గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, ఏప్రిల్ 19, 2014

మీ వైఖరి స్పష్టంచేయండి!


ఏపీలో ఉన్న అన్ని
పార్టీలును తెలంగాణ
కును వ్యతిరేకముగ నుండ,
టీఆరెస్ అనుకూలమె!

తెలంగాణ వ్యతిరేకుల
వైఖరిగని కలత చెంది
వేలమంది యువకులు ఇట
ఆత్మహత్యలకు బూనిరి!

కాంగ్రెసేమొ తెలంగాణ
పైన ఏమి తేల్చకుండె!
టీడీపీ రెండు కండ్లు!
వైసీపీ తటస్థమ్ము!

దీని గనిన ఆ యువకులు
ఆత్మహత్యలకు బూనిరి!
టీఆరెస్ మాత్రమె ఆ
యువకులకు నివాళులిడెను!

తెలంగాణ తెచ్చుటకై
పెద్ద పాత్ర పోషించుట,
మిగతా పార్టీల కిపుడు
టీఆరెస్‍పై అక్కసు!

కేసీఆర్ అన్ని పార్టి
లను దూషించుచు నున్నా
డనియు గుర్రుగాను చూచు
చున్నవెంతొ కోపంతో!

తెలగాణులు ఈ పార్టిల
నమ్మవలయునన్న ఇపుడు
పార్టీ వైఖరి యిట్టుల
తెలిపి నిరూపింపవలెను!

పోలవరం నిర్మాణము
తక్షణమే ఆపింపుడు! (1)
మునుగు ఏడు మండలాలు
తెలంగాణను ఉండవలయు! (2)

సచివాలయమందు ఆంధ్ర
వాళ్ళను ఆంధ్రకె పంపుడు! (3)
తెలగాణకు ప్రత్యేకపు
ప్రతిపత్తిని ఇప్పింపుడు! (4)

ఉన్నత విద్యను పదేండ్ల
రిజర్వేషనును ఆపుడు! (5)
ఉమ్మడి రాజధానిపుడు
మూడేండ్లకు కుదియింపుడు! (6)

అక్రమార్క భూబకాసు
రుల భరతము పట్టింపుడు! (7)
ఆగినట్టి తెలంగాణ
ప్రాజెక్టుల నిర్మింపుడు! (8)

ఏపి భవను తెలగాణకె
తత్క్షణమే ఇప్పింపుడు! (9)
హైద్రబాదు భద్రతలను
గవర్నరుకు తప్పింపుడు! (10)

ఆంధ్ర పెన్షనర్ల నాంధ్ర
కును వెంటనె పంపింపుడు! (11)
అప్పులవాటా ఇరువది
తొమ్మిది శాతమె కోరుడు! (12) 

ఇంకా ఎన్నో ఉన్నవి
ఇవి మాత్రము ముఖ్యమయా!
ఇవి తప్పక నెరవేర్చిన
బంగరు తెలగాణ అగును!

వీటి పైన తత్క్షణమే
మీ వైఖరి తెలిపినచో,
తెలగాణులు మిము నమ్మియు
అక్కున చేర్చుకొందురయ!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి