గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, ఏప్రిల్ 08, 2014

పోరుకై పోటీ...గెలుపుకై ధాటీ!


పోరుగల్లు ఓరుగల్లు
లోన ఎన్నికలకు పోటి
ఎటులున్నదొ తెలిసికొనగ
ఉత్సాహము పొడకట్టును!

తెలంగాణ రాష్ట్రసాధ
నమ్మునకై ఉద్యమములు
నిరంతరము కొనసాగిన
ఓరుగల్లు పోరుగల్లె!

ప్రజలలోన తెలంగాణ
ఆకాంక్షయె బలీయముగ
నాటినట్టి నేతలిచట
మార్గదర్శులుగ నిలిచిరి!

బంగరు తెలగాణ నిపుడు
సాధించుటకొరకు మార్గ
మును సుగమము నెవ్వరు
చేతురొ వారే గెలుతురు!

ప్రజాభీష్టములను సరకు
సేయని నాయకుల నిపుడు
ఓడించగ ప్రజలు మిగుల
నుత్సాహముతోనుండిరి!

తెలంగాణ రాష్ట్రమ్మును
ప్రగతిపథంలోన నడుపు
పార్టీనే గెలిపింపగ
పూనుకొనియు వేచియుండ్రి!

తెలంగాణ రాష్ట్రమ్మున
ప్రభుత్వమ్మునేర్పరించి,
స్వర్ణతెలంగాణ నెవరు
చేతురొ వారికె ఓటట!

భవిష్యత్తు తీర్చిదిద్దు
కొనగ తెలివి గలిగినట్టి
ప్రజలను తక్కువ అంచన
వేయవద్దు అనుచుండిరి!

ఎవరిని ఇట విజయలక్ష్మి
వరియించగ నుండినదో
ప్రజలే తమ ఓటుతోడ
నిర్ణయింపనుండిరయ్య!

***     ***     ***     ***

ఈ అంశంలో మరిన్ని వివరాలకై

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి