తేది: సెప్టెంబర్ 04, 2012 నాటి శంకరాభరణములోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన ఉత్పలమాలావృత్తము
అన్నులమిన్న బొమ్మలను నమ్మఁగఁ బ్రొద్దున నేగుదెంచెఁ దా
నన్నువ వేసమందు సొగసైనటువంటియు మేని పొంకమున్
మిన్నెగయంగ; మింటిదొర మీలన మేమియు లేక చూడఁగన్,
వన్నెలు చిందులాడె; వలపాఱఁగఁ బోసె; నిదేమి చోద్యమో?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి