గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, డిసెంబర్ 27, 2013

మీకేం కావాలి?


ఓ సీమాంధ్రుల్లారా! మీకేం
కావాలో మరి చెప్పండి!
తెలంగాణులే విడిపోవుదుమని
ఖరాఖండిగా చెబుతుండ్రి!!

"కలిసియుండ"మని ముఖము మీదనే
చెప్పినా మీకు వినపడదా?
"సమైక్యాంధ్ర"మన నేమిటో మీకు
తెలిసి నినదించుచున్నారా?

సమైక్యమనగా నిరువురి కలయిక
ప్రేమపూర్వకపు మైత్రియయా!
పరస్పరం ద్వేషించుకొనుతరిని
సమైక్యమెట్టుల కుదురునయా?

పాడినపాటే పాడునట్టి యా
పాచిపండ్ల దాసరిలాగా,
"సమైక్యాంధ్ర" అని ఎంత అరచినా
తెలంగాణులు కలువరయా!

సింహం, "నే సన్యాసిని! రం"డన
జంతువులన్నీ వస్తాయా?
దోపిడిరుచి మరిగిన సీమాంధ్రుల
నమ్ముదురా మా తెలగాణుల్?

విభజన జరుగగ నీయక సీమాం
ధ్రులు అడ్డుటయే, ముఖ్యముగా
తెలగాణమ్మును దోచుకొనుటకే!
దోపిడీలు కొనసాగించుటకే!!

 విభజన తథ్యము! మిథ్య సమైక్యత!
విడిపోవుటయే తప్పదయా!
ఎవరికి వారలు బాగుపడుటకై
ఏమి వలయునో కోరుడయా!!

కుట్రలు మానుడు! దౌష్ట్యము వీడుడు!
సీమాంధ్రప్రజ క్షేమమ్మున్
కాంక్షించినచో, వెంటనె ప్రభుతను
ఏమి వలయునో కోరుడయా!!

మానవత్వమ్ము ఉన్నచో మరల
"సమైక్యాంధ్ర" అని వదరకయా!
ఇనుము విరుగుచో అతికించగనగు!
మనసు విరిగె నిక అతుకదయా!!

విభజన తదుపరి మీదగు వర్తన
మారిన చూతము! మునుముందున్
ప్రేమలు మొల్కల నెత్తిన చూతము!
విడిపోవుటయే తథ్యమయా!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

"మీకేం కావాలి?"

ఆ ముక్క బిల్లు పెట్టకముందు అడగాలి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఇదే ప్రశ్న అడిగీ...అడిగీ...సమాధానాలు లిఖితపూర్వకంగా రాబట్టింతర్వాతనే కేంద్రం చర్యలు చేపట్టిందనే విషయం జగద్విదితం. మీకు తెలియకపోవడం శోచనీయం. తెలంగాణకు అనుకూలంగా సమాధానాలిచ్చిన వారంతా ఇప్పుడు వెనుకడుగు వేసి, అసత్యవాదులు కావడం చింత్యం.

ఇకపోతే, "మీకేం కావాలి?" అని సీమాంధ్రుల్ని అడిగితే "తెలంగాణ ఇవ్వండి" అనే సమాధానం వస్తుందా? రాదుగాక రాదు. రాదని తెలిసీ, అరవై ఏళ్ళ తెలంగాణ ఆకాంక్షను సీమాంధ్రుల అంగీకారానికి ముడుపెడుతుందా కేంద్ర్తం? ఎంత అమాయకులు!

తెలంగాణ ఇవ్వాలా, వద్దా? అని అసెంబ్లీలో తీర్మానానికి పెడితే...సీమాంధ్ర నేతల సంఖ్య ఎక్కువ, తెలంగాణ నేతల సంఖ్య తక్కువ. ఎవరి వాదం నెగ్గుతుందో తెలియనిదా కేంద్రం?
సీమాంధ్రులు తెలంగాణ చస్తే ఇవ్వవద్దంటారు ఇందుకే అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ మూడును ప్రవేశపెట్టాడు. ముందు జాగ్రత్తతోనే ఇలాంటి ఆర్టికల్ ప్రవేశపెట్టడం తెలంగాణుల అదృష్టం.
సీమాంధ్రులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా, కుట్రలు-కుతంత్రాలు పన్నినా...తెలంగాణ ఏర్పడడం ఖాయం. కాస్త వెనకా...ముందూ...అంతే...ఇంతకన్నా ఏం లేదు...
జై తెలంగాణ! జై జై తెలంగాణ!

rajiv raghav చెప్పారు...

"ఇదే ప్రశ్న అడిగీ...అడిగీ...సమాధానాలు లిఖితపూర్వకంగా రాబట్టింతర్వాతనే కేంద్రం చర్యలు చేపట్టిందనే విషయం జగద్విదితం మీకు తెలియకపోవడం శోచనీయం. తెలంగాణకు అనుకూలంగా సమాధానాలిచ్చిన వారంతా ఇప్పుడు వెనుకడుగు వేసి, అసత్యవాదులు కావడం చింత్యం."

సీమాంధ్రులకు ఏమి కావాలని కేంద్రం ఎవరిని అడిగింది సార్? మరి సీమాంధ్రులు కోరినవి కేంద్రం ఇచ్చేసిందా?

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

రాజీవ్ రాఘవ్‍గారూ! సీమాంధ్ర నేతలలో గల విభిన్న స్వరాలనూ, సమైక్యాంధ్ర నినాదాన్నీ నిత్యం వింటూవున్న నాకు అసలు సీమాంధ్రులకు ఏం కావాలో స్పష్టంగా తేల్చుకోవాలని చురకలాగా ఈ టపా రాశాను! ఇక్కడ "సీమాంధ్రులు" అంటే, సీమాంధ్ర నాయకులూ, పెట్టుబడిదారులూనని మీరు అర్థం చేసుకోవాలి. సీమాంధ్ర ప్రజలపై మా తెలంగాణులకు ఏ ద్వేషభావమూ లేదు. ఏ ఆంక్షలూ లేని తెలంగాణ మాకు కావాలనే కోరికతో బాటు, సీమాంధ్రకు అన్ని వసతులున్న రాజధానీ మొదలైనవి సాఫీగా పరిపాలన సాగడానికి ఉండాలని మేం కోరుకుంటున్నాం. సీమాంధ్ర నాయకులకు తెలంగాణను ఇంకా ఇబ్బందులపాలు చేయాలనే కోరిక ఉండడం వల్ల మేం అశాంతికి గురవుతున్నాం. ఇంతే.
స్పందించినందుకు ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి