స్థానికేతరులు ఎవరో
తెలిసికొనుటకును వలసిన
వివరమంత ప్రభుత్వమ్ము
వద్ద ఉన్నదనుట నిజము!
వారి సమాచారమంత
ప్రభుత్వమ్ము వద్ద ఉండ,
అక్రమ ఉద్యోగులు చెప్పిన
దానినె ధ్రువపరచనేల?
వారి ధ్రువీకరణ గొనియు,
వారిని స్థానికులుగాను
గుర్తించుట ప్రభుత చేయు
నట్టి గొప్ప తప్పిదమ్ము!
సీమాంధ్రా పాలకులును
ఇట్టి వివరములను పూర్తి
గాను మాయమును చేసిన
విషయమ్మొక పెద్ద కుట్ర!
వైయెస్సార్ ఉన్నప్పుడు
సుమారు ఏబది ఎనిమిది
వేల అక్రమార్కులవగు
ఎస్‍బీల్ మాయమయె ననెను!
తెలగాణలొ అక్రమముగ
చొరంబడిన సీమాంధ్రా
ఉద్యోగుల నిచ్చటె కొన
సాగింపగ కుట్ర జరిగె!
తెలంగాణ ఏర్పాటును
జరిపినట్టె జరిపి, వివిధ
షరతులు విధియించుటయే
తెలగాణుల కపకారము!
దీనికి తోడుగ విభజన
తీరు తెన్నులును మరింత
అపకారకృతమ్మె కాదు,
అనుమానాలకు తావయె!
గతంలోన తెలంగాణ
ఉద్యోగాల్ సీమాంధ్రులు
కొల్లగొనుట, తెలగాణుల
ఉద్యమముకు కారణమయె!
ఈ నేపథ్యమ్ములోన
ఉద్యోగుల పంపకమును
స్థానికతను బట్టి చేయు
టయె సముచిత చర్య అగును!
సీమాంధ్రా ప్రభుత్వంపు
కార్యాలయములకు నిచట
తాత్కాలిక వసతులిపుడు
కల్పింపగ వలసియుండె!
ఇందుకు భిన్నముగ నేడు
ప్రతి కార్యాలయములోని
అధికభాగమును సీమాం
ధ్రులకు అప్పగించుచుండ్రి!
అటులే ప్రతి కార్యాలయ
మందు అన్ని వసతులున్న
గదులనేరియును సీమాం
ధ్రులకు అప్పగించుచుండ్రి!
తెలగాణకు అల్పభాగ
మిడుచుండిరి! వసతి లేని,
పనికిరాని పాతగదుల
నేరియేరి యిడుచుండిరి!
ఈ తతంగమును గమనిం
చినచో పదియేండ్ల పిదప
కూడా సీమాంధ్రులు హై
ద్రబాదు విడువరని తోచు!
కావున కేంద్రము వెంటనె
పక్షపాతమును వీడియు,
సీమాంధ్రకు తాత్కాలిక
వసతులనే ఈయవలెను!
తెలగాణకు శాశ్వతమగు
పూర్తి వసతులున్న గదులు
గల భవనములనె తప్పక
నిడ దెలగాణులు కోరిరి!
లేకున్నచొ మరల తెలం
గాణులు ఉద్యమము చేసి,
వివిధ మార్గములను వెదకి
సీమాంధ్రుల తరుమగలరు!
*** *** *** ***
మరిన్ని వివరాలకు:
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి