గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, ఏప్రిల్ 26, 2014

లక్ష హామీలిచ్చినా...తెలంగాణులు నమ్మరు!


తెలంగాణ ప్రజలారా,
కాంగ్రెస్సును నమ్మకండి!
ఓట్లకొరకు మాయమాట
లాడుచుండ్రి నమ్మకండి!!

మహిళా ముఖ్యమంత్రి అట!
ఒరుగల్ రెండో ఐటీ
రాజధానిగాను ఇపుడు
నడుంకట్టి చేతురంట!!

అట్లే, అపెరల్ టెక్స్‍టైల్
పార్కును నిర్మింతురంట!
నాల్గువేల మెగావాట్ల
విద్యుత్‍ ప్లాంటిచ్చెదరట!!

ఏట లక్ష ఉద్యోగాల్,
ప్రైవేట్ రెండులక్షలట!
రైతులకును రెండులక్ష
ల ఋణ మాఫి చేతురంట!!

పదేండ్లు టాక్స్ హాలిడేను
తెలగాణలొ ఇత్తురంట!
గాంధి, నిమ్స్ వైద్యకళా
శాలల అప్‍గ్రేడ్ సేతట!

తెలంగాణ ప్రజలారా,
కాంగ్రెస్సును నమ్మకండి!
ఓట్లకొరకు మాయమాట
లాడుచుండ్రి, నమ్మకండి!!

***     ***     ***     ***

ఇవి అన్నియు అరువదేండ్ల
నుండి ఎందుకు గుర్తునకు
రాలేదో చెప్పుడయ్య!
ఇప్పుడేల గుర్తుకొచ్చె?

ఇప్పుడిన్ని హామీలను
ఇచ్చుచుండ్రి గాని, గతము
లోన ఇవియు లేకుండుట
మీరెరుగరె, ఏల లేవు?

గత మీ పాలనమందున
ఇవి ఎందుకు చేయలేదు?
ఓట్ల హామి చెత్తబుట్ట
దాఖలుకై ఇవికావా?

టెక్స్టైల్ పార్క్ అనుచుంటిరి,
ఏజేమిల్ ఏలపోయె?
ఋణముల మాఫీ అంటిరి,
నష్టపు పరిహారమేది?
(పంట నష్టపరిహారం సీమాంధ్రకు ఇచ్చారు,
తెలంగాణకు మొండిచేయి చూపించారు)

విద్యుత్ ప్లాంట్ గతంలోన
నెలకొల్పగలేదెందుకు?
గతంలోన ఇచ్చినట్టి
హామీల్ నెరవేర్చితిరా?

కేసీఆర్ పైన బురద
చల్లి ఓట్లు కొల్లగొట్టు
డమ్మి ప్రణాళికే గాని,
నెరవేర్చెడి దిదికాదయ!

తెలంగాణ నిచ్చితిమని
జబ్బ చరుచు కొనగ నేల?
కేసీఆర్ ఉద్యమింప
కున్న మీరు ఇచ్చెదరే?

కేసీఆర్ ఉద్యమించ,
ప్రజలందరు కదలిరయ్య!
కాంగ్రెస్సిది చూచి కూడ
ఏల రాష్ట్రమిడకున్నది?

పద్నాలుగు వత్సరాలు
లేటెందుకు చేస్తిరయ్య?
వేయిమంది బలిదానాల్
చేయించితి రెందుకయ్య?

కేసీఆర్ మాటతప్పె
ననుచుంటిరి, ఇదియె తప్పు!
కేసీఆర్ కోరగానె
ఏల తెలంగాణీయరు?

వేయిమంది బలిదానము
జరిగినంక, తెలంగాణ
ఓట్లకొరకు ప్లానువేసి,
తెలంగాణ ఇచ్చుటేల?

మిఠాయిపొట్లం ఇత్తుము
అని ఇచ్చిరి, కాని, అందు
మిఠాయేది? సీమాంధ్రుల
కే మిఠాయి ఇస్తిరి కద!

తెలంగాణ వెనుకబాటు
నకు బాధ్యులు మీరు కాదె?
సీమాంధ్రుల జూచినట్లు
తెలగాణుల జూచినారె?

సీమాంధ్రను విమానాశ్ర
యమ్ము లెన్ని యున్నవయా?
తెలంగాణలోన ఎన్ని
యున్నవయ్య లెక్కింపుము!

ఒక్క విమానాశ్రయమ్ము
నిర్మితమ్ము ఏలకాదు?
మామునూరు నైన మీరు
ఏల వృద్ధి చేయలేదు?

పోనీయుడు, కేసీఆర్
ఒక్కడె తన పార్టీలో
కొనసాగును, మీరు కూడ
ఎవరో ఒకరుండగలరె?

సోనియమ్మ, రాహులుండు,
ప్రియాంకలును కాంగ్రెస్‍లో!
కేసీఆర్, కేటీఆర్,
కవితలు టీఆరెస్‍లో!!

ఏది కుటుంబంపు పార్టి?
మీది కుటుంబంపు పార్టి!
వారిది ఉద్యమ పార్టీ!
తెలివిగలిగి తెలిసికొనుడు!!

తెలంగాణ రాష్ట్రమందు
హైద్రబాదు తెలగాణదె!
"అది అందరి" దని అందువు,
అందరి దది యెట్లగునయ?

అందరిదన ఎవ్వరిదయ?
నీ మాటలొ సీమాంధ్రులు
మెదలుచుండిరనునదియే
పచ్చినిజము, ఎట్లు కుదురు?

మభ్యపెట్టు హామీలతొ
తెలగాణుల చెవిని పువ్వు
పెట్టబూనినట్టి నీదు
కాంగ్రెస్సే నశియించును!

తెలంగాణ రాష్ట్రమ్మును
కేసీఆర్ సాధించెను!
రాష్ట్రమిచ్చు పరిస్థితులు
తానే కల్పించెనయ్య!!

కేసీఆర్ లేకుండా,
తెలంగాణ మనలేదయ!
బంగారపు తెలంగాణ
ఆయనె సాధించునయ్య!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

4 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

కేసీఆర్ లేకుండా,
తెలంగాణ మనలేదయ

Oh!

But... KCR is not immortal.
What happens when he is no more?
No more Telangana?
Are you now thinking that Telangana is to feed KCR and his family only and get pittances from him in return?

What is your thinking?
This is just a here worship of yours and nothing else!!

nsp చెప్పారు...

What you said is correct.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

కేసీఆర్‍కు తెలంగాణతో ఉన్న అనుబంధం ఆంధ్రవాళ్ళకేం తెలుస్తుంది? ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి? చావుదాకా వెళ్ళి తెలంగాణ ప్రకటన ఇప్పించడానికి కారకుడైనాడు కేసీఆర్! ప్రజల్లో రాష్ట్రసాధానాసక్తిని రేకెత్తించిందే కేసీఆర్! సీమాంధ్ర రాళ్ళకు ఆయన హృదయం అర్థం కాదు. తెలంగాణులకు అర్థమవుతుంది. అంతే!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

సంతోషం మిత్రమా!

కామెంట్‌ను పోస్ట్ చేయండి