గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఏప్రిల్ 03, 2014

వీళ్ళెంత దగుల్బాజీలో తెలుసుకోవడానికి ఈ ఒక్క దుర్మార్గం చాలు!





సీమాంధ్రులు సోదరులని
తెలగాణులు భావింపగ,
సోదరులని చూడకుండ
మోసగించిరయ్య వారు!

రంగరెడ్డి, నల్లగొండ,
మహబూబ్‍నగరమ్ములకును
నీరమ్మును ఈయకుండ
పోతిరెడ్డిపాడ్ కట్టిరి!

"శ్రీశైలం డ్యాంనుండియు
త్రాగు సాగు నీరు కొనగ
వల, దిది హైడల్ పవరుకె!"
అనిన గూడ కొనిపోయిరి!

మొదట పదియు నైదు వంద
లగు క్యూసెక్కులని చెప్పి,
నలుబది నాలుగు వేయిల
క్యూసెకులకు పెంచినారు!

ట్రిబ్యునల్సు దృష్టిలోకి
రానీయక మోసగించి,
జలదోపిడి చేయు వీరి
దుర్మార్గము చూడుడయ్య!

ఈ వ్యవహారమ్ము నిపుడు
న్యాయనిపుణులంత చేరి,
ట్రిబ్యునలుకు తెలియపరచి,
న్యాయమ్మును జరుపవలయు!

సమగ్రమ్ముగా పరిశీ
లనము జరిపి, వారి దొంగ
తనము బట్టబయలు చేసి,
తగిన శిక్ష వేయవలయు!

జల కేటాయింపు లేని
ప్రాజెక్టుల కిట్టి నీరు
తరలింపగ బూన, నెంత
ధైర్యమ్మే వారికుండె?

తెలగాణను నష్టపరిచి,
దొంగతనముగా నీటిని
కొనిపోవుట, వారియొక్క
దగుల్బాజితనము దెలుపు!

***     ***     ***     ***

ఈ విషయంలో మరింత సమాచారం కోసం

(నమస్తే తెలంగాణ పత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి