తెలంగాణ ఉద్యమమ్ము
ఉవ్వెత్తున ఎగయుచున్న
సమయంలో పొన్నాలా,
నీవు ఎక్కడుంటివోయి!
ఒక్కనాడు తెలంగాణ
ఉద్యమాన లే॑కున్నను
తెలంగాణ తెచ్చితినని
నీల్గుచుంటివేలనోయి!
తెలంగాణ కోసం నువు
రాజినామ చేశావా?
సీమాంధ్రుల మోచేతుల
నీళ్ళుతాగకున్నావా?
తెలంగాణ ప్రాజెక్టులు
ఎన్ని పూర్తిచేశావయ?
తెలంగాణ రైతులకును
ఎన్ని నీళ్ళనిచ్చావయ?
కేటాయింపులే లేని
సీమాంధ్రుల ప్రాజెక్టులు
పూర్తిచేయనిచ్చి నీవు
నీళ్ళు దోచనీయలేదె?
ఎన్నడైన తెలంగాణ
కన్యాయం ఆపావా?
మంత్రివర్గమందు తెలం
గాణగూర్చి పలికావా?
తెలంగాణ కొక్కపైస
ఈయననియు అన్నప్పుడు
నల్లారిని ఎదిరించక
ఎందుకూరుకుంటివోయి?
సీమాంధ్రుల దొంగ ఉద్య
మమ్ము జరుగునపుడు నీవు
ఉలుకు పలుకు లేకయుండి,
ఎదిరించితివా చెప్పుము!
సీమాంధ్రుల ముందు నీవు
నక్కవినయములు చూపుచు,
బానిసలా పనిచేసియు
తెలంగాణ తెచ్చావా?
తెలంగాణ ఉద్యమమున
ఎన్నిసార్లు పాల్గొంటివి?
సకల జనుల సమ్మెలోన
ఏ మూలన దాగుంటివి?
తెలంగాణ కోసము తన
మంత్రి పదవి వదలుకున్న
కేసీఆర్ ముందు నీదు
లెక్క ఎంత చెప్పుమోయి!
గబ్బిలమ్ము వోలె మంత్రి
పదవినంటి ఉన్న నీకు,
కేసీఆర్ పేరు నెత్త
అర్హతయే లేదోయీ!
తెలంగాణ రాష్ట్రముకై
కేంద్రమ్మును కదిలించగ
నీవు నిరాహార దీక్ష
చేసితివా చెప్పుమోయి!
ధనసంపాదనపై గురి
కలిగినట్టి నీకు తెలం
గాణపైన గురి ఎట్టుల
కలుగలేదొ చెప్పుమోయి!
కేసీఆర్ పూనుకొనక
పోయినచో ఉద్యమాలు
జరిగెడివా? కాంగ్రెస్సే
తెలంగాణ ఇచ్చెడిదా?
తెలంగాణ బిల్లు లోన
కేసీఆర్ సూచించిన
సవరణముల, నెరవేరని
సవరణములు అనగనేల?
సంపూర్ణపు తెలంగాణ
నీయకుండ కేంద్రమ్మే
ఆంక్షలతో నిచ్చుచుండ
నెప్పుడైన అడిగితివా?
పోలవర డిజైను మార్చి,
తెలంగాణ గిరిజనులకు
అన్యాయము జరుగకుండ
ఉండుటకై కోరితివా?
ఏడు ముంపు మండలాల
సీమాంధ్రను కలుపునట్టి
ఆర్డినెన్సు కెప్పుడైన
వ్యతిరేకత తెలిపితివా?
కాంగ్రెస్సే తెలంగాణ
నిచ్చెనన్న పద్నాలుగు
వత్సరాలు ఎందుకాయె
నో ఇప్పుడు చెప్పుమోయి!
కాంగ్రెసునకు తెలంగాణ
ఇచ్చు యోచనము ఉన్నచొ
వేయిమంది బలిదానము
లేల జరిగె చెప్పుమోయి!
కేంద్రప్రకటనము తదుపరి
సీమాంధ్రులు రాజినామ
చేసిరి! మీరేల చేయ
లేదో మరి చెప్పుమోయి!
ఏమి చేసితివి అనుచును
తెలంగాణులంతచేరి
నీ కాంగ్రెస్ గెలిపించగ
పూనుకొనగ వలెనొ చెప్పు?
ఏమి చేసితివని నిన్ను
బంగరు తెలగాణ తెచ్చు
నేతవనియు తెలగాణులు
నమ్మెదరో చెప్పుమోయి!
నీవు చెప్పు మాటలన్ని
వినగానే నమ్మేందుకు,
తెలంగాణలోని ప్రజలు
చెవిని పువ్వు పెట్టి లేరు!
మోసకారి కాంగ్రెస్సును
సీట్లుకోరు కాంగ్రెస్సును
ఓట్లుకోరు కాంగ్రెస్సును
తెలగాణులు గెలిపింపరు!
ఎన్నికలకు ముందు, మేము
తెలంగాణ నిచ్చితిమని
డబ్బకొట్టు కాంగ్రెస్సును
తెలగాణులు గెలిపింపరు!
మిఠాయి పొట్లం ఇచ్చెద
మని, మిఠాయి లేని పొట్ల
మిచ్చినట్టి కాంగ్రెస్సును
తెలగాణులు గెలిపింపరు!
నేడు కాంగ్రెసే చేసెడి
వాగ్దానములన్నినేతి
బీరలోని నేయె! కనుక
తెలగాణులు గెలిపింపరు!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి