గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఏప్రిల్ 20, 2014

ఎన్నికలలో...ఎన్ని...కలలో...!?


ఎన్నికలలోన నందఱ కెన్ని కలలొ?
యెన్ని కలలున్న నెరవేర్చు హేతువిదని,
యెన్నికైనట్టి నేతకు హెచ్చు ఘనత
లిన్నియంచునుఁ జెప్పంగ నెన్నలేము!

ఈ తెలంగాణ కెవ్వరు నేమి చేసి,
సౌఖ్యదాయకులయ్యిరో సరిగ నెఱిఁగి,
యెన్నఁగాఁ బూని రోయయ్య యీ జనములు,
జై తెలంగాణ నినదముల్ చక్కఁ జేసి!

చంద్రశేఖరుండు చక్కని మార్గాన
రాష్ట్రమునను వెల్గుఁ బ్రబలఁ జేసి,
సకల సౌఖ్యములును సర్వుల కందంగఁ
జేయ వేచియుండె సిరులు గుఱియ!

సైకిలును ఫ్యాను వారలు సాఁగలేక,
చేతి కెద్దియు దొరుకదం చెఱిఁగి పాఱ,
కమలములు నీటఁ బాసియుఁ గమిలిపోవ,
కారు జోరుగా సాఁగెను కరువుదీర!

ఎవ్వరేమన్నఁ బ్రజ నిన్ను నెన్నుకొనియు,
మా తెలంగాణ బంగారు మయముఁ జేసి
కొందుమో యండ్రు! కేసియార్ డెందమందు
కొలువు చేసిన గెలుపుల కోర్కె తీర!

ప్రజల కొఱకయి యుద్యమ ప్రభలఁ దేలి,
నవ్య రాష్ట్రమే యవతరించంగఁ జేసి,
స్వర్ణ తెలగాణ మేర్పాటు వఱలునట్లు
యత్నమునుఁ జేయుఁ గేసియార్ హర్షమునను!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి