గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, డిసెంబర్ 03, 2015

తెలంగాణ అమరవీరా...శ్రీకాంత్ చారీ...నీకు జోహార్... జోహార్...!!

(నేడు శ్రీకాంత చారి వర్ధంతి)

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన త్యాగధనులు ఎందరో. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతచారి మరణం యావత్ దేశాన్ని ఆలోచింపజేసింది. తెలంగాణ ఉద్యమం అనగానే మొదట గుర్తుకొచ్చేది అమరుల త్యాగం. ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరుగని విధంగా తెలంగాణ ప్రాంత విముక్తి కోసం, ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటం చిరస్మరణీయం. అరవై ఏళ్ల వివక్షకు చరమగీతం పాడుతూ స్వతంత్ర తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం.

2009 నవంబర్ 29న రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆమరణ నిరాహార దీక్షకు వెళ్తున్న ఉద్యమనేత కేసీఆర్‌ను పోలీసులు కరీంనగర్ జిల్లా అల్గునూర్ వద్ద అరెస్టు చేయడంతో ఒక్కసారిగా తెలంగాణ భగ్గుమన్నది.ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తా ఉద్యమ కాగడా అయ్యింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే జై తెలంగాణ నినాదం చేస్తూ ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శ్రీకాంతచారి భగభగమండిపోయిండు. ఉద్యమ మిత్రులు మంటలార్పేలోపే తీవ్ర గాయాలతో కుప్ప కూలి పోయాడు. ఆస్పత్రిలో అయిదు రోజులు చికిత్సపొందుతూ శ్రీకాంతచారి.. నన్ను బతికించినా మళ్లీ తెలంగాణ కోసం సచ్చిపోతా అంటూ వీరమరణం పొందినాడు. శ్రీకాంతచారి త్యాగం యావత్ తెలంగాణ ప్రాంతాన్ని ఆలోచింపజేసింది. సకల జనులను, సబ్బండ వర్ణాలను రోడ్లపైకి తెచ్చింది. సీమాంధ్ర పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, బంద్‌లతో తెలంగాణ ప్రాంతం అట్టుడుకిపోయింది. 

నల్లగొండ జిల్లా మోత్కూర్ మండలం పొడిచేడు గ్రామంలో పుట్టిన శ్రీకాంతచారి ఫిజియోథెరపి కోర్సును చదువుతూ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనే వాడు. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న రాష్ట్రసాధనోద్యమానికి వెన్నుదన్నుగా ఉండేవాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న శ్రీకాంతచారి రాష్ట్ర సాధన కోసం హిమాలయాలంత త్యాగం చేశాడు. శ్రీకాంతచారి తెగింపు, త్యాగం తెలంగాణ ప్రజలకు వేగు చుక్కై దారి చూపింది. శ్రీకాంతచారి మన మధ్య లేకున్నా అతని ఆశయం నెరవేరి మన కళ్లముందే కదలాడుతున్నది. శ్రీకాంతచారి ఆశయాల ప్రేమికులుగా బంగారు తెలంగాణ సాధనలో మనమంతా నిమగ్నం కావడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి. 



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


4 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

జోహార్ శ్రీకాంతాచారి, అందరు తెలంగాణా అమర వీరులకు జోహార్ జోహార్!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

స్పందించి వ్యాఖ్య పెట్టిన మిత్రులు శ్రీ గొట్టిముక్కల జై గారికి మనఃపూర్వక కృతజ్ఞతలు!

Unknown చెప్పారు...

Sreekanthaachaari gaari thalli gaarini ennikalalo nilapadam jarigindi, mari aaavida gaaru gelichaaraa?
gelavaledanukunta, mari gelavakapovadaaniki kaaranam?
gelisthe anavasaranga oka mantri padavi malli aaavidaku ivvaaalsi vastundandani kachara gaaru odinchaara?
leka sreekantaachaari chaaavu antaga prabhaavitham cheyyagalige pradesaallo aavidanu nilapaledaa?

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

Raju Garu గారూ!

శ్రీకాంతాచారిపై అందరికీ గౌరవం ఉంది. ఆయన మరణం తెలంగాణకు తీరని లోటు. అయితే ఆయన మరణాన్ని రాజకీయానికి ముడిపెట్టడం...తద్వారా ఎన్నికలలో నిలబడి ప్రజల సానుభూతితో గెలవడం అనే స్వార్థంతో రావడం ప్రజలకు నచ్చలేదేమో...అంతేగానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుగారే ఆమెను పట్టించుకోలేదా...అనే సందేహానికి తావు ఇక్కడ లేదు. నిలబడింది శ్రీకాంతాచారి తల్లి. ఓట్లు వేసి గెలిపించవలసింది ప్రజలు! నడుమ కేసీఆర్ గారిని నిందించడం బాగాలేదు. మీరు ప్రతిపక్షానికి చెందినవారో, వారి అభిమానులో అయ్యుంటారు. అందుకే నిందలు వేస్తున్నారు. ఇక్కడ... ప్రజలు...తన కొడుకు చావును రాజకీయానికి వాడుకుంటున్నదనే నేమో...శ్రీకాంతాచారి తల్లిని గెలిపించలేదు కాబోలు! లేక మరేదైనా కారణం ఉన్నది కావచ్చు. కాని, కేసీఆర్ ఆమెను పట్టించుకోలేదు అనడం సమంజసం కాదు! శ్రీకాంతాచారి ఆత్మార్పణానికీ, ఎన్నికలకూ పొత్తెక్కడిది? ఆయన మరణం తెలంగాణ సాధనకోసం...అది అక్షరాలా జరిగింది...ఆయన ఆత్మకు శాంతి చేకూరింది. ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకోవడానికి మనం ప్రభుత్వాన్ని తిట్టకుండా... మనం మనవంతు సహకారాన్ని ఎలా అందించాలా అని చూడాలి...అంతేగానీ విమర్షించకూడదు. ఎందుకంటే టీఆరెస్ ప్రజల పార్టీ...ప్రజల క్షేమానికి కృషిచేస్తోంది కూడా! పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు కొందరికి ఆ సంక్షేమకార్యక్రమాలు కనిపించక...లొసుగులలాగే కనిపిస్తుండవచ్చు...కానీ, మీవంటివారుకూడా నిందించడం సరికాదని నా భావన. స్వస్తి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి