గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, ఏప్రిల్ 30, 2014

అంబ దయామయి సింహవాహనా!

తేది:అక్టోబర్ 13, 2013 నాటి విజయ దశమి పర్వదినమున నేను తెలంగాణ నిమ్మని కోరుతూ ఆదిపరాశక్తియగు సింహవాహనను స్తుతించాను. ఇప్పుడు ఆ తల్లి మనకు మన రాష్ట్రాన్ని ఇచ్చింది. అందుకు కృతజ్ఞతతో మళ్ళీ ఆ టపాను పునః ప్రకటము చేస్తున్నాను. తెలంగాణ సోదరులు దీనిని ఆదరించగలరని మనవి.

ఆ టపా ఇది:
తెలంగాణ ప్రజలకు రచయితలకు కవి పండితులకు
విజయ దశమి పర్వదిన శుభాకాంక్షలు!!


చండి! భవాని! శైలసుత! శాంభవి! భైరవి! యోగమాయ! చా
ముండి! వృషాకపాయి! సతి! మోక్షద! శాంకరి! దుష్ట దానవో
త్ఖండతరాశుకాండ! తెలగాణ వరాంచిత రాష్ట్రదాయి! పా
షండ శిఖండి! శక్తి! మహిషాసుర మర్దిని! సింహవాహనా! (1)

నేతల నీతిమంతులుగ నేర్పడఁ జేసియు; మమ్ము నేఁడిటన్
పూత మనమ్ము గల్గునటు పూని, వరమ్మిడి, వెల్గఁ జేసియున్;
చేతము చల్లనౌనటుల శీఘ్రమె రాష్ట్రము నేర్పరించియున్;
మా తెలగాణ మా కొసఁగు మమ్మ! దయామయి! సింహవాహనా! (2)

పూనెను కేంద్రమిప్పు డనుమోదము తోడుత రాష్ట్ర మీయఁగన్;
దీని నమోఘ రాష్ట్రముగఁ దీరిచి దిద్దియు మా కిడంగ, నీ
వే నవ రూప కర్తవయి, వేగమె హైదరబాదుఁ గోరు, మా
కా నగరమ్ముతోడి తెలగాణము నీఁగదె సింహవాహనా! (3)

నిరతము నిన్ను గొల్చెదము; నిక్కము! నమ్ముము! మా మనోరథ
స్థిరతర రాష్ట్రమందఁగను దీక్షలు సేసి, తపించినాము, మా
చిరమగు వాంఛఁ దీరిచి, విశేష తమాంచిత నవ్య రాష్ట్రమున్
కర మనురాగ యుక్తముగఁ గాంచుచు నీఁగదె సింహవాహనా! (4)

ఆత్రముతోడ వేచితిమి, హర్ష సుహృద్వర రాష్ట్రదాయి! మా
శత్రుల మానసమ్ములనుఁ జక్కనొనర్చియు, వారలన్ సుహృ
న్మిత్రులుగాను మార్చి, కరుణించియు, మమ్మిఁక వేగిరమ్మె స
ద్గాత్రులఁ జేసి, నీవు తెలగాణము నీఁగదె సింహవాహనా! (5)


-: శుభం భూయాత్ :-

మంగళవారం, ఏప్రిల్ 29, 2014

మేం తెలబానులమైతే...మీరు తెలబాన్ధ్రులు కారా?


గతంలో తెలంగాణులను సీమాంధ్రులు అనేక రకాలుగా అవమానించారు...ఈసడించారు...హేళనచేశారు...వెక్కిరించారు...తిట్టారు...శాపనార్థాలుపెట్టారు! ఐనా మేం/మనం మౌనం వహించి, మా తెలంగాణ రాష్ట్రసాధనకై అహింసాయుతంగా పోరాటం చేశాం...సమ్మెలూ, ధర్నాలూ, రాస్తారోకోలూ చేశాం...చివరికి యువకులైన వీరులు వేయికి పైగా ఆత్మబలిదానాలు చేశారు...మా/మన నాయకుడు కేసీఆర్ తెలంగాణ సాధనకై నిరాహారదీక్షచేశారు...ఫలితంగా మేం మా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగాం! కానీ...ఈ ఆంధ్రవాళ్ళు మమ్మల్ని/మనల్ని అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటే మనస్సు అదోలా అవుతుంది! 

గతంలో (బుధ/గురు వారములు: 06-11-2013/07-11-2013) నేను సీమాంధ్రుల వెటకారాలకు సమాధానంగా రెండు టపాలు "నా తెలంగాణ కోటి రత్నాల వీణ"లో ప్రకటించాను...ఈ సమయంలో మళ్ళీ ఆ టపాలను ఒక్కటిగా ఇచ్చట ప్రచురిస్తున్నాను...పఠించండి!


మొదటి భాగము:
మా తెలంగాణ రాష్ట్రమ్ము మాకు నిడఁగఁ
గోరు వారలన్ వేర్పాటుఁ గోరు వార
లంచుఁ, దీవ్రవాదు లటంచు ననఁగ నేల?

మొదటి వేర్పాటు వాదులు గదయ మీరు!
నాఁడు మద్రాసు సఖ్యమ్ము నూడఁ బెఱికి,
వేఱు రాష్ట్రమ్ము నిడఁగానుఁ గోరి రెవరు?
తీవ్రముగ నుద్యమించిన దెవ రదెవరు?

మమ్ము తెలబాను లనఁగ మే మగుదు మెట్లు?
మొదటి తెలబాన్ధ్రులే మీరు! మురువకుఁ డయ!

ఒక్క ప్యూను జాబునకయి నిక్కి నీల్గి,
యాగి చేసితి రయ్య మీ యాంధ్రు లపుడు!
సభలు చేసియు, నిందించి, జాలి లేక,
యాంధ్ర రాష్ట్ర మేర్పాటె ధ్యేయ మ్మటంచు,
నుద్యమమ్ము నడిపినది యోర్వలేని
యాంధ్రులరు కాదె? మదరాసు నాంధ్ర దనుచుఁ
గోరి యుద్యమించిన యట్టి వార లెవరు?

మమ్ముఁ దెలబాను లందురే? మమ్ము దోచి,
యెఱుఁగ నట్టున్న తెలబాన్ధ్రు లీరు కారె?

దొంగయే "దొంగ..దొంగరో..దొంగ" యనుచుఁ
బరుగుఁ దీయంగ...దొంగయే దొరగ నగునె?
యిచటి వెన్నియో దోచియు, నెఱుఁగ నట్లు,
మమ్ముఁ దెలబాను లనఁగానె మాయునె యవి?

మీరు చేసిన శృంగారమే యదౌనె?
మేము చేసిన వ్యభిచారమే యిదౌనె?
నోరు మూయుఁడు! నవ్వియుఁ బోరె? మీర
లింక వగల మాటలు మానుఁ డిట్టి తఱిని!!


రెండవ భాగము:
మేము విజయమ్మ నడ్డిన మెచ్చుకొనక,
“తీవ్రవాదు లీ తెలబాన్లు! ద్వేషమునను
నడ్డుచుండిరి! రాజ్యాంగ హక్కు నిటులఁ
ద్రోచి రయ వీరు! నేత నాక్రోశమునను
రా వలదటంచుఁ బల్కంగఁ, బ్రజల నెట్లు
తిప్పలను బెట్టెదరొ”యంచుఁ దెలివి తప్పి,
మాటలాడంగ సరియౌనె? మాకు నామె
యిచ్చిన వరాల మాటల వెక్క డయ్య?

“ఓ తెలంగాణ ప్రజలార! నీతి తప్పి
నేను నడువను! తెలగాణ నిచ్చునట్టి
దాన నేఁ గాను! కేంద్రమ్మె దాని నిచ్చు!
మీ తెలంగాణ సెంటిమెంట్ మేము గౌర
వింతు మయ్య! నా భర్త యా వేళ మీకు
నిడఁ దెలంగాణమును బాగనెంచి, ఢిల్లి
హై కమాండుకుఁ దెలిపెను! మాకు మీర
లోటు వేయఁ గృతజ్ఞతఁ జాటుకొందు!”
మనుచు మాట్లాడి, నేఁ డిట్లు మాట తప్పి,
“జై సమైక్యాంధ్ర!” యనుచును సాఁగి వచ్చి,
మా తెలంగాణలో “సానుభూతి యాత్ర”
పేరఁ “దెలగాణ వ్యతిరేకి”, తీరు మార్చి,
యడుగు పెట్టంగ నడ్డరే యామె నపుడు?

మా మనోభావమ్ముల మాత్ర మామె
గాయ పఱుపంగ వచ్చునే? కనుక మేము
నడ్డుకొంటిమి నిరసన నందఁ జేయ!

మాట తప్పిన వారికి మంగళార
తుల నొసంగియు స్వాగతింతురె జనులిట?

“మా స్థలమ్ముకు రావద్దు, మాను”మనుచు
నిరసనముఁ దెల్ప; వచ్చిన నేమి కతము?
మమ్ము పరిహసించుటె కాదె మఱల మఱల?
“నిరసనముఁ దెల్పరా” దన, నేమి యిదియె
బ్రిటిషు పాలనమే? లేక, వేఱె యౌనె?

మా మనోభావముల గాయ మందఁజేయ,
మా నిరసనఁ దెల్పెడి హక్కు మాకు లేదె?

నాఁడు “సైమను గో బ్యా” కనంచు నాంధ్రు
లందఱును నడ్డరే తీవ్రమైన కృతుల!
నేల నడ్డిరి సైమను నిట్టి జనులు?

అట “సమైక్యాంధ్ర” పేర మీ రడ్డగించి
యున్న సీమాంధ్ర నేతల కెన్ని యడ్లు
పెట్టితిరొ మీరు మఱచిరే విలువ తప్పి?

బొత్స బంధువర్గము పైన బూటకంపు
దాడి చేసి, లూటి యొనర్ప ధర్మమౌనె?

హర్ష కుమారుఁ డేమియు ననియె నయ్య?
యతని పైదాడి సేయంగ నగునె నీతి?
మీది తీవ్రవాదము కాక, మాది యౌనె?

సరియె పోనిండు! మొన్న శ్రీశైల భక్తు
లనఁగ, మా హనుమంత రావును ననంగ,
నట వసించునట్టి తెలగాణ జను లనఁగ
నెందు కడ్డితిరో చెప్పు! నీతి మాలి,
నిండు చూలును వైద్యమ్ము నీఁకఁ దఱిమి
కొట్టినట్టి మిమ్మేమందు రట్టి తఱిని?

మా తెలంగాణకును జెందు మహిళ పైన
పేడఁ గొట్టుట నేమండ్రు వెఱ్ఱి యనక?
యిట్లు దాడి చేసిన కత మేమొ చెపుడు!

నిరసనము కాదె? మేమును నిరసనమును
దెల్పినారము! మమ్మేలఁ దిట్టుదు రయ?

మే మిట వసించు సీమాంధ్రు నేమి యైన
నంటిమే? మేమె బాధల నంది, వేయి
యాత్మ బలిదానముల నిడి యడలితి మయ!

మేము తీవ్రవాదులమైన, మీర లెవరు?
మమ్ము తెలబాను లందురే? మమ్మనంగ,
మీరు తెలబాన్ధ్రులరు కారె? మిత హితులరె?

మీరు చేసిన శృంగారమే యదౌనె?
మేము చేసిన వ్యభిచారమే యిదౌనె?
నోరు మూయుఁడు! నవ్వియుఁ బోరె? మీర
లింక వగల మాటలు మానుఁ డిట్టి తఱిని!

***     ***     ***     ***     ***

(మొదటి భాగం...లింకు చూడదలచినవారు...దీనిపై క్లిక్ చేయండి)

(రెండవ భాగము చూడదలచినవారు...దీనిపై క్లిక్ చేయండి)


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

సోమవారం, ఏప్రిల్ 28, 2014

చంద్రబాబే పిట్టలదొర!


కేసీఆర్ నుద్దేశిం
చియు "పిట్టలదొర" అనియెడి
చంద్రబాబె పిట్టలదొర!
నమ్ముడయ్య ఈ నిజమ్ము!!

మోసగించు స్వభావమ్మె
చంద్రబాబు స్వంతమయ్య!
తన మామను వెన్నుపోటు
పొడిచి, పార్టి చేపట్టెను!!

కరెంటుకై ప్రశ్నించిన
రైతులనే కాల్పించెను!
వ్యవసాయము దండుగనియు,
హైటెక్కున టెక్కుజూపె!!

బీదవాండ్ర, భిక్షగాండ్ర
దాచిపెట్టి, "యూఎస్‍ఏ
ప్రెసిడెంటు"కు రాష్ట్రమ్మే
సుభిక్షమని చూపినాడు!

బీజేపీ తెలంగాణ
రాష్ట్రమివ్వకుండ అడ్డు
పడియు, తెలంగాణ కలను
అడుగంటగ కోసినాడు!

సర్కారుద్యోగమ్ముల
ప్రైవేటుపరముజేయగ
బూనినట్టి కుత్సితుండు
వగలమారి చంద్రబాబు!

ఉద్యోగుల పీఆర్సీ
కోతపెట్ట జూసినాడు!
మామ మద్యమును ఆపగ,
తాను ఏర్లు పారించెను!!

రెండు రూకలున్న రైసు
మూడున్నర పెంచినాడు!
రోడ్లు వేయకుండానే
వేసినట్లు లెక్కజూపె!!

జన్మభూమి ధనమంతా
కార్యకర్తలకే పంచె!
ప్రభుత్వంపు భూములన్ని
తనవారికె పంచిపెట్టె!!

తన పాలనలోన "తెలం
గాణ" పేరు నిషేధించి,
తెలగాణుల రాష్ట్రకాంక్ష
అణచివేయ జూసినాడు!

తెలుగుతల్లి, తెలుగుజాతి
అని మాయల మాటలాడి,
తెలంగాణ తల్లి కతడు
శృంఖలాలె వేసినాడు!

తన పార్టీ గెలుపు కొరకు,
తన మనసున లేనియట్టి
తెలంగాణ రాష్ట్రమ్ముకు
మద్దత్తును ఇత్తుననెను!

నేడు "పిట్టలదొర" అనుచు
వెక్కిరించుచుండె గాని,
నాడు కేసిఆర్ కాళ్ళను
మొక్కి, పొత్తుగూడినాడు!

కేసీఆర్ నిరాహార
దీక్ష చేసి సాధించిన
తెలగాణను దొంగ ఉద్య
మమ్ము చేసి, ఆపినాడు!

కేంద్రము బిల్ పంపగాను
ఒక్క,మాట కూడ తెలం
గాణకు అనుకూలముగా
ఏనాడును పలుకలేదు!

బిల్లు పార్లమెంటు జేర,
నెగ్గకుండ ఇతరపార్టి
నేతల నుసిగొల్పి, బిల్లు
నకు అడ్డము పడ్డాడయ!

మామకె కాదయ్య, అతడు
"తెలుగు జాతి" అనుచు నేడు
ద్రోహబుద్ధితో తెలగా
ణకును వెన్నుపోటుపొడిచె!

మోడికి సీమాంధ్ర పక్ష
పాత మబ్బజేసి, తెలం
గాణపైన అవాకులను
చవాకులను పలికించెను!

తెలుగు తల్లి "తల్లి" అనియు,
తెలంగాణ "బిడ్డ" అనియు,
"తల్లి జంపి, బిడ్డను బతి
కించినారు" అనిపించెను!

తెలంగాణ వచ్చిన తరి,
ఆంధ్రపార్టి ఇచటెందుకు?
తెలంగాణులందరకును
చంద్రబాబె విలనయ్యా!

ఇట్టి విలను గెలిచినచో,
తెలగాణను బానిసగా
మరల చేసి, తెలగాణుల
నణచివేసి, పాలించును!

చంద్రబాబు తొమ్మిదేండ్ల
పాలనలో "ఏబదైదు
వేల పరిశ్రమలు" మూత
పడ్డమాట మనమెఱుగమె?

రెండుకండ్ల సిద్ధాంతము,
సమన్యాయం, సమైక్యాంధ్ర,
సామాజిక తెలంగాణ
"ఊసరెల్లి" చంద్రబాబు!

ఇట్టి మోసకాడు, దగు
ల్బాజి, పిట్టలదొర చంద్ర
బాబు పాలనమ్ము తెలం
గాణలోన ఉండాలా?

ఆంధ్రపార్టి "తెలుగుదేశ
ము"నకు ఓట్లు వేయకుండ,
తెలంగాణనుండి దాన్ని
తరిమి తరిమి కొట్టుడయ్య!

మన నేతను "పిట్టలదొర"
అని హేళనచేయుచు, మన
ఓట్లనడుగు "బాబు" నిపుడు
తరిమి తరిమి కొట్టుడయ్య!

***      ***      ***      ***

చంద్రబాబు నిజస్వరూపం
తెలిపే నా మరో టపా...


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

ఆదివారం, ఏప్రిల్ 27, 2014

చేసింది మోసం...జరిగింది ఘోరం!


వైయెస్సార్సీపి యెంత
చొక్కం బంగారమ్మో
అమాయకపు ప్రజలారా,
తెలిసికొనుడు మీరలిపుడు!

జలయజ్ఞం పేర నాడు
వైయెస్ ద్వయ నిర్వాకపు
మోసమ్ముల నన్నియు కాగ్
బహిర్గతము చేసెనయ్య!

నీటి వసతి లేకుండా
ప్రాజెక్టులు కట్టనెంచె!

టెండరులలొ టైమీయక
తమవారికె లబ్ధినిడిరి!

అనుభవమ్ములేనివారు
గుత్తెదార్లుగా చేసిరి!

విదేశీయ సంస్థ లనుచు
చెవిని పువ్వుపెట్టిరయ్య!

పోలవరమునందుకూడ
తగిన లబ్ధి పొందిరయ్య!

ఇంకెన్నో ప్రాజెక్టులు
చేపట్టియు దోచిరయ్య!

పైకి నీతిపరుల మనుచు
లోపల అవినీతులయ్యు
రాష్ట్రసంపదలను దోచి
నట్టి ద్రోహు లీ యిద్దరు!

తండ్రిదోచిపెట్టినట్టి
పైకమంత జమచేసియు,
కాలుపైన కాలేసుకు
జగనుబాబు కులుకుచుండె!

ఎర్రటిగురివిందగింజ
తన నలుపును ఎరుగనట్టు,
తాను నీతిమంతుడనని
సభలందున చాటుచుండె!

అవినీతికి చిరునామా
ఆ తండ్రీకొడుకులయ్య!
నిబంధనలను గాలికొదిలి
సంపాదన ధ్యేయమనిరి!!

గుత్తెదారులెట్టి అర్హ
తలను కలిగి యున్నారో
కూడా పరిశీలింపక
పనులనెన్నొ అప్పగించ్రి!

కాగు నివేదికల జూడ
చేసినట్టి మోసమ్ములు
రాష్ట్రమ్మును ఘోరమ్ముగ
ముంచినట్లు తెలియునయ్య!

తమ గుత్తేదార్లనుండి
ఎన్నోముడుపులు పొందియు,
ప్రభుత పక్షమున వారికి
లబ్ధిని చేకూర్చిరయ్య!

రాష్ట్రసంపదను దోచియు
ప్రజల చెవిని పువ్వుబెట్టి,
మేము నీతి మంతుల మని
చాటినచో, అవుతారా?

జలయజ్ఞమునందు ఎంత
అవినీతియె జరిగినదో
ఒక్కసారి పరికించిన
తేటతెల్లమగునయ్యా!

***     ***     ***     ***

ఇదే అంశంపై మరిన్ని వివరాలకై

(ఈనాడు దినపత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శనివారం, ఏప్రిల్ 26, 2014

లక్ష హామీలిచ్చినా...తెలంగాణులు నమ్మరు!


తెలంగాణ ప్రజలారా,
కాంగ్రెస్సును నమ్మకండి!
ఓట్లకొరకు మాయమాట
లాడుచుండ్రి నమ్మకండి!!

మహిళా ముఖ్యమంత్రి అట!
ఒరుగల్ రెండో ఐటీ
రాజధానిగాను ఇపుడు
నడుంకట్టి చేతురంట!!

అట్లే, అపెరల్ టెక్స్‍టైల్
పార్కును నిర్మింతురంట!
నాల్గువేల మెగావాట్ల
విద్యుత్‍ ప్లాంటిచ్చెదరట!!

ఏట లక్ష ఉద్యోగాల్,
ప్రైవేట్ రెండులక్షలట!
రైతులకును రెండులక్ష
ల ఋణ మాఫి చేతురంట!!

పదేండ్లు టాక్స్ హాలిడేను
తెలగాణలొ ఇత్తురంట!
గాంధి, నిమ్స్ వైద్యకళా
శాలల అప్‍గ్రేడ్ సేతట!

తెలంగాణ ప్రజలారా,
కాంగ్రెస్సును నమ్మకండి!
ఓట్లకొరకు మాయమాట
లాడుచుండ్రి, నమ్మకండి!!

***     ***     ***     ***

ఇవి అన్నియు అరువదేండ్ల
నుండి ఎందుకు గుర్తునకు
రాలేదో చెప్పుడయ్య!
ఇప్పుడేల గుర్తుకొచ్చె?

ఇప్పుడిన్ని హామీలను
ఇచ్చుచుండ్రి గాని, గతము
లోన ఇవియు లేకుండుట
మీరెరుగరె, ఏల లేవు?

గత మీ పాలనమందున
ఇవి ఎందుకు చేయలేదు?
ఓట్ల హామి చెత్తబుట్ట
దాఖలుకై ఇవికావా?

టెక్స్టైల్ పార్క్ అనుచుంటిరి,
ఏజేమిల్ ఏలపోయె?
ఋణముల మాఫీ అంటిరి,
నష్టపు పరిహారమేది?
(పంట నష్టపరిహారం సీమాంధ్రకు ఇచ్చారు,
తెలంగాణకు మొండిచేయి చూపించారు)

విద్యుత్ ప్లాంట్ గతంలోన
నెలకొల్పగలేదెందుకు?
గతంలోన ఇచ్చినట్టి
హామీల్ నెరవేర్చితిరా?

కేసీఆర్ పైన బురద
చల్లి ఓట్లు కొల్లగొట్టు
డమ్మి ప్రణాళికే గాని,
నెరవేర్చెడి దిదికాదయ!

తెలంగాణ నిచ్చితిమని
జబ్బ చరుచు కొనగ నేల?
కేసీఆర్ ఉద్యమింప
కున్న మీరు ఇచ్చెదరే?

కేసీఆర్ ఉద్యమించ,
ప్రజలందరు కదలిరయ్య!
కాంగ్రెస్సిది చూచి కూడ
ఏల రాష్ట్రమిడకున్నది?

పద్నాలుగు వత్సరాలు
లేటెందుకు చేస్తిరయ్య?
వేయిమంది బలిదానాల్
చేయించితి రెందుకయ్య?

కేసీఆర్ మాటతప్పె
ననుచుంటిరి, ఇదియె తప్పు!
కేసీఆర్ కోరగానె
ఏల తెలంగాణీయరు?

వేయిమంది బలిదానము
జరిగినంక, తెలంగాణ
ఓట్లకొరకు ప్లానువేసి,
తెలంగాణ ఇచ్చుటేల?

మిఠాయిపొట్లం ఇత్తుము
అని ఇచ్చిరి, కాని, అందు
మిఠాయేది? సీమాంధ్రుల
కే మిఠాయి ఇస్తిరి కద!

తెలంగాణ వెనుకబాటు
నకు బాధ్యులు మీరు కాదె?
సీమాంధ్రుల జూచినట్లు
తెలగాణుల జూచినారె?

సీమాంధ్రను విమానాశ్ర
యమ్ము లెన్ని యున్నవయా?
తెలంగాణలోన ఎన్ని
యున్నవయ్య లెక్కింపుము!

ఒక్క విమానాశ్రయమ్ము
నిర్మితమ్ము ఏలకాదు?
మామునూరు నైన మీరు
ఏల వృద్ధి చేయలేదు?

పోనీయుడు, కేసీఆర్
ఒక్కడె తన పార్టీలో
కొనసాగును, మీరు కూడ
ఎవరో ఒకరుండగలరె?

సోనియమ్మ, రాహులుండు,
ప్రియాంకలును కాంగ్రెస్‍లో!
కేసీఆర్, కేటీఆర్,
కవితలు టీఆరెస్‍లో!!

ఏది కుటుంబంపు పార్టి?
మీది కుటుంబంపు పార్టి!
వారిది ఉద్యమ పార్టీ!
తెలివిగలిగి తెలిసికొనుడు!!

తెలంగాణ రాష్ట్రమందు
హైద్రబాదు తెలగాణదె!
"అది అందరి" దని అందువు,
అందరి దది యెట్లగునయ?

అందరిదన ఎవ్వరిదయ?
నీ మాటలొ సీమాంధ్రులు
మెదలుచుండిరనునదియే
పచ్చినిజము, ఎట్లు కుదురు?

మభ్యపెట్టు హామీలతొ
తెలగాణుల చెవిని పువ్వు
పెట్టబూనినట్టి నీదు
కాంగ్రెస్సే నశియించును!

తెలంగాణ రాష్ట్రమ్మును
కేసీఆర్ సాధించెను!
రాష్ట్రమిచ్చు పరిస్థితులు
తానే కల్పించెనయ్య!!

కేసీఆర్ లేకుండా,
తెలంగాణ మనలేదయ!
బంగారపు తెలంగాణ
ఆయనె సాధించునయ్య!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శుక్రవారం, ఏప్రిల్ 25, 2014

మన జేఎన్‍టీయూహెచ్‍లలో సీమాంధ్రుల పెత్తనం ఇంకా కొనసాగాలా?


జవహర్‍లాల్ నెహ్రూ సాం
కేతిక విశ్వవిద్యాల
యమ్ము హైద్రబాదు ఇపుడు
సీమాంధ్రుల అడ్డా అయె!

జేఎన్‍టీయూహెచ్‍లో
ఆంధ్రవారి ఆధిపత్య
మే రాజ్యము చేయుచు మన
తెలగాణుల ముంచుచుండె!

ఇట్టి విశ్వవిద్యాలయ
మును స్థాపించిన యప్పటి
నుండి నేటివర కాంధ్రులు
కొలువులు తెలగాణ కిడరు!

ఆంధ్రా అధికారులు మరి
బోధన సిబ్బంది తామె
పెత్తనమును సాగిస్తూ
కొలువులు తెలగాణ కిడరు!

దీనికి అనుబంధముగా
జగిత్యాల, మంథని, సు
ల్తానుపూరు లందు గూడ
కొలువులు తెలగాణ కిడరు!

సీమాంధ్రా ప్రభుత్వంపు
అండదండలతొ వారలె
పాలక మండలిగ నిత్య
ముగనెన్నికయగుచుండిరి!

సీమాంధ్రా ప్రభుత్వంపు
అండదండలతొ వారలె
క్యాంపస్‍లో తెలంగాణు
లెవ్వరి రానీయరైరి!

విద్యాలయ వృద్ధి మరియు
విధాన పరమైన నిర్ణ
యమ్ములలో తెలంగాణ
వారికి అవకాశమిడరు!

ఒక వైపున విభజన ప్ర
క్రియ సాగుచు నుండగానె,
అనుబంధపు సంస్థలలో
పోస్టుల భర్తికి పూనిరి!

ప్రకటించియు గడువుదాటె,
అయినను పోస్టుల భర్తికి
ఆంధ్రవారి నియమింపగ
పావులు కదుపుచు నుండిరి!

తెలంగాణ పోస్టులందు,
అర్హతగల తెలగాణుల
నింపవలసియున్నను ఆం
ధ్రులతోడనె నింపనుండ్రి!

తెలంగాణ రాష్ట్రమేర్ప
డిన కూడా ఇందులోన
సీమాంధ్రుల పెత్తనమ్మె
ఇంకా సాగగవలయునె?

తెలంగాణ ఉద్యోగులు,
నాయకులును, జేఏసీల్
ఈ మోసము సాగకుండ
అడ్డగింపవలెనయ్యా!

***     ***     ***     ***

ఇదే విషయమై మరింత సమాచారం కొరకు

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

గురువారం, ఏప్రిల్ 24, 2014

తల్లి ఎవరు? బిడ్డ ఎవరు?


మోడీ పలికెడి చిలుకల
పలుకులు చంద్రబాబువే!
తల్లి, కొడుకు, తండ్రి, బిడ్డ
లాంటి మాటలాయనవే!!

టీడీపీ ఆంధ్రపార్టి;
చంద్రబాబు మోసకాడు;
ఇట్టి పార్టి పొత్తుగొనియు
మోడీయే తప్పు చేసె!

ఈ మోడీ కేం తెలుసని
తెలంగాణపై వ్యాఖ్యలు
చేస్తూ, అసమంజసమగు
మాటలిపుడు పలుకుచుండె?

కాంగ్రెస్ నుద్దేశించియు
"తల్లిని జంపియు బిడ్డను
బ్రతికించిరి" యనుట యిపుడు
ఎంతవరకు సమంజసము?

తల్లి ఎవరు? బిడ్డ ఎవరు?
"ఆంధ్రప్రదేశ్" తల్లి అనియు,
"తెలంగాణ" బిడ్డ అనియు
అనుకొనుటయె వెఱ్ఱితనము!

ఆంధ్రప్రదేశ్ పుట్టక మును,
తెలంగాణ ఉన్నదయ్య!
ఆంధ్ర మాత ఒకరగుచో,
తెలంగాణ తల్లి ఒకరు!!

అక్కా చెల్లెండ్ర నిపుడు,
తల్లీబిడ్డలు అనియును
పలుకుటయే వెఱ్ఱివాని
పిఛ్ఛికూతలగునయ్యా!

అయినా ఈ మాటలన్ని
తఱచిచూడ, ఎవరెవరిని
చంపినారు, చచ్చిరెవరు?
అన్నీ కల్పితములయ్య!

మతతత్త్వపు పార్టి పూని,
ఇట్టి మాట లనుట యేల?
బ్రతికియున్న తెలంగాణ
మరల పుట్టు టేమిటయ్య?

తెలంగాణ అనాథయా?
తెలంగాణులంత యుండ,
తెలంగాణ అనాథగా
ఎట్లు అగును మోడిగారు?

బొల్లిబాబు చంద్రబాబు
మాట కలిపి, పొత్తుగూడ,
వాపును గని బలుపనుకొని
వెఱ్ఱికూత కూయవలదు!

తెలంగాణపైన నీవు
ఇట్టి వెఱ్ఱికూతలన్ని
మరల కూయుచో పార్టియె
తెలగాణలొ చావగలదు!

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

ఆలోచింపని పని ప్రమాదమే పంచుతుంది!


కం.
మన చేతను వోటున్నది,
మనకును మేలొదుగఁ జేయు మంచి మనిషికిన్
మన వోటును వేసినఁ జా
లును నిఁక నైదేండ్ల దాఁక రోచిస్సులెగా!

ఆ.వె.
వోటు వేయునపుడె చేటు కల్గింపని
నాయకులను మనమునందుఁ దెలిసి,
యైదు వత్సరములు హర్షమ్మునిచ్చెడి,
మంచివారినెన్నుమయ్య నీవు!

తే.గీ.
మనకు బంగారు తెలగాణమందఁజేసి,
మన బ్రతుకులను బాగుగా మలచి, భవిత
వెలుఁగఁ జేసెడి యత్యంత ప్రియతముఁడగు
రాష్ట్రదాతకు వోటు వరాలుఁ గుఱియు!

కం.
వేమఱు నాలోచింపుఁడు,
నీమముతో నీదు వోటు నీ రాష్ట్రమ్మున్
సేమముగ నుంచు వారికె!
సీమాంధ్రుల కిడెడి వోటు చిక్కులఁ దెచ్చున్!

తే.గీ.
వోటు తప్పుడు వ్యక్తికి పోవు కతన,
నైదు వత్సరములు నీదు హక్కు లిడుము
లంబడుటె కాదు, రాష్ట్రంపు సంబరములు
నాశనమ్మగుఁ గావున నమ్మ కెపుడు!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

బుధవారం, ఏప్రిల్ 23, 2014

మెత్తని వాళ్ళను చూస్తే, మొత్తబుద్ధి అయ్యిందట ఆంధ్రావాళ్ళకు!



మెత్తనివానిని చూసిన
మొత్తబుద్ధి యగుననియెడి
సామెతనే నిజముచేసి
నారయ్యా సీమాంధ్రులు!

పాలమూరు జిల్లాలో
కృష్ణానది, తుంగభద్ర
పారుతు ఉన్నను ప్రజలకు
త్రాగు, సాగునీరు లేదు!

సీమాంధ్రా వలస పాల
కుల జల దోపిడి తోడను,
స్థానిక నాయకుల స్వార్థ,
కక్కుర్తులతో బలయిరి!

శ్రీశైలం ప్రాజెక్టున
తెలుగుగంగ పేర, పోతి
రెడ్డిపాడు హెడ్డు రెగ్యు
లేటర్ గా మార్చి దోచ్రి!

విద్యుత్తుకు ఏర్పరచిన
శ్రీశైలం ప్రాజెక్టును
సీమాంధ్రా నాయకులిటు
అక్రమముగ దోచిరయ్య!

తెలంగాణ నేతలు తమ
నోరునెత్తకుండుటకై
ఎంగిలి మెతుకులు విసరిన
రీతి, కొన్ని పదవులిడిరి!

పాలమూరునుండి తుంగ
భద్ర పోవుచున్నకూడ,
పెత్తనమంతా కర్నూల్,
కడప జిల్లలదే ఆయెను!

సీమాంధ్రా నేతలచట
దౌర్జన్యంతో గేట్లను
డైనమైట్లతోడ పేల్చి,
నీళ్ళను రాకుండ చేస్రి!

సీమాంధ్రా ప్రభుత్వమ్ము
అచ్చటచట రిపేరులను
చేయు అవసరము ఉన్నను,
నిర్లక్ష్యము చేసెనయ్య!

పాలమూరు ప్రజలందరు
సాగునీరులేక, కూలి
నాలి చేసికొనుటకొరకు
తలోదిక్కు పోయిరయ్య!

పొట్టకూటికోసమిట్లు
వలసపోయినట్టి జనుల
కాంట్రాక్టర్ సీమాంధ్రులు
నిస్సిగ్గుగ దోచుచుండ్రి!

ఎంతదోచుకున్న నోరు
మెదపనట్టి పాలమూరు
మెత్తనివారల చూసిన
మొత్తబుద్ధి అయ్యె వార్కి!

***     ***     ***     ***

తెలంగాణ రాష్ట్రమేర్ప
డెను! ఇప్పుడు ఎన్నికలలొ
సమర్థ నాయకు నెన్నిన
వెతలు తొలగు తప్పకుండ!!

సీమాంధ్రుల అరాచకాల్
ఎదుర్కొనెడి నాయకులను,
కక్కుర్తులు ఏవి లేని
నాయకులను ఎన్నవలెను!

ప్రజల కొరకు ఉన్నయట్టి
ప్రజల మేలు కోరునట్టి
బంగరు తెలగాణ తెచ్చు
నాయకులను ఎన్నవలెను!

***     ***     ***     ***

ఈ విషయంపై మరిన్ని వివరాలకై

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!