చంద్రబాబు దొంగ అనుచు
జగన్మోహనుండు పలుక,
జగన్మోహనుడె దొంగని
చంద్రబాబు పలుకుచుండె!
ఇద్దరు సీబీఐచే
విచారింపదగినవారె!
ఈ ఇద్దరు రాష్ట్రమ్మును
కొల్లగొట్టినట్టివారె!!
రాజశేఖరుండు దోచి
జగన్మోహనునకీయగ,
నార చంద్రబాబు దోచి
సింగపూరునందు దాచె!
ఈ ఇరువురి చాడీలిట
అక్షరాల సత్యమయ్య!
రాష్ట్రమ్మును దోచుటలో
దొందూ దొందేనయ్యా!!
*** *** *** ***
మరిన్ని వివరాలకు:
(నమస్తే తెలంగాణ సౌజన్యంతో...)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి