తెలంగాణ ముమ్మాటికి
వర్షాభావమ్ములేని
ప్రాంతమ్మే యైన గాని,
నీటికి కటకట యేలా?
అరువదేండ్ల క్రింద తెలం
గాణ సస్యశ్యామలమై
యుండగాను, ప్రస్తుతమ్ము
నీటి కొరత ఎటులేర్పడె?
అరువదేండ్ల పాలనలో
సీమాంధ్రులు తెలంగాణ
చెరువులన్ని నిర్లక్ష్యము
చేసినందువలనె కరువు!
తెలంగాణలోన వలయు
ప్రాజెక్టుల నిర్మింపక
ఉపేక్షించగాను ఇచట
నీటికరువు ఏర్పడెనయ!
చెరువుల పూడికతీతకు
ధనమింతయు వెచ్చింపక,
నదులనీరు సీమాంధ్రకు
తరలించుకు పోయిరయ్య!
కేటాయింపులు లేకయె
నదులనీరు తరలించియు
తెలంగాణ వాటాయే
దోచుకొనియు పోయినారు!
నీరులేని చెరువులన్ని
వెక్కిరించుచుండ రైతు
బోరుబావులను వేయగ
అప్పులపాలైనాడయ!
సీమాంధ్రుల చేతినుండి
తెలగాణను రక్షింపగ
రాష్ట్రమ్మును కోరి ఉద్య
మములు చేసి గెలిచితిమయ!
తెలంగాణమేర్పడియెను!
మన వాటా మనకు తెచ్చి,
గొలుసుకట్టు చెరువులన్ని
పూడికతీయించవలయు!!
మన నీరము మన పొలముల
పారినచో సస్యమ్ములు
పండి పులకరించునయా,
రైతు బాగుపడునయ్యా!
*** *** *** ***
మరిన్ని వివరాలకు
(మాన్యులు శ్రీ వి. ప్రకాశ్‍గారు నమస్తే తెలంగాణకు ఇచ్చిన ఇంటర్వూ ఆధారంగా...)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి