పారిశ్రామిక రంగం
మ్మందున అభివృద్ధి కొరకు
సెజ్‍ల పేర దోచిపెట్టి
నట్టి భూములను కనుడయ!
సీమాంధ్రా పాలకులే
తమకును అనుకూలురైన
వారలకును కట్టబెట్టి
నట్టి భూములను కనుడయ!
బీదలైన తెలగాణుల
వేలకొలది ఎకరాలను
చౌకగాను సంగ్రహించి
వారందరి పొట్టగొట్టె!
నష్టపు పరిహారమ్మును
ఇప్పటివర కీయలేదు!
పారిశ్రామికవాడల
కిప్పటికిని జాడలేదు!
లక్షలకొలదిగ ఉద్యో
గమ్ములు కల్పించెదమని
ఇన్ని ఏండ్లు గడచిన అవి
నీటిమూటలాయెనయ్య!
సెజ్జులకును రాష్ట్రపతియె
ఆమోదము తెలుపకయే
భూముల కేటాయింపులు
జరిగె, అమ్మకములాయెను!
లక్షలలో కొనిన భూమి
కోట్లలోన అమ్ముడాయె!
కోట్లకు పడగలనెత్తిరి!
తెలగాణులు బీదలైరి!!
నష్టపుపరిహారమేది?
ఉద్యోగపు కల్పనేది?
మాయమాటలవికావా?
సీమాంధ్రుల దోపిడిదే!
ఏండ్లు గడచె కాని అగ్రి
మెంట్ల అమలు జరుగలేదు!
ఇందులోన ఎన్నొ అవక
తవకలె జరిగినవయ్యా!!
’కాగు’ మొట్టికాయవేయ
నెట్టి రికవరియును జేయ
లేకపోవుటకును వారు
సీమాంధ్రులు కావడమే!
తెలంగాణ రాష్ట్రమందు
ఇట్టి అక్రమార్కుల పని
పట్టి, భూములను వెనుకకు
తీసుకొనుట జరుగునయ్య!
అక్రమాలు చేసినట్టి
వారందరికిని శిక్షలు
వేయుట తప్పక జరుగును!
తథ్యము...తథ్యము...తథ్యము!!
నష్టపోయినట్టి రైతు
లందరికిని న్యాయమైన
పరిహారము నిప్పించియు
ఆదుకొనుట జరుగునయ్య!
*** *** *** ***
ఇదే అంశంలో మరిన్ని వివరాలకై
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి