గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఏప్రిల్ 27, 2014

చేసింది మోసం...జరిగింది ఘోరం!


వైయెస్సార్సీపి యెంత
చొక్కం బంగారమ్మో
అమాయకపు ప్రజలారా,
తెలిసికొనుడు మీరలిపుడు!

జలయజ్ఞం పేర నాడు
వైయెస్ ద్వయ నిర్వాకపు
మోసమ్ముల నన్నియు కాగ్
బహిర్గతము చేసెనయ్య!

నీటి వసతి లేకుండా
ప్రాజెక్టులు కట్టనెంచె!

టెండరులలొ టైమీయక
తమవారికె లబ్ధినిడిరి!

అనుభవమ్ములేనివారు
గుత్తెదార్లుగా చేసిరి!

విదేశీయ సంస్థ లనుచు
చెవిని పువ్వుపెట్టిరయ్య!

పోలవరమునందుకూడ
తగిన లబ్ధి పొందిరయ్య!

ఇంకెన్నో ప్రాజెక్టులు
చేపట్టియు దోచిరయ్య!

పైకి నీతిపరుల మనుచు
లోపల అవినీతులయ్యు
రాష్ట్రసంపదలను దోచి
నట్టి ద్రోహు లీ యిద్దరు!

తండ్రిదోచిపెట్టినట్టి
పైకమంత జమచేసియు,
కాలుపైన కాలేసుకు
జగనుబాబు కులుకుచుండె!

ఎర్రటిగురివిందగింజ
తన నలుపును ఎరుగనట్టు,
తాను నీతిమంతుడనని
సభలందున చాటుచుండె!

అవినీతికి చిరునామా
ఆ తండ్రీకొడుకులయ్య!
నిబంధనలను గాలికొదిలి
సంపాదన ధ్యేయమనిరి!!

గుత్తెదారులెట్టి అర్హ
తలను కలిగి యున్నారో
కూడా పరిశీలింపక
పనులనెన్నొ అప్పగించ్రి!

కాగు నివేదికల జూడ
చేసినట్టి మోసమ్ములు
రాష్ట్రమ్మును ఘోరమ్ముగ
ముంచినట్లు తెలియునయ్య!

తమ గుత్తేదార్లనుండి
ఎన్నోముడుపులు పొందియు,
ప్రభుత పక్షమున వారికి
లబ్ధిని చేకూర్చిరయ్య!

రాష్ట్రసంపదను దోచియు
ప్రజల చెవిని పువ్వుబెట్టి,
మేము నీతి మంతుల మని
చాటినచో, అవుతారా?

జలయజ్ఞమునందు ఎంత
అవినీతియె జరిగినదో
ఒక్కసారి పరికించిన
తేటతెల్లమగునయ్యా!

***     ***     ***     ***

ఇదే అంశంపై మరిన్ని వివరాలకై

(ఈనాడు దినపత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి