రంగరెడ్డి జిల్లలోన
అక్రమ మైనింగు జరుగు
చున్నను సీమాంధ్ర ప్రభుత
చూచిచూడనట్టు ఉండె!
ఏపీఐఐసీ భూ
ములు పొందిన సంస్థలకును
పది సంవత్సరములకై
వెసులుబాటు జీవొలిడియె!
మైనింగ్ అక్రమములందు
విధియించిన జరిమానాల్
రద్దుచేసినట్టి ఘనత
సీమాంధ్రా మంత్రులదే!
విజిలెన్సధికార్లు నిజము
నిగ్గుతేల్చి జరిమానా
లను విధింప, తెలిసికూడ
చర్యగొనని ప్రభుత ఇదియె!
అక్రమ మైనింగు జరుపు
చున్నట్లుగ తెలిసికూడ
నిర్లక్ష్యం వహియించిన
ఏ.డీ.పై చర్య సున్న!
దశాబ్దాలనుండి యిచట
జరుపునట్టి అక్రమాల
మాఫియాకు ఆంధ్ర ప్రభుత
పెద్ద పీట వేసినదయ!
వందలకోట్లగు ధనమును
ప్రభుతకు చెల్లించకుండ
ఆంధ్రా పెత్తందారులు
ఎగగొట్టుచు నుండిరయ్య!
పాలకులును వీళ్ళతోడ
కుమ్మక్కై జరుపునట్టి
దోపిడీలు ఎన్నెన్నో
ఇపుడు బయటపడినవయ్య!
తెలంగాణలోననున్న
కొలువులపై, జలములపై,
భూములపై, వనరులపై
సీమాంధ్రుల దోపిడి ఇదె!
అరువదేండ్లనుండి తెలం
గాణపైన సీమాంధ్రుల
దోపిడీకి ఉదాహరణ
ఇట్టి అక్రమార్కులయ్య!
తెలంగాణ గనులపైన
సీమాంధ్రుల అధికారము
అక్రమముగ సాగించెడి
ఎన్నొ ఉదంతాలు గలవు!
ఒక్కసారి లీజు హక్కు
పొంది దశాబ్దాలుగాను
అక్రమమైనింగ్ చేయగ
కనుట ప్రభుత సిగ్గుచేటు!
ప్రభుత రాజినామ చేయు
సమయమందు దొంగ జీవొ
లెన్నొ జారి చేసి దిగిన
మంత్రులపై చర్య ఏది?
అక్రమార్కులకు వేసిన
ముప్పదిమూడగు కోటుల
జరిమానాపై స్టేనిడు
మంత్రులపై చర్య ఏది?
జనవరి, ఫిబ్రవరి నెలల
లోన జారిచేసినట్టి
జీవోలపై సీబీఐ
దర్యాప్తును జరుపవలెను!
తెలంగాణ వనరులన్ని
దోచుకొన్న సీమాంధ్రులు,
మంత్రులపై చర్య గొనియు,
తగిన శిక్ష వేయవలెను!
పెత్తందారులు, మంత్రులు
తిన్నదంత...చిన్ననాటి
దొండాకుల పసరుతోడ
వెంటనె కక్కించవలెను!
*** *** *** ***
ఇదే అంశంపై మరింత సమాచారానికై
దీనిపై క్లిక్ చేయండి
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి