గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఏప్రిల్ 20, 2014

నా బలం వీళ్ళే!


తెలంగాణ సాధనలో
నాకు బలముగా నిలిచెను
గాంధీ సత్యాగ్రహమే!
అలుపెరుగని ప్రజాబలమె!!

కొత్తపల్లి జయశంకరు,
ప్రొఫెసరు కోదండరాము,
నాకు వెన్నుదన్నుగాను
నిలిచి భుజము తట్టినారు!

తెలంగాణ రాష్ట్ర సమితి
పార్టీ సభ్యులు, నేతలు
తెలంగాణకై ప్రతి ఘట
నమ్మునందు తోడుపడిరి!

టీచర్లును, విద్యార్థులు,
ఉద్యోగులు, వ్యాపారులు
రైతన్నలు, కూలీలును
అందరు ఒకటై నిలిచిరి!

డాక్టర్లును, ఇంజనీర్లు,
లాయర్లును, అధికారులు
తెలంగాణ సాధనమున
ఒక్క తాటిపై నిలిచిరి!

 కవులు, గాయకులు ఒక్కటి
అయ్యి, తెలంగాణ భావ
జాల వ్యాప్తి కొరకు గేయ
మును చేకొని సాయించిరి!

గద్దరన్న, గోరేటియు,
అందెశ్రీ, దేశపతియు,
రసమయియును, విమలక్కయు
గజ్జెకట్టి ఆడిపాడ్రి!

సీమాంధ్రా పార్టీలను
టీఆరెస్ ఎదుర్కొనెను!
సీమాంధ్రా మీడియాను
టీ న్యూస్, టీ పత్రికొత్తె!!

 శ్రీకాంతుడు, యాదిరెడ్డి,
ఇషాన్ రెడ్డి మొదలు వేయి
పైన అమరవీరు లాత్మ
బలిదానమ్ములు చేసిరి!

వీరందరు నాకు బలము!
వీరు లేకయున్న నేను
తెలంగాణ రాష్ట్రమ్మును
ఎట్లు తేగలుగుదునయ్య?

***     ***     ***     ***
ఈ అంశంపైనే మరిన్ని వివరాలకై

(కట్టా-మీఠా బ్లాగు సౌజన్యంతో...)

 జై తెలంగాణ!   జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి