వైయెస్సార్ హయాములో
తండ్రి దోచిపెట్టగాను
కోట్లుకూడబెట్టి, తండ్రి
చావగానె పదవికోరె!
పదవిరాకపోవుసరికి
మరొకపార్టిపెట్టి తాను
వైసీపీ నేతయయ్యి
చక్రం తిప్పుచునుండెను!
తెలంగాణలోన ఉద్య
మమ్ము నడుచుచుండగాను
తెలంగాణ విషయంలో
అంటీముట్టకయుండెను!
అభిప్రాయ మడుగగాను
ఇచ్చుశక్తి, తెచ్చుశక్తి
తనకు లేదటంచు చెప్పి
మూడు ఆర్టికలును చూపె!
అసెంబ్లీకి తెలంగాణ
బిల్లురాగ "సమైక్యాంధ్ర"
నినాదమును ఎత్తుకొనియు
మనకు మొండిచేయిచూపె!
లోకసభను ఫ్లకార్డునే
పట్టుకొనియు తెలగాణకు
వ్యతిరేకత తెలిపినట్టి
వాడు ఇతడు అని తెలియుడు!
ఇట్టి తెలంగాణకు వ్యతి
రేకి పార్టి తెలగాణలొ
ఉండనేల, ఎన్నికలలొ
పోటిచేయనేలనయ్య?
తెలంగాణలోన మరల
దోపిడీని సాగించగ
అడుగుపెట్టినట్టి ఇతని
తరిమి తరిమి కొట్టుడయ్య!
తెలగాణకు అరువదేండ్ల
నరకము చూపించినట్టి
ఆంధ్రవారి పార్టి ఇచట
కొనసాగగ వలదయ్యా!
ఆంధ్రాపార్టీలు మనను
మరల బానిసలను జేయ
కాచుకొనియు ఉన్నవయ్య
తరిమి తరిమి కొట్టుడయ్య!
ముందుగాను తేనెవంటి
మంచిమాటలాడి మనల
నెత్తిపైన చేయిపెట్టి
అణచివేయజూతురయ్య!
తెలగాణలొ ఓటుపొంది
ఆంధ్రలోన వైయెస్సార్
హైద్రబాదు పోవుటకును
వీసా ,కావలె ననెనయ!
ఇట్టి దగుల్బాజి నేత
కొడుకు కూడ ఇట్టివాడె!
తెలంగాణ బాగు విడచి,
దోపిడి చేయంగ వచ్చె!!
కావున ఓ ప్రజలారా!
ఆంధ్రపార్టి చెప్పు మోస
కారి మాటలన్ని వినియు,
అర్థముచేసికొనుడయ్య!
తేనెపూసినట్టికత్తి
మనకేలయ, మనకేలయ?
ఆంధ్రపార్టి ఆంధ్రాకే
పోవలెనయ, పోవలెనయ!
బంగరు తెలగాణ తెచ్చు
కేసీఆర్ వెంట ఉండి,
ఆంధ్ర దగుల్బాజీలను
తరిమి తరిమి కొట్టుడయ్య!
టీఆరెస్ గెలిపించగ
బూని తెలంగాణ ప్రజలు
ఓటువేసి గెలిపించియు
బంగరు తెలగాణ గనుడు!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి