-నమస్తే తెలంగాణకు పాసులు ఇవ్వకపోవడం దారుణం
-ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మండిపాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, టీజీవో చైర్మన్ వీ శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల కవరేజ్ కోసం నమస్తే తెలంగాణ విలేకరులకు పాస్‌లు ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇతర ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సంస్థలన్నింటికీ పాస్‌లు జారీచేసిన ఏపీ ప్రభుత్వం నమస్తే తెలంగాణకు మాత్రమే పాస్‌లు ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ పత్రికను అవమానపర్చేవిధంగా పాస్‌లు ఇవ్వబోమని చెప్తే కుదరదని హెచ్చరించారు. -ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మండిపాటు
నమస్తే తెలంగాణను పక్కనపెట్టడమంటే ప్రజాస్వామ్యంలో ప్రత్రికలకు ఉన్న స్వేచ్ఛను కాలరాయడమేనని అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న క్రమంలో నమస్తే తెలంగాణ దినపత్రిక ఆవిర్భవించిందన్నారు ఆంధ్ర అధికారులు, నేతలు, పాలకుల కుట్రలు పటాపంచలు చేసి ప్రజలకు వాస్తవాలను అందించిందన్నారు. ఆంధ్రా నాయకుల కుతంత్రాలను వెలుగులోకి నమస్తే తెలంగాణ తీసుకొచ్చిందన్నారు. తెలంగాణ సంపదను అక్రమంగా దోచుకుంటున్న అధికారుల గుట్టురట్టు చేసిందన్నారు.
నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకై.. ఉద్యమ పంథాతో ఆవిర్భవించిన పత్రికకు అసెంబ్లీ కవరేజ్ పాస్‌లు ఇవ్వకపోవడమంటే తెలంగాణ ప్రజల గుండెలను గాయపర్చడమేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఊడ్చేది తెలంగాణ వారే, లైట్లేసిది తెలంగాణ వారే, నీళ్లుపట్టేది తెలంగాణవారే కానీ కవరేజ్‌కు వెళ్లే నమస్తే తెలంగాణ పాత్రికేయులకు పాస్‌లు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసేవిధంగా విభజన ప్రక్రియను నవంబర్ నెలాఖరులోగా పూర్తిచేయాలని కమల్‌నాథన్ కమిటీని కోరారు.
రెండు రాష్ర్టాల సీఎంలు సమావేశమైనప్పుడు ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతానికి వెళ్లాల్సిందేనని నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. జిల్లా, జోనల్ పోస్టుల విషయంలో కమల్‌నాథన్ కమిటీ ఎటూ తేల్చలేకపోతున్నందున కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 40,378మంది ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఉద్యోగుల వివరాలను వెబ్సైట్లో పొందుపర్చాలని డిమాండ్ చేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
2 కామెంట్లు:
gurigimga saameta ardham poortigaa ippudea ardamaimdibasu thanks
చూడండి గురివిందగింజగారూ! మీరు గురివిందగింజగారనే విషయం ఇప్పటికిగాని అర్థంచేసుకొన్నందుకు, స్వయంగా అనుభవించి ఈ సామెతకర్థం తెలుసుకొన్నందుకు అభినందనలు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి