటీ కింద కోస్తాంధ్ర జిల్లాలు, హైదరాబాద్‌లోని యూనివర్సిటీ కింద తెలంగాణ జిల్లాలను జతచేర్చారు. ఆయా వర్సిటీలను ప్రాంతీయ యూనివర్సిటీలుగా చేశారు. అప్పటి వరకు ఒకే వర్సిటీ పరిధిలో పనిచేసిన వివిధ ప్రాంతాల అధికారులకు ఆప్షన్లు ఇచ్చి ఐదేండ్ల కాలపరిమితి విధించారు. కానీ.. ఆప్షన్ల పేరుతో సీమాంధ్రులు హైదరాబాద్‌లో తిష్ఠవేశారు. కాలపరిమితి ముగిసిపోయినా కుర్చీలను వదలడం లేదు.
ఆప్షన్ల పేరుతో సీమాంధ్రలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆయా అధికారుల స్థానాలను అక్కడి అనంతరపురం, కాకినాడ జేఎన్‌టీయూలు భర్తీ చేశాయి. 2010లో అనంతపురం వర్సిటీలో 72 టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి అన్నింటినీ ఆ యూనివర్సిటీ పరిధిలో నివసించే వారితోనే భర్తీ చేశారు. 2012లో 107 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి 103 మందిని ఆ యూనివర్సిటీ పరిధిలో నివసించే వారితోనే భర్తీ చేశారు. నలుగురు తెలంగాణవారికి మాత్రం అవకాశం కల్పించారు. 2010లో జేఎన్‌టీయూహెచ్‌లో 56 టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసి 33 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారితో, 23 మంది సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారితో ఉద్యోగాలను భర్తీ చేశారు. కూకట్‌పల్లి జేఎన్‌టీయూహెచ్‌లో ఉన్న సీమాంధ్ర ఉన్నతాధికారులు తెలంగాణ రాష్ట్రంలోనూ అధికారాన్ని చెలాయిస్తూ తెలంగాణకు చెందిన ఉద్యోగులను, విద్యార్థులను వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
తెలంగాణ కోటాలో వీసీ, రిజిస్ట్రార్ పదవులను పొందిన రామేశ్వరరావు, రమణారావులు సీమాంధ్ర ఉన్నతాధికారుల మోచేతి నీళ్లు తాగుతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి ఇప్పటికీ అన్యాయం చేస్తూనే ఉన్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల 3 డైరెక్టర్ పదవులకు బదిలీలు జరుగగా రెండిట్లో సీమాంధ్ర అధికారులనే నియమిస్తూ వీసీ రామేశ్వరరావు తీసుకున్న నిర్ణయం వివాదానికి దారి తీసింది. దీంతో వారంపాటు వర్సిటీలో విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగస్తులతోపాటు జగిత్యాల ఉద్యోగ సిబ్బంది కూడా ఆందోళనకు దిగారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో వీసీ, రిజిస్ట్రార్‌లు అందుబాటులో లేకుండా పోయారు.
తెలంగాణ కోటాలో ఉన్నత పదవులు అనుభవిస్తున్న వీసీ, రిజిస్ట్రార్‌లు వర్సిటీలో సీమాంధ్ర ఉద్యోగులను పంపించేందుకు శ్రద్ధ చూపకపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. వీసీ, రిజిస్ట్రార్‌ల తీరుపై బోధన, బోధనేతర, విద్యార్థి సంఘాలు కన్నెర చేస్తున్నాయి. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులను వెంటనే జేఎన్‌టీయూహెచ్ నుంచి పంపించి ఆ స్థానంలో తెలంగాణ వారికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి కలుగజేసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కూకట్‌పల్లి జేఎన్‌టీయూహెచ్‌లో ఉద్యోగాలు చేస్తున్న సీమాంధ్రుల వివరాలు విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఇలా ఉన్నాయి..
జేఎన్‌టీయూహెచ్ ఐఎస్‌టీ విభాగంలో : ముక్కంటి ఐఎస్‌టీ (డైరెక్టర్);
డిపార్ట్‌మెంట్ ఆఫ్ సెంటర్ బయోటెక్నాలజీ : డాక్టర్ లక్ష్మీనర్సు (ప్రొఫెసర్), డాక్టర్ అర్చనాగిరి (అసిస్టెంట్ ప్రొఫెసర్); సెంటర్ ఫర్ కెమికల్ సైన్సెస్ టెక్నాలజీ విభాగం: డాక్టర్ ప్రమోద్‌కుమార్ (ప్రొఫెసర్), డాక్టర్ ఏ జయశ్రీ (ప్రొఫెసర్), డాక్టర్ ఏవీఎన్ స్వామి (ప్రొఫెసర్), ఏ మీనాక్షి (అసిస్టెంట్ ప్రొఫెసర్); సెంటర్ ఫర్ ఎర్త్, అట్మాస్పియర్, వెథర్ మోడిఫికేషన్ టెక్నాలజీ (సీఈఏ అండ్ డబ్ల్యూఎంటీ): డాక్టర్ ఎం విశ్వనాథం (ప్రొఫెసర్);సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ (సీఈఎన్) : డాక్టర్. సీహెచ్ శశికళ (ప్రొఫెసర్), ఎం అంజిరెడ్డి (ప్రొఫెసర్), వీ హిమబిందు (అసిస్టెంట్ ప్రొఫెసర్), డాక్టర్ టీ విజయలక్ష్మి (అసిస్టెంట్ ప్రొఫెసర్); సెంటర్ ఫర్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ (సీపీఎస్): డాక్టర్ జీ కృష్ణమోహన్ (ప్రొఫెసర్); సెంటర్ ఫర్ స్పేషియల్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (సీఎస్‌ఐటీ): డాక్టర్ కే రాంమోహన్‌రెడ్డి (ప్రొఫెసర్), డాక్టర్ కే మంజులావాణి (ప్రొఫెసర్); సెంటర్ ఫర్ వాటర్ రిసోర్స్ (సీడబ్ల్యూఆర్): డాక్టర్ కే రాంమోహన్‌రెడ్డి (ప్రొఫెసర్), బీ వెంకటేశ్వరరావు (ప్రొఫెసర్), డాక్టర్ సీ సరళ (అసిస్టెంట్ ప్రొఫెసర్), డాక్టర్ ఎంవీఎస్‌ఎస్ గిరిధర్ (అసిస్టెంట్ ప్రొఫెసర్);
సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ ఆప్షన్స్ (సీఏఈవో): డాక్టర్ వీ హిమబిందు (అసిస్టెంట్ ప్రొఫెసర్); సెంటర్ ఫర్ ఇన్నోవేటివ్ రిసెర్చ్ (సీఐఆర్): డాక్టర్ ఏ ఉమా (అసిస్టెంట్ ప్రొఫెసర్); యూజీసీ అకడమిక్ స్టాఫ్ కాలేజ్: డాక్టర్ జీ విజయలక్ష్మీ (ప్రొఫెసర్); డిపార్ట్‌మెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెంటర్: డాక్టర్ ఏ రామకృష్ణ ప్రసాద్ (ప్రొఫెసర్); జేఎన్‌టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల: డాక్టర్ కే లక్ష్మణరావు (ప్రొఫెసర్ అండ్ హెడ్), డాక్టర్ ఈ సాయిబాబారెడ్డి (ప్రొఫెసర్ అండ్ బీవోఎస్ మెంబర్), డాక్టర్ ఎంవీ శేషగిరి (ప్రొఫెసర్), డాక్టర్ ఎం విశ్వనాథం (ప్రొఫెసర్, కో-ఆర్డినేటర్, సీఈఏ అండ్ డబ్ల్యూఎంటీ చైర్మన్, బీవోఎస్ మెంబర్), డాక్టర్ జీకే విశ్వనాథ్ (ప్రొఫెసర్ అండ్ చైర్మన్ బీవోఎస్ ఇన్ ఏజీ ఇంజినీరింగ్), డాక్టర్ కే రాంమోహనరావు (ప్రొఫెసర్ అండ్ డైరెక్టర్ బీఐసీఎస్), డాక్టర్ పీ శ్రీనివాసరావు (ప్రొఫెసర్), డాక్టర్ ఈసీ నిర్మలాపీటర్ (ప్రొఫెసర్),
డాక్టర్ పీ శ్రవణ (ప్రొఫెసర్, కో-ఆర్డినేటర్, సీఐటీఈ), డాక్టర్ ఎస్ శ్రీనివాసులు (ప్రొఫెసర్), డాక్టర్ వీ వెంకటేశ్వరరెడ్డి (ప్రొఫెసర్ కో-ఆర్డినేటర్, బీఐసీఎస్), ఏ కృష్ణనివేదిత (అసోసియేట్ ప్రొఫెసర్), డాక్టర్ ఎస్ విద్యావతి (అసోసియేట్ ప్రొఫెసర్), డాక్టర్ మాగంటి జనార్దన (అసోసియేట్ ప్రొఫెసర్), డాక్టర్ పీ శ్రీలక్ష్మి (అసోసియేట్ ప్రొఫెసర్), డాక్టర్ వీ పద్మావతి (అసోసియేట్ ప్రొఫెసర్), డాక్టర్ ఎన్ దుర్గాకుమార్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), ఎం పద్మావతి (అసిస్టెంట్ ప్రొఫెసర్), బీ శివకొండారెడ్డి (అసిస్టెంట్ ప్రొఫెసర్), బీ సునీత (అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ జువాలజీ); ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్: ఎం సుష్మ (ప్రొఫెసర్ హెడ్), ఎస్‌వీ జయరామ్‌కుమార్ (ప్రొఫెసర్), జే అమర్‌నాథ్ (ప్రొఫెసర్), బీవీ శంకర్‌రామ్ (ప్రొఫెసర్ అండ్ బీవోఎస్ చైర్మన్), ఎం సూర్యకళావతి (ప్రొఫెసర్), డాక్టర్ ఏ రఘురామ్ (ప్రొఫెసర్),
డాక్టర్ కే కిరణ్మయి, (అసోసియేట్ ప్రొఫెసర్ ఆన్ డిప్యూటేషన్), పీవీ వెంకటనారాయణ (అసిస్టెంట్ ప్రొఫెసర్), కేహెచ్ ఫణిశ్రీ (అసిస్టెంట్ ప్రొఫెసర్), డీ కిరణ్‌కుమార్ (అసిస్టెంట్ ప్రొఫెసర్); మెకానికల్ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్ : డాక్టర్ బీ సుధీర్‌ప్రేమ్‌కుమార్ (ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్), డాక్టర్ ఏవీ సీతారామరాజు (ప్రొఫెసర్, డైరెక్టర్), డాక్టర్ ఏ విజయ్‌కుమార్‌రెడ్డి (ప్రొఫెసర్, డైరెక్టర్, బీవోఎస్ చైర్మన్, ఈసీ మెంబర్), డాక్టర్ ఎం శ్రీనివాసరావు (ప్రొఫెసర్, బీవోఎస్ చైర్మన్, ఎరోనాటికల్ ఇంజినీరింగ్), డాక్టర్ బీ ఆంజనేయప్రసాద్ (ప్రొఫెసర్), డాక్టర్ ఏవీఎస్‌ఎస్‌కేఎస్ గుప్త (ప్రొఫెసర్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్), ఎంటీ నాయక్ (ప్రొఫెసర్ అండ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్), జే సురేష్ కుమార్ (ఫ్రొఫెసర్ అండ్ ట్రైనింగ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్), డాక్టర్ ఎస్ నాగశారద (ఫ్రొఫెసర్ అండ్ ట్రైనింగ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్),
డాక్టర్ జీ కృష్ణమోహన్‌రావు (ప్రొఫెసర్ అండ్ కోఆర్డినేటర్-కాడ్), డాక్టర్ ఎం ఇందిరారాణి (ఫ్రొఫెసర్), డాక్టర్ ఎం విద్యాసాగర్ (అసిసోయేట్ ప్రొఫెసర్ ఫర్నీచర్ ఇన్‌చార్జి), డాక్టర్ పీ బ్రహ్మర (అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ చార్జ్, క్లాస్ వర్క్), డాక్టర్ పి ప్రసన్న (అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ కో-ఆర్డినేటర్ ఎంటెక్ (ఏఎంఎస్)); ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్ : డాక్టర్ డీ శ్రీనివాసరావు (ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్, చైర్మన్ బీవోఎస్), వీడీ సోమశేఖర్‌రావు (ప్రొఫెసర్), డాక్టర్ ఎల్ ప్రతాప్‌రెడ్డి (ప్రొఫెసర్ అండ్ డైరెక్టర్ ఆర్‌అండ్ డీ సెల్), ఎం మాధవీ లత (ప్రొఫెసర్ అండ్ డైరెక్టర్ ఐటీసీ, బీవోఎస్ చైర్‌పర్సన్), డాక్టర్ ఎం ఆశారాణి (ప్రొఫెసర్ అండ్ కో-ఆర్డినేటర్, ఈడీసీ),
డాక్టర్ టీ సత్యసావిత్రి (ప్రొఫెసర్, ఆఫీస్ ఇన్‌చార్జి ఎగ్జామినేషన్స్), ఎన్ మంగళగౌరి (అసోసియేట్ ప్రొఫెసర్), టీ మాధవీకుమారి (అసోసియేట్ ప్రొఫెసర్, కో-ఆర్డినేటర్- అకడమిక్ ప్లానింగ్ సెల్), డాక్టర్ టీ అనితాశీల (అసోసియేట్ ప్రొఫెసర్), ఎం రమాకళావతి (అసిస్టెంట్ ప్రొఫెసర్), పీ సౌజన్య శ్రీదేవి (అసిస్టెంట్ ప్రొఫెసర్); కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్: డాక్టర్ పీ పద్మజారాణి (ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్), డాక్టర్ వీ కామాక్షిప్రసాద్ (ప్రొఫెసర్, కో-ఆర్డినేటర్- టెక్విప్-2), డాక్టర్ జీ విజయకుమారి (ప్రొఫెసర్ అండ్ డైరెక్టర్ యూజీసీ, ఏఎస్‌సీ), డాక్టర్ ఓబీవీ రామనయ్య (ప్రొఫెసర్), డాక్టర్ ఆర్ శ్రీదేవి (ప్రొఫెసర్, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్), డాక్టర్ వీ వసుమతి (ప్రొఫెసర్),
డీ సీతామహాలక్ష్మి (అసోసియేట్ ప్రొఫెసర్), డాక్టర్ కే శాంతి శ్రీ (ప్రొఫెసర్ అండ్ అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్), డాక్టర్ బీ రాంమోహన్ (అసోసియేట్ ప్రొఫెసర్), జే ఉజ్వల (అసిస్టెంట్ ప్రొఫెసర్), డాక్టర్ కేపీ సుప్రీతి (అసిస్టెంట్ ప్రొఫెసర్), ఏ కవిత (అసిస్టెంట్ ప్రొఫెసర్), ఈ హేమలత, (అసిస్టెంట్ ప్రొఫెసర్), ఐ లక్ష్మీమాణిక్యాంబ (అసిస్టెంట్ ప్రొఫెసర్); మెటలాజికల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ : ఆర్ శ్రీరమాదేవి (అసోసియేట్ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్), ఎస్ దేవకీరాణి (అసోసియేట్ ప్రొఫెసర్), కే శ్రీనివాసవాద్యాకర్ (అసిస్టెంట్ ప్రొఫెసర్); మ్యాథమెటిక్స్ డిపార్ట్‌మెంట్: డాక్టర్ ఎంఏ శ్రీనివాస్ (ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్), ఏఆర్‌కే ప్రసాద్ (ప్రొఫెసర్ అండ్ డైరెక్టర్-యూఐఐసీ),
బీఎస్ లక్ష్మి (అసోసియేట్ ప్రొఫెసర్), డాక్టర్ వీ శ్రీనివాసకుమార్ (అసిస్టెంట్ ప్రొఫెసర్); ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్: డాక్టర్ వై అపర్ణ (ప్రొఫెసర్), డాక్టర్ పీ మధుసుధన్‌రావు (ప్రొఫెసర్ అండ్ బీవోఎస్ చైర్మన్); కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్: బీ రమాదేవి (అసోసియేట్ ప్రొఫెసర్), పీ అపర్ణ (అసిస్టెంట్ ప్రొఫెసర్), టీ సబితాకళ (అసిస్టెంట్ ప్రొఫెసర్); కో-ఆర్డినేషన్ : డాక్టర్ పీ చంద్రశేఖర్‌రెడ్డి (ప్రొఫెసర్ అండ్ కో-ఆర్డినేటర్ ఇంజినీరింగ్ కళాశాల); డిపార్ట్‌మెంట్ స్కూల్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ: డాక్టర్ ఏ దామోదరం (ప్రొఫెసర్, సీఎస్‌ఈ, చైర్మన్, బీవోఎస్),
ఎం శ్రీనివాసరావు (ప్రొఫెసర్, సీఎస్‌ఈ), ఎస్ దుర్గాభవానీ (ప్రొఫెసర్, సీఎస్‌ఈ), ఎస్‌వీఎల్ నర్సింహం (ప్రొఫెసర్ సీఎస్‌ఈ), కే చంద్రశేఖరయ్య (ప్రొఫెసర్, సీఎస్‌ఈ), టీ శ్రీనివాసులురెడ్డి (అసోసియేట్ ప్రొఫెసర్, సీఎస్‌ఈ), జీ నర్సింహం (అసోసియేట్ ప్రొఫెసర్. సీఎస్‌ఈ), జీ ప్రవీణ్‌బాబు (అసోసియేట్ ప్రొఫెసర్, సీఎస్‌ఈ), జీ వెంకట్రామిరెడ్డి (అసోసియేట్ ప్రొఫెసర్, సీఎస్‌ఈ), ఎం ఆరతి (అసోసియేట్ ప్రొఫెసర్, సీఎస్‌ఈ), ఎన్ నవీన్‌కుమార్ (అసోసియేట్ ప్రొఫెసర్, సీఎస్‌ఈ); డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్: ఏఆర్ ఆర్యశ్రీ (ప్రొఫెసర్), డీ రఘునాథ్‌రెడ్డి (ప్రొఫెసర్), వీ మధుసూదన్‌ప్రసాద్ (ప్రొఫెసర్), డాక్టర్ సింధు (అసోసియేట్ ప్రొఫెసర్); ఎన్‌టీయూహెచ్ (జగిత్యాలలో) పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు- ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్: నాగసుజాత (అసిస్టెంట్ ప్రొఫెసర్), సీ రాధాచరణ్ (అసిస్టెంట్ ప్రొఫెసర్);
మెకానికల్ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్: డాక్టర్ కే ప్రసన్న లక్ష్మి (అసిస్టెంట్ ప్రొఫెసర్); ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్టుమెంట్: డీ నాగసుధ (అసిస్టెంట్ ప్రొఫెసర్), డాక్టర్ ధీరజ్ సురేంద్ర (అసోసియేట్ ప్రొఫెసర్); కంప్యూటర్ సైన్స్ విభాగం : ఎస్ విశ్వానందరాజు (ప్రొఫెసర్), ఎస్ జోషి శ్రీప్రసాద్ (అసిస్టెంట్ ప్రొఫెసర్),
కే సాధుచత్రపతి (అసిస్టెంట్ ప్రొఫెసర్); ఇన్‌ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ: డాక్టర్ విష్ణువర్థన్ (ప్రొఫెసర్), డీ రమేష్ (అసోసియేట్ ప్రొఫెసర్), పీ శ్రీనివాసరావు (అసోసియేట్ ప్రొఫెసర్), బీవీ రాంనరేష్ యాదవ్ (అసోసియేట్ ప్రొఫెసర్-నాన్ తెలంగాణ), సీహెచ్. ఆశాజ్యోతి (అసిస్టెంట్ ప్రొఫెసర్), సురేష్‌కుమార్ (అసిస్టెంట్ ప్రొఫెసర్); జేఎన్‌టీయూహెచ్ మంథని ఇంజినీరింగ్ కళాశాల: ఎన్‌వీ రమణ (ప్రొఫెసర్), కేవీ శర్మ (ప్రొఫెసర్), డాక్టర్ శశు ఛత్రపతి (అసిస్టెంట్ ప్రొఫెసర్), కే ప్రసన్నలక్ష్మీ (అసిస్టెంట్ ప్రొఫెసర్); జేఎన్‌టీయూహెచ్ సుల్తాన్‌పూర్ ఇంజినీరింగ్ కళాశాల: వై గోపీకృష్ణ (ప్రొఫెసర్ ఫిజికల్ ఎడ్యుకేషన్).
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి