గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, ఏప్రిల్ 09, 2014

శత్రులెవరో, మిత్రులెవరో తెలుసుకోండి!


మొదటినుండి బీజేపీ
చంద్రబాబు మాట వినుచు,
తెలగాణకు ద్రోహమ్మును
చేయుచుండె కనుడయ్యా!

గతంలోన బీజేపీ
కొత్తరాష్ట్రమిచ్చునపుడు,
చంద్రబాబు తెలంగాణ
వద్దనగా విరమించిరి!

టీబిజేపి... టీడీపీ
పొత్తువద్దు అనుచున్నను,
వారిమాట వినక చంద్ర
బాబుపొత్తుగూడిరయ్య!

కేంద్రంలో బీజేపీ
టీబీజేపీ మాటను
వినదు; ముందుముందు వినదు;
చంద్రబాబు మాయవల్ల!

తెలగాణుల మాట వినని
బీజేపీ పార్టినిపుడు
తెలగాణులు ఎట్లు ఓటు
వేసియు గెలిపింతురయ్య?

టీబీజేపీ మాటయె
చెల్లుబాటు కాకయుండి,
బొల్లిబాబు చంద్రబాబు
మాట చెల్లుబాటు అగును!

తెలగాణను తనబానిస
గాను చేసి, చంద్రబాబు
మరల పాలనమ్ము చేసి,
తెలగాణను ముంచగలడు!

తెలంగాణ టీడీపీ
నేతలు ఈ ఆంధ్రబాబు
మోచేతుల క్రింది నీళ్ళు
త్రాగుబానిసైనవాళ్ళు!

తెలంగాణ వచ్చినంక
ఇంకా ఈ ఆంధ్రపార్టి
మనకేలని వదలి చనక,
గబ్బిలాల వలె పట్టిరి!

అందువలన ఆంధ్రపార్టి
టీడీపిని తెలగాణులు
తెలంగాణనుండి తక్ష
ణమ్మె తరిమివేయవలెను!

మత తత్త్వపు బీజేపీ
పార్టి మనకు కావలెనా?
సమభావము, సమత్వమ్ము
నిడు టీఆరెస్ వలయున?

మొన్న లోకసభను లేని
అడ్డంకులు, రాజ్యసభను
వెంకయ్యయె చంద్రబాబు
కుట్రచేత సృష్టించెను!

అందువలన, తెలగాణుల
బానిసలుగ జేయగోరు
ఆంధ్రపార్టి పొత్తు గొనిన
బీజేపీ నోడింపుడు!

కాంగ్రెస్సే తెలంగాణ
నిచ్చితిమని విర్రవీగ,
తెచ్చినట్టి టీఆరెస్
ఎంత గొప్పదో కనుడయ!

ఇండియాను ఇచ్చినట్టి
బ్రిటిషువాడు గొప్పవాడ,
ఇండియాను తెచ్చినట్టి
గాంధీజీ గొప్పవాడ?

ఐనను ఈ కాంగ్రెస్సులు
సీమాంధ్రకు నిచ్చినట్టి
ప్రత్యేకత, తెలగాణకు
నిచ్చిరేమొ గమనింపుడు!

పోలవరము పేరుచెప్పి
తెలగాణుల ఏడు మండ
లాలను మరి లాగికొనియు
నాంధ్రకిడగ బూనిరయా!

పోలవర డిజైను మార్చి
ముంపులేని విధముగాను
చేతురేమొ అడుగుడయ్య!
తల అడ్డము త్రిప్పుచుండ్రి!!

ఉద్యోగుల పంపకమును
జనాభాను ప్రాతిపదిక
చేసి, తెలంగాణమునకు
నష్టము వాటిల్ల జేస్రి!

కావున ఈ కాంగ్రెస్సుకు
ఓటు వేసి గెలిపించిన,
తెలగాణకు ఎన్ని నష్ట
ములను రేపు కలిగింతురొ?

తెలగాణులు తేల్చుకొనియు,
తెలంగాణలోన ఎవరు
ప్రభుత్వంపు ఏర్పాటును
చేయవలెనొ వారి నిడుడు!

తెలగాణను బంగారపు
తెలగాణగ చేయుపార్టి
నాదరించి త్వరితముగా
గెలిపింపుడు గెలిపింపుడు!

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి