తెలుగు విశ్వవిద్యాలయ
మందుగూడ సీమాంధ్రులు
తిష్ఠవేసి, తెలగాణుల
కొలువులన్ని కొల్లగొనిరి!
నియామకపు నిబంధనలు
తుంగను ద్రొక్కియు వారలు
ఆంధ్ర ఆధిపత్యముతో
దోపిడీని సాగించిరి!
ఆచార్యులు వారలవే,
పర్యవేక్షకులు వారివె!
తెలగాణకు అల్పమైన
క్రింది స్థాయివౌ కొలువులె!!
క్రింది స్థాయి కొలువులందు
గూడ వారె పొత్తుగూడి,
తెలగాణుల ఉద్యోగాల్
గూడ వారె అనుభవించ్రి!
స్థానిక కొలువులు తెలగా
ణులకె ఈయవలసియుండ,
సీమాంధ్రులు కొల్లగొట్టి,
ఉద్యోగాలేలుచుండ్రి!
తెలంగాణ రాష్ట్రమందు
ఈ ఉద్యోగుల విభజన
స్థానికతను ఆధారము
చేసికొనియు జరుపవలెను!
తెలగాణులు తెలగాణలొ,
సీమాంధ్రులు సీమాంధ్రలొ,
తమ తమ ఉద్యోగమ్ములు
చేసికొనగవలెనయ్యా!
తెలంగాణ నోటమట్టి
కొట్టి, కొలువులన్ని పట్టి,
కులుకుచున్న సీమాంధ్రుల
సీమాంధ్రకె పంపవలెను!
తెలంగాణ ఉద్యోగాల్
తెలంగాణకీయవలెను!
సీమాంధ్రుడు ఒకడు గూడ
ఇచటి కొలువు పొందరాదు!!
ఆంధ్రపాలకుల మోసము
తెలగాణుల పొట్టగొట్టె!
ఇంకా ఆ మోసగాండ్రు
మా కొలువుల నుండ దగరు!!
ఒక్కరంటె ఒకరుగూడ
తెలంగాణ సొమ్ము తినగ
తగరు, అక్రమార్కులైన
పరాన్న జీవులు వారలు!!
పంపవలెను, పంపవలెను,
సీమాంధ్రకు పంపవలెను!
అక్రమముగ కొలువు గొనిన
సీమాంధ్రుల పంపవలెను!!
స్థానికులను ఇటనుంచియు,
స్థానికేతరుల పంపుడు!
తెలగాణకు న్యాయమ్మును
తప్పకుండ జరిపింపుడు!!
*** *** *** ***
ఈ విషయంలో మరింత సమాచారానికై
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి