బంగరు తెలగాణ సాధ
నమ్మునకై సహకరించు
నేతలనే కలుపుకొనియు
పోవలె మన జేఏసీ!
రాజకీయ పార్టీలిట
మనకు ముఖ్యమే కావు!
అంతిమముగ సాధించెడి
ధ్యేయమ్మే ముఖ్యముకద!!
అరువదేండ్లుగా తెలగా
ణకు జరిగెడి అన్యాయము
నెదిరింపని కాంగ్రెసునకు
జేఏసీ మద్దతేల?
తెలంగాణ ద్రోహియైన
టీడీపీతో పొత్తును
పెట్టుకున్న బీజేపికి
జేఏసీ మద్దతేల?
అటు ఆంధ్రా, ఇటు తెలగా
ణమ్మును మ్రింగగ నెంచిన
వైసీపీ పార్టీకిని
జేఏసీ మద్దతేల?
దశయు దిశయు లేనియట్టి
సీపీఐ, సీపీఎం
పార్టీలను బలపరచగ
జేఏసీ మద్దతేల?
ఇరువదేండ్లు పాలించియు
“తెలంగాణ పేరెత్తగ
వద్దు” అనిన టీడీపికి
జేఏసీ మద్దతేల?
పార్టీలన్నిటి వైఖరె
వేయిపైన వీరయువక
బలిదానము నందెననియు
జేఏసీ కెఱుక లేదె?
మన ప్రొఫెసర్ జయశంకర్
బతికియున్నచో ఎవరికి
మద్దతు నిడునో వారికె
జేఏసీ మద్దతిడుడు!
పద్నాలుగు వత్సరాల
తెలంగాణ ఉద్యమమును
మొక్కవోని శౌర్యముతో
నడిపించెను కేసీఆర్!
తెలంగాణ రాష్ట్రముకై
చావునోట తలపెట్టియు,
తెలంగాణ ప్రకటనమును
ఇప్పించెను కేసీఆర్!
ఇంటి పార్టి టీఆరెస్
బంగారపు తెలంగాణ
సాధనకై పూనెగాన
జేఏసీ మద్దతిడుడు!
సుస్థిరమగు ప్రభుత్వమ్ము
తెలంగాణ అస్తిత్వము
మనకిప్పుడు వలయుగాన,
జేఏసీ మద్దతిడుడు!
రేపు ప్రభుత్వము ఏర్పా
టును చేయును టీఆరెస్!
టీఆరెస్ జేఏసీ
కలిసి పనులు చేయవలెను!!
తెలంగాణ అభివృద్ధికి
మరియు పునర్నిర్మాణము
కై ఈ రెండును కలిసియు
ఎన్నో చేయగవలయును!
గత జేఏసీ నేతలు
ఆనంద్ రావ్, జయశంకర్
వలెను రాజకీయ పరిణ
తితొ యోచన చేయవలెను!
కేసీఆర్ చేయబోవు
తెలగాణ పునర్నిర్మా
ణ యజ్ఞముకు జేఏసీ
తప్పక మద్దతు నిడవలె!
మద్దతెవరికీయవలెనొ?
అనుచు కాలమును వ్యర్థము
పుచ్చక మన జేఏసీ
మద్దతు కేసిఆర్ కిడవలె!
***
*** *** ***
ఈ అంశంపై మరిన్ని వివరాలకై
(నమస్తే తెలంగాణ
దినపత్రిక సౌజన్యంతో…)
జై తెలంగాణ!
జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి