తెలంగాణ రాష్ట్రమ్మును
ఎందుకు కోరితిమయ్యా?
సీమాంధ్రుల ఆధిపత్య
మును సహింపలేకయె కద!
తెలంగాణ వచ్చిన తరి
సీమాంధ్రుల కధికారమె
ఈ కమిటీల్ కట్టబెట్ట
ఏమనుకోవలెనయ్యా?
జనాభాను ప్రాతిపదిక
చేసికొనియు ఉద్యోగుల
పంపకమును చేసినచో
తొంబది శాతము వారలె!
దీన్ని బట్టి సీమాంధ్రులు
తెలంగాణ ఉద్యోగాల్
ఎన్ని కొల్లగొట్టినారొ
తెలిసిపోవుచుండెనయ్య!
ఇట్టి దోపిడిని సహింప
లేకయె తెలగాణ రాష్ట్ర
మీయుడనియు కోరినాము!
ఇపుడుకూడ అన్యాయమె?
కేంద్రకమిటి, సీమాంధ్రుల
దోపిడిని గుర్తించియు,
సీమాంధ్రుల సీమాంధ్రకె
ఖచ్చితముగ పంపవలెను!
జనాభాను ప్రాతిపదిక
చేసికొనక, స్థానికతనె
ప్రాతిపదిక చేసికొనిన
తెలగాణకు న్యాయమగును!
తొంబది శాతము వారలె
ఉద్యోగాల్ చేయుచుండ,
తెలంగాణకెట్లు న్యాయ
మీయగాను వీలుపడును?
సీమాంధ్రా ఉద్యోగుల
ఆధిపత్యమే వద్దయ!
పంపించుడు సీమాంధ్రకు!
తెలగాణులె ఉండవలయు!!
నకిలీ ధ్రువపత్రములను
చూపించియు సీమాంధ్రులు
తెలంగాణ ఉద్యోగాల్
కొల్లగొట్టినారయ్యా!
తప్పు ధ్రువీకరణ పత్ర
ములు చూపినవారలకును
కఠినశిక్షలను వేసియు
న్యాయమ్మును గెలిపింపుడు!
తెలగాణులు తెలగాణనె,
ఆంధ్రవాళ్ళు ఆంధ్రలోనె
ఉద్యోగాల్ చేయవలెను!
ఇదియే న్యాయమ్మయ్యా!!
*** *** *** ***
ఈ విషయంలోనే మరిన్ని వివరాల కొరకు
(నమస్తే తెలంగాణ దినపత్రికవారి సౌజన్యంతో...)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
8 కామెంట్‌లు:
Q:తెలంగాణ రాష్ట్రమ్మును
ఎందుకు కోరితిమయ్యా?
Ans: హైదరాబాదుకై కోరితిరయ్యా
ఆంధ్రులపై ద్వేష మడిగించెనయ్యా
హైద్రబాదు కోరనేల?
హైద్రబాదు మాది కనుక!
ఆంధ్రులపై ద్వేషమేల?
తెలగాణను దోచె గనుక!
స్థానికులు కాకున్నా అక్రమంగా తెలంగాణ ఉద్యోగాల్ని కొల్లగొట్టి, ఉద్యోగాన్ననుభవించి, పదవీ విరమణ చేసిన తదుపరికూడా, తెలంగాణకు సంబంధించిన పెన్షన్ డబ్బును అనుభవించే సీమాంధ్ర పెన్షనర్లను కూడా సీమాంధ్రకే పంపించాలి! వీళ్ళింకా పెద్ద దోపిడీదార్లు! దీనిని సహించరు తెలంగాణులు!
"హైద్రబాదు మాది కనుక!" అంటున్నారు. సంతోషం. కేవలం మీదే కాదు. భారతీయులందరిదీ! అది మరచిపోయారే. మీ ధోరణి చూస్తే, హైదరాబాదు అభివృధ్ధి చెందినది కనుక, చాలా మంచి ఆదాయవనరుగా మారింది కనుక, దాని నుండి వచ్చే రాబడి అంతా తెలంగాణాకే చెందాలీ అన్న యావా దుర్భుధ్ధీ తప్ప, మరేమీ కనిపించటం లేదు. దేశంలో అన్ని నగరాలు ప్రాంతాలవంటిదే హైదరాబాదు కూడా. మీరు ద్వేషిస్తున్న, అకారణంగా నోరుపారేసుకుంటున్న ఆంధ్రులకూ మిగతా దేశంలోని అన్నిప్రాంతాల ప్రజలకూ లాగానే హైదరాబాదులో జీవనోపాధి పొందే హక్కు ఉన్నది. అది మీరు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది.
హైదరాబాద్ అందరిదైతే స్థానికులకు ఉద్యోగాలు వద్దా? సీమాంధ్ర పాలకుల దుర్మార్గం వల్ల సీమాంధ్రులు స్థానికులకు ఉద్యోగాలు దొరకకుండా, దొంగ నేటివిటీ సర్టిఫికెట్లతో అక్రమమార్గాలలో ఉద్యోగాలు కొల్లగొట్టవచ్చా? నాది అకారణ ద్వేషంకాదు సకారణమే. తెలంగాణులను అమాయకులను చేసి, అక్రమంగా కొలువులు, నీళ్ళు, నిధులు, వనరులు కొల్లగొట్టారు సీమాంధ్రులు. హైదరాబాదులో తొంబైశాతం ఉద్యోగులు సీమాంధ్రులు ఎట్లా ఉంటారు? యాభై ఎనిమిది శాతం ఉండాల్సినవాళ్ళు తొంబై శాతమున్నారంటే...సీమాంధ్రులు తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణులకు దక్కకుండా ఎంతగ దోపిడీకి పాల్పడ్డారో తెలియడంలేదా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ, నన్నెవరూ చూడడం లేదనుకొన్నట్టుండి మీ వాదన. అవునులే ఈ అక్రమార్కులలో మీరూ చేరినవారే...అందుకే అక్రమార్కులను వెనకేసుకొస్తున్నారు. హక్కు స్థానికుల తర్వాతనే మరొకరికి ఉంటుందనే సాధారణ సత్యాన్ని మరచి, హక్కులగురించి మాట్లాడుతున్నారు. బతకవచ్చినవారికే ఇంత హక్కున్నదంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన స్థానికులకు ఎంత హక్కుండాలి? ఈ విషయం మీరే శీఘ్రంగా గ్రహిస్తే మంచిది. ఇంకో విషయం... హైదరాబాదు ఆంధ్రలో కలవకముందే దేశంలో ఐదవస్థానంలో ఉన్న అభివృద్ధి చెందిన ప్రాంతం. మీ సీమాంధ్రులు చిప్పచేత పట్టుకొని బతకవచ్చారు. మద్రాసునుండి విడిపోయినప్పుడు ఆంధ్రాది లోటు బడ్జెట్టు. అలాంటి వాళ్ళు హైదరాబాదుకు బతకవచ్చి లక్షలు కోట్లు కొల్లగొట్టారు...తెలంగాణుల్ని దోచి! ఇప్పుడు హైదరాబాదును అభివృద్ధిచెందించింది మేమే అంటున్నారు! అరవై ఏళ్ళక్రిందటే అభివృద్ధిచెంది ఐదవస్థానంలో నిలిచిన హైదరాబాదును మీరు మొదటి, రెండవ స్థానానికి తెచ్చారా? ఇంకా ఐదవస్థానంలోనే ఉందికదా! దేశంలోని మిగతా పెద్ద నగరాలలాగానే హైదరాబాదూ ఉంది. మీరు అభివృద్ధిచేసింది మీ ఆస్తుల్నీ, వ్యాపార్ల్నీ, రియల్ ఎస్టేటుల్నీ...అంతేకానీ...నిజాం కాలంలో ఉన్న దవాఖానాలు తప్ప ప్రభుత్వ దవాఖానాలు కొత్తవి ఏమున్నాయి? నిజాంకాలంనాటి ప్రభుత్వపాఠశాలలే తప్ప కొత్తవేమున్నాయి మీ సీమాంధ్ర ప్రభుత్వంలో? కొత్తవి మీ సీమాంధ్రుల కార్పొరేట్ పాఠశాలలూ, కళాశాలలూ ఉన్నాయి. ప్రభుత్వ సంబంధమైనవి ఏవి? మీరు వేటిని అభివృద్ధి చేశారు, మా తెలంగాణులను కొల్లగొట్టడం తప్ప! మాకు ద్రోహం చేశారు కాబట్టే అసహ్యించుకుంటున్నాం...ఇప్పటికీ! ఇది మీరు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది...నాలాంటి వారిపై అకారణద్వేషం పెంచుకోకుండా!
నిజాం కాలం నుండీ, బ్రహ్మానందరెడ్డి కాలంనుండీ, ఎన్‍టీఆర్ కాలంనుండీ, గిర్‍గ్లాని కమిటీ (సీమాంధ్రుల అక్రమాల్ని వెలికితీయడానికి) ముందుకు వచ్చి మీసీమాంధ్రుల మోసాలను బహిర్గతపరిచిననాటినుండీ...సీమాంధ్రుల అక్రమ ఉద్యోగాల భండారం బయటపడుతున్నా...దొంగలాబీయింగులతో...లంచాల ప్రలోభాలతో ఇప్పటిదాకా నెట్టుకొచ్చారు. ఇప్పుడు మా తెలంగాణ మాకు వచ్చింది. మా తెలంగాణ రాష్ట్రంలో కూడా మా తెలంగాణ ఉద్యోగులు పదిశాతం, మీసీమాంధ్రులు తొంబైశాతం ఉండాలంటారా? ఎంతటి న్యాయం మూర్తీభవించిన అమృతమూర్తులు తమరు? అక్రమార్కుల్ని వెనకేసుకొచ్చేవారు అక్రమార్కులుకాక సక్రమార్కులవుతారా అక్రమార్కులవారూ? దొంగల్ని వెనకేసుకురాకండి! ఎవరైనా వింటే నవ్విపోతారు!
ఇంతకీ అసలు విషయం దాటేశారేంటి శ్యామలీయం గారూ?
దొడ్డిదారిన కలుగులో ఎలుకల్లా, చీమల పుట్టలో పాముల్లా 90% ఉద్యోగాల్లో అక్రమంగా దూరిన వారు ఏ ప్రాంతానికి చెందాలంటారు? వారంతా ఇక్కడే వుండి తెలంగాణా ప్రభుత్వంలో చక్రం తిప్పాలి, మేం సీమాంధ్రలో కొత్త రిక్రూట్‌మెంట్లు చేసుకోవాలి... అందుకే ఆప్షన్లు ఇవ్వాలి అన్నా అంటారు!
దొంగల్లా తెలంగాణలో ప్రవేశించి తెలంగాణుల ఉద్యోగాలు కొల్లగొట్టిందేగాకుండా, మీ ఉద్యోగాలు మాకే, మా ఉద్యోగాలూ మాకే. అందుకే మేమిక్కడే ఉంటాం కాబట్టి ఆప్షన్లు ఇవ్వాలి అంటున్నారు. రిటైరైంతర్వాత కూడా పెన్షన్ పేర తెలంగాణ సొమ్ము తెగతిందామని ఉవ్విళ్ళూరుతున్నారు. తేరగా వచ్చిన తొంబైశాతం ఉద్యోగాల్లో కులుకుతాం అంటున్నారు. శ్యామలీయం ఈ దొంగల్ని వెనకేసుకొస్తున్నారు. దొందూ దొందే కదా...అందుకని! తెలంగాణ రాకముందూ, వచ్చింతర్వాతా తెలంగాణలో సీమాంధ్రులదే పెత్తనం ఉండాలంటారు...మనం ఒప్పుకున్నా...ఒప్పుకోకపోయినా! ఇదీ వారి ప్లాన్. ఒప్పుకుంటే మనం మంచివాళ్ళం. ఒప్పుకోకుంటే దుర్బుద్ధి గలవాళ్ళం, దుర్మార్గులం ఈయనగారి దృష్టిలో! ఎంతైనా ఆ గుంపులోనివాడేగా ఈయన! అందుకే ఈ ఆరాటం...పోరాటం...ఉబలాటం!
కామెంట్‌ను పోస్ట్ చేయండి