లక్ష్యమ్మును ఆశించియు
జరిగినట్టి సంగ్రామము,
లక్ష్యం నెరవేరనిచో
తప్పక పునరావృతమగు!
భారత కాలముననైన,
రామాయణ కాలమైన,
ఏ యుగమ్మునందైనా
జరుగునదియు ఇదెనయ్యా!
అన్ని సమస్యలు పరిష్క
రింప బడుననియు నెంచిన
తెలగాణుల ఆశలన్ని
అడియాసలు ఆయెనయ్య!
భౌగోళిక తెలంగాణ
సాధనె అంతిమ లక్ష్యమ?
మన అందరి ఆశయమ్ము
బంగరు తెలగాణ కదా!
మేధావులు చర్చ చేసి,
సాధించిన తెలంగాణ
మెట్లు ఉండవలెనో అని
వివరముగా చెప్పిరయ్య!
ఈ లక్ష్యం నెరవేరని
పక్షంలో మరల ఉద్య
మమ్ము తప్పదయ్య నేడు
సకల జనులకందరికిని!
ఒకేఒక్క మలుపు వద్ద
తెలంగాణ నిలిచినదయ!
ఈ మలుపే ఎన్నికలకు
చారిత్రాత్మకపు మలుపు!!
దశాబ్దాల గాయాలను
మాన్పగలుగు ఎన్నికలివె!
చరిత్రగతి మార్చునట్టి
సక్రమమగు ఎన్నికలివె!!
వేలాది యువక రక్తపు
తర్పణముతొ వ్రాసికొనగ
బోవునట్టి తెలంగాణ
భవితవ్యపు ఎన్నికలివె!!
మన రాష్ట్రము మనకిడుటకు
అరువదేండ్ల కాలము గొనె!
ఎన్నొ ఉద్యమాలు, వేల
యువకుల బలిదానము గొనె!!
ఎంతో జీవన విధ్వం
సమ్మాయెను! వలసవాద
అవశేషాల్ చంద్రబాబు,
వెంకయ్యల రూపమెత్తె!!
సీమాంధ్రుల ఆధిపత్య
రహస్యంపు ఎజెండాల
రచనలు కొనసాగుచుండ
గా వచ్చిన ఎన్నికలివె!
కేంద్రము సంపూర్ణ తెలం
గాణ మిడక, అసంపూర్ణ
తెలంగాణ మిడి, సీమాం
ధ్రులవైపే మొగ్గుజూపె!
తెలంగాణపు పునర్ని
ర్మాణము చేయగవలసిన
అవసరమేర్పడగ, ఎదురు
పడినయట్టి ఎన్నికలివె!
ఉమ్మడి రాజధానియని
సీమాంధ్రుల ఏజెంట్లకు
తెలంగాణ అధికారము
కట్టబెట్టుకొనగవలెనె?
అరువదేండ్లుగా తెలగా
ణకు జరిగెడి అన్యాయాల్
ఎదిరింపని కాంగ్రెసునకు
ఓట్లేసియు నిలుపవలెనె?
ఆంధ్రాపార్టీలవారి
మోచేతుల క్రింది నీళ్ళు
త్రాగు బానిసలకు మనము
ఓట్లేసియు నిలుపవలెనె?
తెలంగాణ రాష్ట్రముకై
పుట్టి, ఉద్యమించి, రాష్ట్ర
మును తెచ్చిన టీఆరెస్
నెన్నుకొనియు దరిజేర్చరె?
టీఆరెస్ నే మనమిపు
డెందుకు గెలిపించవలెను?
తెలగాణను బంగారపు
తెలంగాణ చేయుకొరకు!
సీమాంధ్రులు పొందినట్టి
లక్షలాది ఎకరమ్ముల
భూములన్ని తిరిగి మనకు
సంక్రమింప జేయుకొరకు!
పోలవరపు ముంపు మండ
లాలను సీమాంధ్రలోన
కలుపు కుట్ర ఛేదించియు,
కొండ జనుల కాచుకొరకు!
తెలంగాణ యువకులకును
దక్కవలసినట్టి కొలువు
లన్నియు సీమాంధ్ర చేతి
నుండి తిరిగి పొందుకొరకు!
అమరవీరకుటుంబముల
నిపుడు ఆదుకొనుటకొరకు!
తెలంగాణ మిడి, విడిచిన
సౌకర్యముల గొను కొరకు!!
టీఆరెస్ ఉద్యమించు
కాలము చని, రాజకీయ
శక్తిగ మారెడి కాలము
ఆగమించె నేడిచ్చట!
కేంద్రమ్మును మెడలు వంచి,
తెలంగాణకును నిధులను
తగు వనరుల పొందుకొరకు
టీఆరెస్ గెలువవలెను!
సీమాంధ్రుల ప్రమాదమ్ము
ఇంకా పొంచియును ఉండె!
సీమాంధ్రుల చేతి కీలు
బొమ్మలు తెలగాణ నుండ్రి!!
తెలంగాణ వచ్చి కూడ
సీమాంధ్రులె రాష్ట్రమ్మున
చక్రము తిప్పుచు ఇంకా
తెలగాణను ఉండవలెనె?
సీమాంధ్రుల నీడ పడని
సంపూర్ణపు తెలంగాణ
సాధించునదొక్కటియే!
అదియే మన టీఆరెస్!!
కావున ఓ ప్రజలారా,
మనను మరల బానిసలను
చేయువారి కిపుడిక మన
ఓటేసియు గెలిపింతురె?
మన కోసము ప్రాణమ్మును
సైతము ఫణముగ బెట్టిన
కేసీఆర్ నే ఇపుడిట
ఓటేసియు గెలిపింతురె?
నిర్ణయించుకొనుడయ్యా,
బతుకు దిద్దుకొనుడయ్యా,
బంగారపు తెలంగాణ
తప్పక సాధింపుడయ్య!
ఇదియే మన భవితవ్యం!
ఇదియే మన వెలుగుబాట!
ఇదియే ఘనచరిత చాటు
చక్కనైన అవకాశము!!
*** ***
*** ***
ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని
వివరాలకై
(నమస్తే తెలంగాణ దినపత్రిక
సౌజన్యంతో…)
జై తెలంగాణ! జై జై
తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి