గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, ఆగస్టు 02, 2014

హస్తినకు తెలంగాణ పేరుతో రైలేది?

- త్వరలో విజయవాడ నుంచి ఏపీ సూపర్ ఫాస్ట్
- సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి వీక్లీలు, బైవీక్లీలే దిక్కు
- ప్రత్యేక తెలంగాణ రైలుపై సర్వత్రా చర్చ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండు నెలలు దాటుతున్నా తెలంగాణ ప్రజలు ఢిల్లీకి వెళ్లటానికి డైలీ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వేశాఖ ఇప్పటివరకూ ప్రకటించకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రతీరోజు ఢిల్లీకి నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను గత బడ్జెట్‌లో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. దీంతో తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక రైలు కేటాయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంకోసం ప్రకటించే రైలు తెలంగాణ రాష్ట్రం పేరును ప్రతిబింబించేలా ఉండాలని కోరుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కాగజ్‌నగర్ మధ్య తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రోజూ నడుస్తున్నది. సికింద్రాబాద్ నుంచి కాగజ్‌నగర్‌కు నడిచే మరో రైలుకు భాగ్యనగర్ పేరు ఉంది. రాజధాని నుంచి ఢిల్లీకి ఏదైనా కొత్త రైలును ప్రతిపాదిస్తే ఆ రైలుకు ఇప్పుడు ఏ పేరు పెట్టనున్నారన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తమిళనాడు, కేరళవంటి రాష్ట్రాల ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌లు ఆయా రాష్ట్రాల పేర్లను ప్రతిబింబిస్తున్నాయి.
పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అస్తిత్వం ఉండేలా పేరును ఖరారు చేయాలని కోరుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి నడిచిన ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు పేరును తెలంగాణ రాష్ర్టానికి అనుకూలంగా మార్చి, కొత్త రైలును ఆంధ్రప్రదేశ్‌కు ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఇటీవలి రైల్వే బడ్జెట్‌లో సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ ప్రీమియం వీక్లీ రైలును మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకున్న రైల్వేశాఖ తెలంగాణ రాష్ట్ర పేరును ప్రతిబింబించేలా ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోలేదు. ప్రజలు మాత్రం ప్రత్యేక తెలంగాణ, హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్, లష్కర్ ఎక్స్‌ప్రెస్, తెలంగాణ స్టేట్ ఎక్స్‌ప్రెస్, డక్కన్ ఎక్స్‌ప్రెస్, బంగారు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌వంటి పేర్లను ప్రతిపాదిస్తున్నారు.

వీక్లీలు, బైవీక్లీలే దిక్కు

సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్ల నుంచి దేశ రాజధానికి వెళ్ళాలంటే వీక్లీ, బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్ళతోపాటు ప్రీమియం రైళ్ళే దిక్కు కానున్నాయి. ఇప్పటివరకు ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలుపై ఆధారపడ్డ తెలంగాణవాసులు ఇప్పటినుంచి ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే రైళ్ళపై ఆధారపడవలసి ఉంటుంది. వాటిలో సీట్లు ఫుల్ అయితే ప్రయాణం వాయిదా వేసుకోవాల్సిందే. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి ఢిల్లీకి 9 రైళ్ళు నడుస్తున్నప్పటికీ అవన్నీ ఇతర రాష్ర్టాల నుంచి బయలుదేరి ఈ స్టేషన్ల మీదుగా ఢిల్లీ వెళ్లేవే.

రాజధాని మీదుగా బయలుదేరే రైళ్ళ వివరాలుః

1) 22691 (రాజధాని) బెంగుళూరు- హజ్రత్ నిజాముద్దీన్- సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా బయలుదేరుతుంది. 2) 22693 (రాజధాని) బెంగళూరు సిటీ-హజ్రత్ నిజాముద్దీన్ - ఆది, బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా ఢిల్లీకి వెళ్తుంది. 3) 12649 సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ కాచిగూడ స్టేషన్ మీదుగా ఆది, సోమ, మంగళ, గురు, శనివారాల్లో వెళుతుంది. 4) 12647 కొనుగు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి కాచిగూడ స్టేషన్ మీదుగా సోమవారం మాత్రమే ప్రయాణిస్తుంది.

5)12437 రాజధాని - ప్రతీ బుధవారం సికింద్రాబాద్‌కు మీదుగా ఢిల్లీ వెళ్తుంది. 6) 12285 దురంతో ఎక్స్‌ప్రెస్- ఆది, గురువారాల్లో హైదరాబాద్ మీదుగా వెళ్తుంది. 7)12707 ఆంధ్రప్రదేశ్-సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ కాచిగూడ మీదుగా సోమ, బుధ, శుక్రవారాల్లో బయలుదేరుతుంది. 8)12721 దక్షిణ్ లింక్ ఎక్స్‌ప్రెస్- హైదరాబాద్ మీదుగా ప్రతీరోజు బయలుదేరుతుంది. 9)7021 సికింద్రాబాద్- జమ్ముతావి ఎక్స్‌ప్రెస్- సికింద్రాబాద్ నుంచి ప్రతీ మంగళవారం బయలుదేరుతుంది. వాస్తవానికి ఇది విజయవాడ నుంచి వస్తుంది. దీనికి సికింద్రాబాద్‌లో కొన్ని బోగీలు జత చేస్తారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి