గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, ఏప్రిల్ 22, 2014

ఆంధ్రా పార్టీ హఠావో...తెలంగాణా బచావో...


కుడుమంటే పండుగనెడు
తెలగాణులు అమాయకులు!
కావుననే ఆంధ్రవారు
అరువదేండ్లు పాలించిరి!

తెలంగాణలోన వారి
ఆటలింక సాగవలదు!
వారి దోపిడీకి అడ్డు
కట్టవేయవలయునయ్య!!

సీమాంధ్రపు నయవంచక
పార్టిల మోసమ్ముల నిక
తెలగాణులు గుర్తెరిగియు
తగిన బుద్ధి చెప్పవలెను!

ఇంకా ఆంధ్రా పార్టిల
మనుగడ తెలగాణలోన
కొనసాగుట వలన మనకు
శ్రేయస్కరమే కాదయ!

వారి కుట్రలన్ని తిప్పి
కొట్టవలసినట్టి తరుణ
మిదియేయని తెలిసికొనియు
తగిన శాస్తి చేయుడయ్య!

ఇట్టి ఆంధ్ర పార్టిల కిట
స్థానమ్మే లేదంచును
రాబోయే ఎన్నికలలొ
నిరూపింపవలెనయ్యా!

ఆంధ్ర వలస పాలనలో
అన్ని రంగములయందున
జరిగినట్టి విధ్వంసము
ఎలుగెత్తియు చాటవలెను!

ఇట్టి ఆంధ్ర పార్టిల నిక
ఒక్క శాతమైన మనము
ఆహ్వానించితిమా, మరి,
భావితరం క్షమియించదు!

ఆంధ్ర పార్టి కొమ్ముకాయు
తెలంగాణ నేతలెవరొ
గుర్తెరిగియు, వారి నిపుడు
ఎన్నికలలొ ఓడింపుడు!

మనను బానిసత్వపు గిరి
నుండి బయట పడవేసిన
నేతలనే గుర్తెరిగియు

ఎన్నికలలొ గెలిపింపుడు!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి