గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జూన్ 01, 2015

"గుండు" నామస్మరణ చేయనిదే వీళ్ళకు ముద్ద దిగదా...???

సోదరులారా! నేను "నా తెలంగాణ కోటి రత్నాల వీణ" లో 
తేది: మే 27, 2015 నాడు:  తెలంగాణలో కవులే లేరా...??? 
మరియు 
శీర్షికల కింద ప్రచురించిన వ్యాసాలు కొందరికి "కొరుకుడు పడక".....
నా పేరును బయటికి ఉచ్చరించకుండా....
మా యింటిపేరు (గుండు) ను ’హరినామస్మరణ’లాగా జపిస్తూ...
ఒకరు వ్యంగ్యవ్యాసాన్ని రాసి ప్రచురిస్తే...
మరికొందరు సమర్థిస్తూ వ్యాఖ్యలు రాసి...
వాళ్ళ మనస్సులలో  నాపై (ఒక తెలంగాణునిపై) గల అక్కసునంతా తీర్చుకున్నారు.....!!!
ఆ వ్యాసాన్నీ....దాన్నీ అమోదించి చప్పట్టుకొట్టి....రాసిన వ్యంగ్యవ్యాఖ్యలనూ....
ఈ దిగువ ఇస్తున్నాను.....
మీరూ చదవండి....
వాళ్ళకు మన (తెలంగాణుల) కున్నంత సంస్కారం ఉందో లేదో బేరీజు వేసుకోండి.....
వాళ్ళ మనస్సుల్నీ, ఆలోచనల్నీ, సంకుచితత్వాన్నీ అర్థంచేసుకోండి....
తెలంగాణులకున్నంత స్వచ్ఛమైన మనస్సు వాళ్ళకుందో లేదో కనుగొనండి...
అరవై ఏండ్ల మన బానిసత్వం ఎవరి వలన వచ్చిందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి...
ఎవరు
నంగనాచులో
తేనెపూసిన కత్తులో
వృథా ప్రేలాపనలు చేయువారో
తెలుసుకోండి....
అన్యాయంగా నన్ను "గుండు"ను నిందిస్తూ వాళ్ళు చేసిన వ్యాఖ్యలను
తెలంగాణులుగా 
మీరు
మీ వ్యాఖ్యల ద్వారా
ఖండించండి!

స్వస్తి.

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

***        ***        ***        ***        ***

గుండు జ్ఞానము అనగా నేమి ? అది ఎట్లు వచ్చును ? (ఈ శీర్షికపై క్లిక్ చేసినచో ఆ బ్లాగు తెరచుకొంటుంది)

గుండు జ్ఞానము అనగా నేమి ? అది ఎట్లు వచ్చును ?

గుండు అనగా పూర్ణము. పూర్ణము అనగా అసంపూర్ణము కానిది.  అసంపూర్ణము అనగా అది ఏదియో తెలియనిది కొంత వదిలి వేయ బడినది.

అది ఏదియో తెలియనిచో అది వదిలి పెట్ట బడినది అని ఎట్లా తెలియును ?

అనగా అది ఏదియో తెలియనది వదిలి బెట్ట బడినది అను కించిత్తు జ్ఞానమే గుండు జ్ఞానమా అన్న ప్రశ్న ఉదయించును .

అనగా ఆ కించిత్తు దేనినో సూచించును . కాని అది ఏదియో తెలియదు .

కావున ఆ కించిత్తు ని వలవేసి పట్టు కుని అది ఏదియో దానిని పట్టుకొనుట కుదురును అను జ్ఞానమే గుండు జ్ఞానము అని అనుకోనవచ్చునా ??

గుండు జ్ఞానము కలదు అని విశ్వసించిన గుండు కాని జ్ఞానము కూడా ఉండ వచ్చును అని అనిపించు ను. కాని  పూర్తి గా మనసును బెట్టి పరిశీలించిన ఉంటె గుండు జ్ఞానము మాత్రమె గలదు . అది లేని చొ ఏదియును లేదు అని సూక్ష్మము గా తెలుసు కొన వచ్చును .

ఇట్లాంటి గుండు జ్ఞానము ను తెలుసుకొనుటకు ఏది సౌలభ్యమైన మార్గము ? మనస్సు ద్వారా ఆ గుండు జ్ఞానము అవగాహన అగునా ? హృదయము ద్వారా అది అవగాహన అగునా అను సందేహము వచ్చును .

అసలు మనసు అనగా నేమి ? బుద్ధి అనగా నేమి ? అహం కారము అనగా నేమి ? హృదయము అనగా నేమి ? ఇవన్నీ తెలిసిన గుండు జ్ఞానము తెలిసినది అని నిర్దారించ వీలగునా ??

తెలుగు భాషలో అన్ని అచ్చులు హల్లు లు కొన్నింటి ని తప్పించి అనగా క, గ చ ఛ ద వంటి కొన్నింటి ని తప్పించి 'గుండు' నిబిడీ కృతమై ఉండడమును మనము గమనించ వచ్చును . ఇదియు ఒక విధమైన గుండు జ్ఞానమే !

జిలేబి గుండుగా ఉండును. గుండు గుండు గా ఉండే వన్నీ గుండు జ్ఞానము కలిగి ఉండునా ? అన్నది ప్రశ్న .

కావున గుండుగా ఉన్నంత మాత్రమున గుండు జ్ఞానము వశీకరణము అగునా అన్నది ప్రశ్నార్థకమే .

అటులే , గుండు కాని చో కూడా గుండు జ్ఞానము సాఫల్యము అగును అని ఖచ్చితము గా చెప్పలేము.

ఇటులు  సర్వ వ్యాప్తమై ఉండి, సర్వ అవ్యాప్తమై ఉండి గుండు ఉండీ , అసలు ఉందా లేదా అన్న సందేహము ను ప్రతి క్షణము లోను లేవదీయు గుండు అసలైన సర్వ జ్ఞానము.

యస్య జ్ఞాన దయా సింధో ....

(గోడ దూకితే అదే సందు !)


ఇంతటి తో గుండు జ్ఞాన కాండ పరి సమాప్తము. దీని ని చదివిన వారికి గుండు జ్ఞానము మెండు గా నిండుగా గలుగ వలె నని జిలేబి ఆ గుండు గుండు ని వేడు కుంటూ ..


జిలేబి

51 comments:

 1. గుండు జ్ఞానము సంపూర్ణం.
  Reply
  Replies
  1. కొండల రావు గారు

   మీకు గుండు జ్ఞానము పరి పూర్ణముగా కలిగినందు లకు మిక్కిలి ముదంబును చెందినాము :)

   జిలేబి
 2. ఓం గుండుమదః గుండుమిదం
  గుండాత్ గుండుముదచ్యతే
  గుండాస్య గుండుమాదాయ
  గుండుమేవావశిష్యతే
  (గుండోపనిషత్ మొదటి వల్లి, నాలుగో అనువాకం, మొదటి పద్యం)
  అవున్నేను రాసిందే
  అంతేనండి గుండు జ్ఞానం అంటే.
  Reply
  Replies

  1. ఆహా డీ జీ గారు,

   మీకు మీరే మాకు మేమే !!

   జిలేబి
 3. మీరు గుండు వారి ఆంజనేయ స్వామీ టపా చూసి ఈ టపా పెట్టారా ? జస్ట్ డౌట్
  Reply
  Replies
  1. వెంకట గారు,

   ఈ గుండు వారి ఆంజనేయ స్వామీ టపా వివరములు ఏమిటి ? తెలియ జేయవలె ! ఈ టపా అది చదివి వ్రాసినది కాదు; ప్రజ బ్లాగు లో కొండలరావు గారి ప్రశ్న కి| "అసమద్ శ్రమ దానం "

   చీర్స్
   జిలేబి
 4. కం. గుండేమిటి గుండుజ్ఞానం
  బుండిన నది యెట్టులుండు నుండునొ నది లే
  కుండెనొ యని బెదరితి కల
  గుండుపడితి గుండె చెదరి కూలి జిలేబీ

  కం. మీ గుండోపనిషత్తిది
  బాగున్నది గుండు తెలివి బహుచక్కగ హా
  స్యాగమ సారవిచారము
  నా గుండును పగులగొట్టి నాటె జిలేబీ

  కం. గుండువివేకము కలుగుచు
  నుండుట కే కారణంబు లుండెడు నొకఛో
  నుండిమి కెయ్యది కతమని
  గుండువివేకుకులకు తెలియు చుండు జిలేబీ

  కం. మెండుగ గుండు తెలివి తల
  పండున కలవారు బుధులు భావింపగ నది లే
  కుండిన వారలు ఖాళీ
  గుండుల వారనచు తెలిసి కొంటి జిలేబీ.
  Reply
  Replies

  1. శ్యామలీయంవారి ఈ జిలేబి కందాలకి త్రాపించండి , బెనారస్ దూద్ ప్లస్ హాట్ హాట్ జిలేబీస్ !!

   నెనరస్య నెనరః !

   గుండు జిలేబి మకుటానికి ఇంతగా పని పెడుతుందని అనుకో లేదుస్మీ :)

   జిలేబి
 5. గాడిదగుడ్డు కోసం వెతికితే దొరకచ్చు!
  ప్రపంచమే ఒక పెద్ద మేషాండం కదా!
  Reply
  Replies
  1. దిగుమతి సరుకు తెల్లతోలు కిరస్తానీ మిషనరీలు పల్లెటూళ్లలో సభలు చేసి మధ్యన తరచుగా 'God the good' అంటే నాటి మన పాటకజనం దాన్ని గాడిదగుడ్డుగాఅర్థంచేసుకొన్నారట. ఆ తరువాత తలాతోక లేని మాటకారి తనం ఎవరన్నా చూపితే ఆ వాగుడును సదరు గాడిదగుడ్డుతో పోల్చటం మొదలు పెట్టారట.
  2. కం. అహా మేషాండంలో
   ఊహించారొక గాడ్ది గుడ్డు ఉండచ్చని మాం
   పాహి మహా గుండువివే
   కీ హన్నా గార్ధభములవేల జిలేబీ


  3. ఆహా హరిబాబు గారి మేషాండం మరో జిలేబీ కి తావు తీసింది :)

   శ్యామలీయం వారు, గాడిద గుడ్డు అంటే ఇదా అర్థం :) గాడ్ ఈజ్ గ్రేట్ నిజంగా నే : )

   జిలేబి
 6. అసలు గుండంటే తిర్పతి గుండా, అన్నారం గుండా, సివ్వాచెలం గుండా అనేత్తేలాల మొదట్న. ఏటంటే తిర్పతి గుండు తిన్నంగా ఉండు, అన్నారం గుండు అందంగా ఉండు, సివ్వేచెలం గుండు చిన్నదిగా ఉండు. అయ్తే గియ్తే ఈ మూడు గుళ్ళూ ఆంధ్రాలో పడిపోయొచ్చిసినాయ్ కన్క ఆట్ని యమార్జంటుగా హైద్రావాద్లో కలిపీసుకుని తర్వాత్తొర్వాత ఇదంతా అంధ్రోళ్ళు చేసిన యవ్వారం అని పేపర్లో ఏకెయొచ్చు.ఈ ఆంధ్రోళ్ళ గుళ్ళన్నీ (గుండ్లన్నీ అనాల్నా?) ఎలాగా జిలేబీ కంపు కొడతన్నాయ్ కదా?

  (ఇదంతా నా బుర్రలోంచి వచ్చిందనుకుంటున్నారా? అబ్బే నాకంత సీనేదీ? నమస్తే గుండు సౌజన్యంతో)
  Reply
  Replies
  1. శ్యామలీయంగారూ
   "పోతన" అనే పదంలో "త" తెలంగాణాకి చెందినదే అని అభిజ్ఞాన వర్గాల భోగట్టా. "బమ్మెర" లో కానీ "పోతన" లో కానీ "సీమ" గానీ "ఆంధ్రా" కాని ఎక్కడైనా కనిపించిందా మీకు? ఆఖరికి "బాగవతం" లో కూడా "త" ఉంది గమనించారో లేదో? ఆ మాత్రం తెలియని మీరు పద్యాలు ఎలా రాస్తున్నారో? మొదటి తప్పుగా మీ అజ్ఞత ని మన్నించాం. ముందెప్పుడూ ఇలా అనకండి. మా భావాలు దెబ్బతింటాయ్. అవి దెబ్బతింటే మీ సీమాంధ్రా మరో మరు ముక్కలై ఉత్తి "సీమ", ఉత్తి "ఆంధ్రా" మిగుల్తాయ్! జాగ్రత్త!!
  2. డీజీ గారూ,

   ఆ మూడూ గుళ్ళూ మనవే మూడు రకాల గుండ్లూ మనవే - మిగతావాళ్ళకు హక్కు గుండుసున్నా.

   కం. గుండన సింహాచలపున్
   గుండగు మరి యన్నవరపు గుండగు నాపై
   గుండన తిరుపతి గుండే
   గుండనదగు ఖ్యాతిదక్కి కులుకు జిలేబీ

  3. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోదన్నట్టు జిలేబి వారి గుండో పాఖ్యానం లో కూడా ఆంతెలంరాయ సమస్యా :) వామ్మో జిలేబి మాయమై పో ఇక్కడ నించి :)

   గుండు మహత్వ పూర్ణ మైనది అది ఎక్కడ ఉన్నను అది సర్వ జనావాళీ కి చెందిందండి డీ జీ వారు !

   జిలేబి
 7. గుండంటే గుండూ కాదూ జుట్టుంటే గుండూ కాదూ
  అద్దమూ దువ్వెనా లాంటి సోకులేమీ అక్కర్లేని గుండూ!
  Reply
  Replies

  1. హరిబాబు గారు పేరడీ కి గుండు రెడీ !

   జిలేబి
 8. గుండు ప్రశ్నోపనిషత్తు.

  1.గుండు అనగానేమి?
  2.గుండుకి బట్టతలకి తేడా ఏమీ?
  3.గుండుని బట్టతల అని ఎందుకనరాదు?
  4.ఎవరికి తెలివితేటలెక్కువ గుండున్నవారికా, బట్టతలవారికా?
  5.గుండు అందరికీ ఉండునా, ఇందు స్త్రీ పురుషభేదము కలదా?
  6.గుండు చేయించుకొనవలెనా, చేయువారు ఎక్కువగానే దొరుకుతున్నారా?

  ప్రశ్నోపనిషత్తు ప్రశ్నలు సమాప్తం, జవాబివ్వకపోయిన గుండు పే...
  Reply
  Replies

  1. కష్టే ఫలే వారు,

   మీరు ప్రశ్నోపనిషత్తు వేయగల వ్రాయ గల సత్తా ఉన్నవారే , అదిన్నూ గుండు మీద ! తిరపతి గుండు కథ గుర్తు కోస్తోంది మీ ప్రశ్నో ప నిషత్తు చదివితే : )

   జవాబులు ఎవరైనా ఇస్తారేమో వేచి చూడాలి !

   జిలేబి
 9. ఈ గుండు టపాలో కుట్రకోణం లేదా?
  Reply
  Replies

  1. శర్మ గారు,

   ఈ గుండు టపాలో కుట్ర కోణం లేదు గాని 'కుంభ' కోణం' ఉంది :)

   జిలేబి
  2. ఆ కుంభ కోణ, లంబ కోణములు వివరించవలె.
 10. జోగీ జోగీ రాసుకుంటే ఒంటిన బూడిద రాల్తుంది!
  గుండూ గుండూ రాసుకుంటే చుండ్రు రాల్తుంది?
  Reply
  Replies
  1. ఔరా! ఔరా!
   కం. గుండ్రాయి వంటి తలపై
   చుండ్రెచ్చట నుండి వచ్చు చోద్యము గాదే
   ఆండ్రెబ్బ జేసి అ చుం
   డీండ్రబడం తరమె సత్యమెన్న జిలేబీ
  2. గుండు చిత్రములింకెన్ని చూడనుంటిమో!
   తుపాకి గుండులాపేలెకదా గుండు టపా
 11. "గుండు" (మధుసూదన=హరి) నామ స్మరణతో మీ అందరికీ, మీ "గుండు"ల్లోని మలినాలన్నీ తొలఁగిపోయి, సర్వమూ "గుండు" అగును గాక! మీ అందరి మనస్సులూ ప్రతీకారవాంఛతో రగులక, బా"గుండు"గాక!

  కం.
  గుండుంటే బుద్ధుండును
  గుండే లేకున్న తెలివి కొండే యెక్కున్!
  గుండుఁ దలఁచు మనసే బా
  గుండును ఓ ఆంధ్రులార కోపమదేలా?

  ఈ "గుండు"పైఁగల మీ అందఱి కోపములును, వెటకారములును శమించి, యందఱును స్వచ్ఛమనస్కులగుదురుగాక! స్వస్తి.
  ReplyDelete
  Replies
  1. << ఈ "గుండు"పైఁగల మీ అందఱి కోపములును, వెటకారములును శమించి, యందఱును స్వచ్ఛమనస్కులగుదురుగాక! స్వస్తి. >>

   కొందరికేనేమోనండీ ...... అయినను పోవలె 'గుండు'లోనూ 'గుండె'లోనూ ఇతరులపై కారముల్.... వెటకారముల్.....
  2. అయ్యా గుండు కవి గారూ,
   మీ పేరులో ఉన్న గుండు మీద సర్దాగా నవ్వుకుంటున్నాం.మీరు కూడా మీ గుండును నిమురుకుంటూ నవ్వుకోండి గుండులా!
  3. రవరవలను ఎగదోసి వినోదించటం మీకు సరదాకావచ్చును. కాని తరచుగా అది దుష్ప్రయోజనాన్నే కలిగిస్తుంది. ఈ టపా వలనా, దానిపై ఎగసిన వ్యాఖ్యాపరంపరవలనా శ్రీగుండు మధుసూదన్ గారికి మనస్తాపం కలిగిన సంగతి గ్రహించి కూడా మీరు అనవసరపు తమాషామాటలు పలకటం బాగోలేదండి. ఇంతటితో ఇది పరిసమాప్తి చేయటం ఉచితంగా ఉంటుంది.
 12. జిలేబీ గారూ, కన్యాశుల్కం లో రామప్ప పంతుల్ని చూసి కరటక శాస్త్రి గారి శిష్యుడు పాడే తత్వాల్లో :-

  "యిల్లు యిల్లనియేవు ! యిల్లు నాదనియేవు |
  నీ యిల్లు యెక్కడే చిలుకా ? "

  అనేది గుర్తుందిగా.

  అదే అలవరస పై , ప్రస్తుతం "గుండు జ్ఞానం" సంపాదిచుకున్నవారిని చూసి :-

  గుండు గుండనియేవు | గుండు నాదనియేవు |
  నీ గుండు యెక్కడే చిలుకా?

  అని ఇహనుంచీ జనం పాడతారేమో చూడండి :)
  Reply
  Replies
  1. గుండు జ్ఞానం తరణోపాయం అనాలేమోనండీ.
  2. గుండు ఇంటిపేరున్నవాళ్ళు మా చుట్టాలున్నారండి బాబూ!
 13. ఈ టపాపాఠకులకు ముఖ్యగమనిక:

  గుండు మధుసూదన్ గారు ఈ టపా విషయంలో తీవ్రమనస్తాపంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ టపాకు వచ్చిన వ్యాఖ్యలలో ఒకటి రెండు పర్యాయాలు తెలంగాణా పదం కూడా కనిపించటంతో వారు అదీ ఇదీ కలిపి జోడించుకొని ఇది ఆంధ్రులకు తెలంగాణాపై ఉన్న విద్వేషపూరితమైన కుసంస్కారంలో భాగంగా లెక్కించి ఒక టపా కూడా వ్రాసారు తమ బ్లాగులో. ఈ టపానూ దానికి నిన్నటివరకూ వచ్చిన వ్యాఖ్యలనూ కూడా జోడించి చూపి ఈ టపాకర్త్రీ, వ్యాఖ్యాతలూ అనబడే నంగనాచులూ తేనెపూసిన కత్తూలూ చేసిన నిందాలాపాలను ఖండించాలని యావత్తు తెలంగాణావాసులకు పిలుపు నిచ్చారు! ఇదంతా వారి అపోహ అని ఎవరన్నా ఇది ఆంధ్రుల కుసంస్కారం క్రిందికే వారి లెక్కించే తీరుతారు కదా!

  కాబట్టి అనవసరవాదవివాదాలకు తావివ్వకుండా ఈ టపాకు వ్యాఖ్యలు వ్రాసేవారి జాగ్రత్త వహించవలసిందిగా విజ్ఞప్తి.
  Reply
  Replies
  1. మాస్టారూ, గుండు మధుసూదన్ గారిపై వచ్చిన వ్యాఖ్యలలో అన్ని కాకపోయినా కొన్నయినా వ్యాఖ్యాతకు ఉన్న తెలంగాణా ద్వేషమే మూల కారణమన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి.

   ఇకపోతే ప్రతి విషవ్యాఖ్యకు క్రుంగిపోతే నష్టం మనను ద్వేషించే వారికి కాదు, మనకేనని మధు గారితో అందరికీ మనవి.
  2. జైగారూ,

   కొంత వ్యాఖ్యాత దృక్కోణబేధం వలన అపార్థాలు రావచ్చును. అలాగే అర్థం చేసుకొనేవారి దృక్కోణంలో ఉన్న బేదం వలన కూడా అపార్థాలు రావచ్చును. ఈ రోజున మీరే మరొకచోట ఒక వ్యాఖ్యలో "విశాలాంధ్ర కాదు విషాంధ్ర అనీ పీడా పోయింది!" అనీ అన్నారు. ఇవి కొందరికి రుచించకపోవచ్చును. మరలా దృక్కోణ బేధం వలననే. ఇప్పుడు విషం తిన్నట్లుగా గిలగిలలాడుతున్నది ఏ తెలుగుగడ్డ అన్నది ప్రతివారికీ తెలుసును, మీ రన్నది సబబుకాదు అని వారు అనుకోకూడదా? మాటవరసకు ఈ సంగతి ప్రస్తావించాను.

   ఏవిషయానికి ఆవిషయం ఆలోచించినా, ఇక్కడ ఏ వ్యాఖ్యాతకూ తెలంగాణా ద్వేషం అంటూ ప్రత్యేకంగా ఏమీ నా దృష్టికి కనిపించటంలేదు. పోనివ్వండి. నేను అలా ఆలోచించలేనేమో!
  3. @శ్యామలీయం:

   మీరు నా వ్యాఖ్యను ప్రస్తావించారు కాబట్టి ముందు దాని గురించి మాట్లాడుదాం. "విశాలాంధ్ర" అంటే సీమాంధ్ర కాదు, అక్కడి ప్రజలు అంతకన్నా కాదు. తెలుగు మాట్లాడే ప్రజలు అందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలని, ఇందుకు వేర్వేరు ప్రాంతాల ప్రజల అంగీకారం ఉన్నా లేకపోయినా ఫరవా లేదనే ఒక రాజకీయ ప్రయోగం మాత్రమె. దీన్నే విషమనో, దౌర్జన్యం అనో అనుకోవడంలో సబబు కానిదేమిటో నాకు తెలీడం లేదు.

   ఆంద్ర రాష్ట్రం ఇప్పుడు విలవిలలాడుతుందన్నది మీ అభిప్రాయం కావొచ్చు నేను ఒప్పుకోనక్కరలేదు. కేవలం ఇట్లాంటి "దృక్కోణబేధం" వల్ల విద్వేషపూరిత వ్యాఖ్యలు రావని నేను అనుకుంటున్నాను. Hatred is different from diasgreement.

   మధు గారి మీదే కాదు మీతో సహా ఎందరి మీదో బ్లాగులలో విషం కక్కడం మీరు చూసే ఉంటారు. ఆ ద్వేషానికి కారణం సదరు రచయిత శైలి కొంతయితే వారి ఆలోచనల మీదే ఎక్కువ.

   PS; తెలంగాణా ద్వేషం మీరు చూసారో లేదు నేను చూసాను.
  4. యెదటివాళ్ళు దొరికిపోయినప్పుడు నీతులు చెప్పడం జై గారికి బాగా తెలుసు.23 జిల్లాల ప్రజల సమాహారం అనై తెలిసి కూడా "బోడి ఆంధ్రప్రదేశ్" అని అందంలో ద్వేషం ఉందా విభేదించటం ఉందా?

   తెలంగాణాని సంస్క్ర్తి గురించి మీరేమి మాట్లాడినా ఒప్పుకుంటూ మేము మీ మంభావాల్ని గౌరవించాలి,కానీ రవాణా పన్నుల విషయంలో ఒక బ్లాగరు ఆవెదన చెందుతుంటే "మీ మనోభావాల గొడవ మాకెందుకు?" అనే రకంగా మాట్లాడినా చెల్లుతుంది.మీ మనోభావాలు మాతర్ము మేము పట్టించుకుంటే చాలు,మా మనోభావాలు మీరు పట్టించుకోరు - అంతా యేకపక్షంగా మీకు ఫావరబుల్ అయీతేనే న్యాయం లేకపోతే ఆంధ్రా పెత్త్తందారీ తనం,అంతేనా?
  5. మిత్రమా హరిబాబు గారూ, మీలాంటి అతిరధ మహారధులు మరియు వీరోత్తముల ముందు ఈ కామన్ సెన్స్ లేని వాడెంతలెండి :)

   బోడి అన్నా, పీడ అన్నా, దౌర్జన్యం అన్నా అన్నీ పైన చెప్పిన "విశాలాంధ్ర" గురించే.

   మా సంస్కృతిని మీరు, మీ సంస్కృతిని మేము మెచ్చుకోవాలని అనలేదు సార్, కించపరచొద్దు చాలు.

   రవాణా పన్ను ఆర్ధిక రంగానికి చెందింది, పైగా హక్కు కూడా. ఎవరివో మనోభావాలు దెబ్బ తింటాయని హక్కులను వదిలేసుకుంటే మొదటికే నష్టమే కాక ఆయన థాంక్స్ కూడా చెప్పడు. వారి మనోభావాలపై వారి ప్రభుత్వానికి అంత సోయి ఉంటె మాకు ఆమేరకు పరిహారం ఇస్తే పోతుంది. It was open to Andhra govt. to offer "please don't tax our people, we will compensate Telangana for the loss so incurred".
  6. నాకు తెలిసినంతవరకూ "బోడి" అనే మాటకి "దౌర్జన్యం" అనే మాట గానీ "పీడ" అనే మాట గానీ అర్ధ తాత్పర్యాల్లోనూ సమానార్ధకాల్లోనూ యెక్కడా కలవదు.మనకి బాగా అలుసు గానూ చిన్న చూపు వుందే వాటికి మాత్రమే ఆ మాటని కలుపుతారు "పోవాయ్ బోడి తెలివి చూపిస్తున్నావు" దగ్గిర్నుంచి "బోడి ముండ" వరకూ!మీరు అవన్నీ సమానార్హకాలు అని "బోడి" కీ "దౌర్జన్యం" కీ ముడి పెట్టేస్తున్నారు?సమర్ధించుకోవదం తెలిస్తే బూతు కూడా నీతి అవుతుంది,కానివ్వండి!మరీ కుదరదనుకుంటే 60 యేళ్ళ దోపిడీఎకి కడుపు మండి అట్లా అన్నాం అని తిరగేస్తారు,యెందుకొచ్చిన కెలుకుడు.మీరు బోడి ఆంధ్రప్రదేశ్ అన్నా తప్పు లేదు లెండి,మా అనోభావాలు దెబ్బతిన్నా ఫర్వాలేదు లెండి.
  7. ఆయా మాటలు సమానార్ధకాలు అని అనలేదు బాబోయ్.

   అన్నిటినీ అన్నది పైన చెప్పిన "విశాలాంధ్ర" అలియాస్ "తు హా కర్ యా నా కర్ తు హాయ్ మేరీ కిరణ్" భావజాలాన్నిసార్!

   I did not claim these adjectives are synonymous. I only point out these were individually & severally used to describe the hegemonic concept of "unity with or without consent".
  8. I am not questioning yu to have your own ""unity with or without consent" openion.

   I am asking you about the usage of "బోడి ఆంధ్రప్రదేశ్".మీరు వాడిన మొత్తం వాక్యం ఇలా ఉంది "మాయమై పోయింది బోడి ఆంధ్రప్రదేశ్".అందులో ఉన్నది ద్వేషం కాదనీ కేవలం అభిప్రాయ భేదమని యెవరయినా యెలా అనుకోగలరు?
  9. Please see above:

   "విశాలాంధ్ర" అంటే సీమాంధ్ర కాదు, అక్కడి ప్రజలు అంతకన్నా కాదు. తెలుగు మాట్లాడే ప్రజలు అందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలని, ఇందుకు వేర్వేరు ప్రాంతాల ప్రజల అంగీకారం ఉన్నా లేకపోయినా ఫరవా లేదనే ఒక రాజకీయ ప్రయోగం.

   Visalandhra or Andhra Pradesh is *this* concept. I am not referring to the physical administrative region (much less its inhabitants).
  10. స్పర్థ ను లేవ దీసిన డీ జీ మానవుడు గుడుంబా అయి పోయే ! హరి గొట్టె జై గొట్టె కామంటు పెట్టె అయి పోయింది ఈ సీరీసు !

   మహానుభావు లారా!

   ఈ టపా వ్యవసాయమున కు ఇంత గొప్ప గా కామెంటు 'weed' (feed we know but not weed you see!) వచ్చునని నా ఊహకు అందక పోయే !!

   జేకే!
   జిలేబి
 14. నారదా ! నారదా !
  ఇక్కడేదో అగ్గి బుగ్గవుతావుంది ! నారదా ఘ్రుతం ఎక్కడ ! వెంటనే పరుగెట్టు కు రా ! దిగిరా ! దివినించి భువి కి దిగి రా !

  జిలేబి
  (నారదా!)

  @కామెంటిన /కామెంట బోయే అందరికి గమనిక - హెచ్చరిక ! ఖబడ్దార్ ! మీరెవరో ఎక్కడి నించి కామెంటు తున్నారో అంతా మా కెరుక !

  ఈ టపా చాలా పవిత్రమైన గుండు జ్ఞానం గురించి. ఇందులో ప్రాంతీయ విభేదాలు గట్రా దయుంచి తీసుకు రావద్దు. ఆం తెలం రాయ కి గుండు జ్ఞానానికి సంబంధం అస్సలు లేదు గాక లేదు అని గుండు బల్ల గుద్ది వక్కాణిస్తున్నాది గుండు జిలేబి.

  @గుండు మధుసూదన్ వారు,

  ఈ గుండు జ్ఞానం టపా కి ప్రజ వారి టపాలో వచ్చిన ఒక గుండు టపా ఉత్ప్రేరకం. ఆ గుండు టపా కూడా మీ కు సంబంధించినది కాదు. జ్ఞానం ఎట్లా వచ్చును అన్న ప్రశ్న కి గుండు జ్ఞానం గురించి ఒక వాక్యం లో చెబితే, కొండల రావు గారు, గుండు జ్ఞానం ఎట్లా వచ్చును అని ప్రశ్నించేరు . దానికి సమాధానం ఈ టపా. కాబట్టి నిశ్చయం ఇది మీ పైన గుండు వేటు కాదు గాక గాదు,

  ఇక మీ గుండు పద్యం సొబగు గుమ్మడి కాయ సొబగు ! సేహభేషు !!

  జిలేబి
  Reply
 15. అయ్య లారా ! అమ్మలారా ! బ్లాగు వీరు లారా వీరాంగణు లారా ! వీర 'ఘను లారా! వీర 'గన్' లారా !

  ఈ టపా కి ఉత్ప్రేరకమైన టపా లింకు ప్రజా బ్లాగు ది ఇది

  http://praja.palleprapancham.in/2015/05/blog-post_50.html

  కావున మీ కామెంటు లను ఈ టపా కంటెంటు ఐన గుండు జ్ఞానము వరకు మాత్రమె పరిమితము చేసుకుని గుండు జ్ఞానము ను మెండు గా పొందుడు !

  ఆమెన్ !

  జిలేబి
  Reply
 16. గుండును గుండనవలె బండిని బండనవలె
  గుండును బండి యన్నా బండిని గుండు యన్నా
  గుండు పగిలి పోతుంది ఆపై బండి నడవదు గువ్వల చెన్నా!
  Reply
  Replies
  1. This comment has been removed by the author.
  2. మీ ధోరణి మారదు. నిరాశ కలిగిస్తున్నారు. ఒకే విషయం గురించి ఇంత సాగతీత అవసరమా? అది కూడా ఇతరులను నొప్పించే పరిస్థితి ఉందని వెల్లడైనాక కూడా? ఈ టపాలో ఇంక ఈ విషయమై నేను చెప్పవలసింది ఏమీ లేదు. ప్రసిథ్థమైన ఈ తిక్కనగారి పద్యం గుర్తుచేసి ముగిస్తున్నాను.

   కం. ఒరు లేయవి యొనరించిన
   నరవర యప్రియంబు తనమనంబున కగు దా
   నొరులకు నవి సేయకునికి
   పరాయణము పరమధర్మ పథముల కెల్లన్.

   స్వస్తిరస్తు.
  3. మాస్టారూ,
   నేను గుందువారిని గురించి అసలు యేమీ వెక్కిరింతగా గానీ కనీసం హాస్యంగ అనైనా అనలేదే?

   మొదటి నుంచీ ఇప్పటి వరకూ నాకు ఆయన మీద యెలాంతి ద్వేషం గానీ కనీసం చినచూపు కూడా లేదు!

   శుభమస్తు!

***        ***        ***        ***7 కామెంట్‌లు:

పల్లా కొండల రావు చెప్పారు...

జిలేబి గారు వ్రాసింది దానికి నేను కామెంట్ వ్రాసినది మిమ్ములను ఉద్దేశించి కాదు. నాకు తెలీకుండానే ముమ్ములను బాధ పెట్టి ఉంటే క్షమించాలి.

Agnatha చెప్పారు...

Think positive.....you are one among thousands.
There was another post about hanuman also.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

***కొండలరావుగారూ,
అంత మాట అనవద్దు కొండలరావుగారూ! మీరు నన్నేమన్నారని? ’గుండు’ గురించి వివిధ రకాలుగా కామెంట్‍లు చేసిందెవరో వారిని ఉద్దేశించి, వారి చేష్టలు ఎలా ఉన్నాయో తెలంగాణులు తెలుసుకోవాలని ఈ టపా పెట్టాను. నాకు తెలియకుండానే మిమ్మల్ని నొప్పించి ఉంటే నన్ను మన్నించండి కొండలరావుగారూ!


***అజ్ఞాతగారూ,
నేను పాజిటివ్‍గానే ఆలోచిస్తున్నాను. నేను వేల మందిలో ఒకరిని కావచ్చును. కాని ప్ర.జ.బ్లాగులో కొండలరావుగారు ఇంటర్వ్యూ చేసినది ఈ "గుండు"నే. అదీగాక వ్యాసకర్త్రి ఆంజనేయస్వామి టపా గురించే ఎరుగరు. వారికి ప్రజలోని గుండు మాత్రమే తెలుసు. మరెలా పాజిటివ్‍గా ఆలోచించాలో చెప్పండి? కువిమర్ష చేయబడే వ్యక్తి ఎదుట లేనప్పుడు ఇలా వ్యంగ్యంగా...అసభ్యంగా...అగౌరవంగా వారిగురించి రాసుకోవడం సంస్కారవంతుల పనేనా? మీరే పాజిటివ్‍గా ఆలోచించిచూడండి! నా స్థానంలో మీరే వుంటే ఎలా ఆలోచిస్తారో చెప్పండి అజ్ఞాతగారూ!

శ్యామలీయం చెప్పారు...

గుండువారూ,

మీరింతగా నొచ్చుకొనవలసిన అగత్యం లేదు. జిలేబీగారిది హాస్యధోరణి. అంతే గాని ఆవిడకు ఎవరిమీదో ఎందుకనో కోపమో ద్వేషమో ఉంటుంద్ని అనుకొనవలసిన పనిలేదు. అక్కడి వ్యాఖ్యాతలు కూడా హాస్యరసప్రథానంగా ఉన్న ఆవిడటపాకు అనుగుణంగా వ్యాఖ్యలు వ్రాసారు కాని మిమ్మల్ని వ్యక్తిగతంగా ఉద్దేశించి అనుకోవద్దు. అందరితో పాటే నేనూ ఆ టపాక్రింద కొన్ని కందపద్యాలు వ్రాసాను. అవన్నీ హాస్యోక్తులుగా వ్రాసినవే కాని మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని వ్రాసినవి కానే కావు కదా. ఒకటి రెండు వ్యాఖ్యల్లో కించిత్తు అప్రస్తుతంగానే ఐనా తెలంగాణా ప్రసక్తి వచ్చి ఉండవచ్చును. అంతమాత్రంచేత అది విద్వేషం అనుకుంటే అది మీరు అసహనంతో ఆలోచించటమే అవుతుంది. ఎవరికీ తెలంగాణా పట్ల ద్వేషమూ పాడూ ఏమీ లేదు. తెలంగాణా బ్లాగర్లు కొందరు అనునిత్యం ఆంధ్రప్రజానీకాన్ని తూర్పారబట్టటమే విధిగా వ్రాస్తున్నవిషయం అందరూ గమనిస్తూనే ఉన్నారు బ్లాగులోకంలో. మీ ధోరణి మీది. అంతమాత్రంచేత నాకు కాని జిలేబీ గారి ఈ టపాలో వ్యాఖ్యలు ఉంచిన మిగిలిన వారికి కాని మనస్సులో తెలంగాణాపట్ల విద్వేషం ఉన్నదని భావించటం కేవలం దూరాన్వయమూ దురన్వయమూ అవుతుందని నా అభిప్రాయం. మీరు ఏకీభవించాలని లేదు. అక్కడ నేను కూడా వ్యాఖ్యలు వ్రాసాను కదా అందుకని, నా అభిప్రాయం మాత్రం నేను మీకు తెలిపాను. నాకు అందరూ సమానమే. కేవలం అభిమానపురస్సరంగానే బహుకాలంగా నేను మిమ్మల్ని ఉద్దేశించి గుండువారూ అనే సంబోధిస్తూ వ్యాఖ్యలు ఉంచుతున్నాను కదా. మీరు నొచ్చుకోనవుసరం లేదు ఇలాంటి చిన్నచిన్న విషయాలను కూడా భూతద్దాలలో చూస్తూ.

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

మధుసూదన్ గారు !
వాదనలకు నిలబడలేని వారే వెటకారాలకు, అవహేళనలకు దిగుతారు.
మీరు ఇవేవి పట్టించుకోకండి.
అసలు అరవయ్యేళ్ళ వెటకారాల, అవహేళనల కొంకి గుణం ఫలితంగానే కదా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

శ్యామలీయంగారూ,

మీరు నన్ను ఉద్దేశించి రాయకుంటే...వ్యాఖ్యానించకుంటే...చర్చించకుంటే...వ్యంగ్యోక్తులాడకుంటే.....

DGMay 30, 2015, 3:42:00 AM చేసిన వ్యాఖ్యలో చివరగా...
(ఇదంతా నా బుర్రలోంచి వచ్చిందనుకుంటున్నారా? అబ్బే నాకంత సీనేదీ? నమస్తే గుండు సౌజన్యంతో)
అనడమూ...
అలాగే...పోతనగురించి మాట్లాడుతూ..."త" తెలంగాణదే అని వ్యంగ్యంగా అనడం...
పైగా...ఆంధ్రా తెలంగాణల ప్రస్తావన తేవడం....
మీరంతా నోరుమూసుకొని తమాషా చూడడమూ....ఖండించకపోవడమూ చూసిన ఎవరైనా అర్థం చేసుకుంటారు...మీలో నాపై ఏమూలనో కించిత్ కోపమో...ద్వేషమో...ఉందని...అయినా మీరు ఏమీ లేదు...అంతా వట్టిదే...హాస్యానికే...అంటున్నారు...హాస్యానికే అయితే "గుండు" పై వ్యాఖ్య్య చేయడం...నమస్తేతెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...ప్రస్తావన తేవడం...ఆంధ్రతెలంగాణల ప్రస్తావన తేవడం...ఇదంతా ఏమీ అర్థం చేసుకోలేని చిన్నపిల్లవాడినా నేను? చెవిలో పువ్వు పెట్టడం కాకపోతే మరేమిటి?

పిల్లి కళ్ళు మూసుకొనిబ్ పాలుతాగుతూ నన్నెవరూ చూడలేదన్నట్టుంది మీ వ్యవహారం...పైగా సంజాయిషీ...బాగుందండీ...

కష్టే ఫలే ’శర్మ’గారుకూడా మీతో గళం కలపడం...చూస్తుంటే...ప్ర.జ.పల్లెప్రపంచంలో పల్లావారు నా ఇంటర్య్వూ చేయడం...మీకు ఇష్టం లేనట్టుంది...కాబోలు...

స్వస్తి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

డా.ఆచార్య ఫణీంద్రగారూ!
నమస్కారం.
మీరన్నది అక్షరాలా నిజం...కానీ...మనస్సుండబట్టక...వీళ్ళువేసే వెర్రిమొర్రి వేషాలు మనవాళ్ళందరికీ తెలియాలని...ఈ టపా ప్రచురించాను. తాటాకుల చప్పుళ్ళకు భయపడేవాణ్ణి కాను కాబట్టే...ఎవరి వ్యాఖ్యల్నీ లెక్కించకుండా...దేనికీ బెదరకుండా... పోరాటం సాగిస్తూనే వున్నాను. చివరికి తెలంగాణ రాష్ట్రం సాధించాం! మన తెలంగాణ సాధనలో నేనూ భాగస్థుడనైనానన్న తృప్తి నాకుఁ జాలును.

ఈ గోల విషయం పోనిండు....ఈ విషయంగా నైనా మీరు ఇలా కలిశారు. సంతోషం.

మీకు నా తెలంగాణ రాష్ట్రావిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!
స్వస్తి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి