గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, ఏప్రిల్ 01, 2014

తెలంగాణులపై ఆంధ్రాధిపత్యం ఇంకా కొనసాగాలా?


మరో రెండు నెలలలోన
రెండు రాష్ట్రములు ఏర్పడు
తరుణమ్మాసన్నమవగ
ఆంధ్ర ఆధిపత్యమేల?

తెలంగాణ వారినిపుడు
సీమాంధ్రా ఆధికారులు
వేధించగబూననేల?
దౌర్జన్యము చేయనేల?

ఏపీఐఐసీలో
తెలగాణుని ఆల్మరాను
సీమాంధ్రా అధికారియె
పగులగొట్టగానేలా?

తాళం పగులగగొట్టియు
ఫైల్స్ పరిశీలించనేల?
ఈ విషయము తెలగాణుడు
ఫిర్యాదును చేసినాడు!

ఆ ఫిర్యాదును గొనియును
నిజము తెలిసి డైరెక్టర్
ఆంధ్రునిపై క్రిమినల్ కే
సును పెట్టగ ఆర్డరిచ్చె!

ఆంధ్రవానిపై చర్యను
గొనువారాంధ్రులె కావున
ఈ ఆర్డరు నేటి వరకు
ఆచరణకు నోచలేదు!

ఇట్టి వెన్నియో దుర్జన
కృతములిట్లు ఆంధ్రవారు
తెలగాణులపై చేయుచు
ఉన్నను, చర్యలు లేవయ!

తెలగాణులపై ఇంతటి
నిర్లక్ష్యమ్మేలనయ్య?
సీమాంధ్రులపై ఇంతటి
పక్షపాతమేలనయ్య?

సీమాంధ్రులపై వెంటనె
చర్యను చేపట్టవలయు!
లేకున్నచొ తెలగాణులు
ఉద్యమించగావలయును!!

తెలగాణుల ఆత్మగౌర
వమ్మునకును విఘాతమ్ము
కలుగగ చూచుచునుందురె?
ఉద్యమించుడోయయ్యా!

***     ***     ***     ***

ఇదే విషయంపై మరిన్ని వివరాలకు

(నమస్తే తెలంగాణ పత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి