గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, ఏప్రిల్ 07, 2014

వాళ్ళు మన భవిష్యత్తును కూల్చారు!


తెలంగాణ రాష్ట్రమ్మును
ఉద్యమించి సాధించియు,
తెలగాణులు తమ రాష్ట్రము
స్వర్ణమ్ముగ మార్చలేరె?

మన రాష్ట్రమునందు మనమె
కర్తలముగ ఉండవలెను!
ఆంధ్రపార్టినాయకులను
కర్తలనుగ చేయవలెనె?

ఈ ఎన్నికలందు మనము
స్వర్ణతెలంగాణనిచ్చు
పార్టీనే గెలిపించియు
ఋణము తీర్చుకొనవలెనయ!

కాంగ్రెస్సును గెలిపించిన,
వారు కేంద్ర హస్తమందు
కీలుబొమ్మలే కావున
తెలగాణకు మోసమగును!

బీజేపీ కూడ అంతె!
మరియు తాను టీడీపీ
మోసగాండ్ర పార్టీతో
పొత్తు పెట్టుకొనియెనయ్య!

బీజేపీ నాడు మూడు
రాష్ట్రాలిడి, చంద్రబాబు
వద్దనగా తెలంగాణ
రాష్ట్రమిడగ మానినదయ!

నేడు వారలిద్దరిపుడు
తోడుదొంగల వలె నిపుడు
పొత్తుపెట్టుకొనియు ఏల
తెలంగాణ ఓట్లుకొండ్రు?

నిన్న చంద్రబాబు ఏమి
పలికెనయ్య? తనచేతను
ఎంపిల్లేక తెలగాణ
నడ్డలేకపోయితిననె!

ఇట్టి బాబు తెలంగాణ
లోన బీసి ముఖ్యమంత్రి
చేతుననగ...నేమనవలె?
కల్లమాట లనవలెనయ!

వైసీపీ సమైక్యాంధ్ర
అనుచు మొన్న ఒక్కమాట
తెలంగాణ కనుకూలము
 గా పలికెనె? ఆంధ్రవాడె!

తెలంగాణ వ్యతిరేకులు
తెలంగాణ బాగుచేతు
మని పలికిన నమ్మెదరే?
ఓట్లేవియు వేయవలదు!

ఎర్రపార్టికిని తెలగా
ణమ్మునందు ఎన్ని సీట్లు
దక్కునొ మన అందరకును
తెలిసినట్టిదేకాదా?

తెలంగాణ ఉద్యమమ్ము
నడిపించియు, నిరాహార
దీక్షబూని సాధించిన
కేసీఆర్ గెలువవలెను!

అన్ని పార్టిలును మనకే
టోపిపెట్టు పార్టీలే!
నమ్మివాటికోటేసిన
గోడకు కొట్టిన సున్నమె!!

కేంద్రమ్మే తెలగాణను
ఊరకయే ఈయలేదు!
వేయిపైన మన యువకుల
బలిదానముచేత కాదె?

కేంద్రమ్మే తెలగాణను
ఊరకయే ఈయలేదు!
కేసీఆర్ నిరాహార
దీక్షచేయగాను కాదె?

కేంద్రమ్మే తెలగాణను
ఊరకయే ఈయలేదు!
సకల జనులు సమ్మె చేసి,
కదిలించుటచేత కాదె?

కేంద్రమ్మే తెలగాణను
ఊరకయే ఈయలేదు!
తెలగాణుల ఓటుబ్యాంకు
తమ ఖాతాకనియె కాదె?

కేంద్రమ్మే తెలగాణను
ఊరకయే ఈయలేదు!
టీఆరెస్‍ విలీనమ్ము
బలమిడునని తలచి కాదె?

స్వార్థపరుల హస్తమ్మున
చిక్కి బాధపడుట కన్న,
ఉద్యమపార్టీ నేతను
గెలిపించుచొ మేలుకలుగు!

ఇతర పార్టి ప్రభుత్వమ్ము
తెలగాణకు మొదట వలదు!
ఉద్యమపార్టీ మాత్రమె
ప్రభుత్వమ్ము చేకొనవలె!!

చంద్రశేఖరుండె మనకు
బంగరు తెలగాణ నిడియు,
మన బ్రతుకులు బాగుచేసి,
సుఖములనందించగలడు!

కేసీఆర్ నోడించగ
పార్టీలన్నియు కలిసియు
పూనినవయ, ఎదుర్కొనుడు!
తె.రా.స.నే నెగ్గింపుడు!!

"దొర, దొర"అని అతని ననుట
సరికాదయ, "బంగరు తెల
గాణనిచ్చు దొర" అతడయ!
ఆదరింపు డాతనినే!!

టీడీపీ గెలిచినచో?
తెలంగాణ జుట్టు ఆంధ్ర
చేతికిచ్చినట్టులగును!
గెలిపింపగవలదు వలదు!!

బీజేపీ గెలిచినచో?
దాని జుట్టు చంద్రబాబు
చేతనుండు గాన, దాని
గెలిపింపగ వలదు వలదు!

కాంగ్రెస్సే గెలిచినచో?
ఆంధ్రవారి మాటనమ్మి,
డొల్ల తెలంగాణ నిడిరి!
బిల్ సవరణ విడనాడిరి!!

బిల్లు నెగ్గినంక కూడ,
పోలవరపు ఏడు మండ
లములను సీమాంధ్రకిడిరి!
గెలిపింపగ వలదు వలదు!!

వైసీపీ గెలిచినచో?
తెలగాణను అమ్ముకొనును!
సీబీఐ దర్యాప్తును
కొట్టివేయబూనుకొనును!!

ఆంధ్రపార్టి గెలిచి, నెత్తి
టోపి మనకు పెట్టి, తెలం
గాణను బానిస చేయును!
గెలిపింపగ వలదు వలదు!!

తె.రా.స.యే లేకున్నచొ
తెలంగాణ సాధ్యమౌనె?
బంగరు తెలగాణ కూడ
తె.రా.స.యే ఈయగలదు!

పరుల నమ్మి మోసపోక,
ప్రలోభాలకాశపడక,
మనకు మంచి బ్రతుకునిచ్చు
తె.రా.స.నే గెలిపింపుడు!

బాగుగ ఆలోచించిన
ఏది సమంజసమనియును
మీ మనసుకు తోచగలదొ,
అదియే మీ భవితయగును!

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి