గెజిట్‍లోన తెలగాణకు
కేంద్రమ్మిడె మరో ఆంక్ష!
కేంద్రమె తెలగాణపట్ల
మరో మోసమును చేసెను!!
"కేంద్రమె తెలగాణమిచ్చె
మహాభాగ్యమిదెయయ్యా!
హైద్రబాదుగూడనిచ్చె
జన్మధన్యమాయెనయా!!
గెజిటుగూడ వెలువరించె
కొత్తచరిత మొదలయెనయ!"
ఇదియె సగటు తెలగాణుని
ఆనందమ్ముకు హేతువు!!
హైద్రబాదుపై ఆంక్షలు;
హైకోర్టును ఉమ్మడనుట;
విద్యగూడ కామననుట;
నదీజలంపై ఆంక్షలు;
శాంతిభద్రతలు, ఉద్యో
గాలును పదియేండ్ల వరకు
ప్రశ్నార్థకముగ నుంచియు,
మనను మోసగించెనయ్య!
గెజిట్టునే శ్రద్ధగాను
చదివిన నొక రహస్యమ్ము
బట్టబయలు అగునయ్యా!
మోసము విదితమ్మగునయ!!
ఇట ప్రభుత్వరంగ సంస్థ
లనుకూడ పదేండ్ల వరకు
తెలంగాణ చేతికిడక
చిల్లులు పొడిచెను కేంద్రము!
విస్మయమ్ము కలిగించెడి
విషయమ్మిది చూడగాను
ఈ సంస్థలు నూటయేడు
ఉమ్మడిగా కొనసాగును!
ఈ సంస్థలపై వత్సర
కాలము ఉమ్మడి అధికా
రమ్మును కట్టగబెట్టెను
కేంద్ర, మ్మిది వింతగాదె?
రెండు రాష్ట్రముల సంస్థలు
వేరువేరుగా చేతకు
గరిష్ఠకాలపరిమితిని
పదేండ్లుగా నిర్ణయించె!
విభజన కొరకయి ఏర్పా
టును చేసిన కమిటీయే
ఒక వత్సర కాలంలో
నివేదికను ఈయలేదె?
ఏడాది అనంతరమ్ము
వేరువేరు సంస్థలుగా
ఏర్పాటును చేసుకొనగ
వలసియుండ, షరతులేల?
గరిష్ఠ కాల పరిమితిని
పదియేండ్లకు విధియించుట
కేంద్రము బూనిన కుట్రయె!
ఇట్టి ఆంక్ష మనకెందుకు?
ఈ సంస్థలు తెలంగాణ
పాలనమున కీలకమగు
ప్రభావమ్ము జూపునవే!
ఇట్టి ఆంక్ష మనకెందుకు?
హైదరబాదు, హైకోర్టు,
విద్య, నదీజలాల్, శాంతి
భద్రత, లుద్యోగమ్ములు
కేంద్ర పెత్తనమున నుండె!
ఈ గెజిటు ప్రకార మిపుడు
ప్రభుత రంగ సంస్థలన్ని
కేంద్ర పెత్తనమునందున
పది యేడుల వరకుండును!
ఇంత మోసమును చేసిన
కేంద్రము మనకిడినదేమి?
అరచేతను స్వర్గమ్మును
జూపి మోసగించలేదె?
కాంగ్రెస్సే తెలగాణుల
చెవిని పువ్వు పెట్టినదయ!
తెలగాణుల నమాయకుల
జేసి మోసగించెనయ్య!!
ఇట్టి కాంగ్రెసును మనమిక
తలపై పెట్టుకొనగ వలెనె?
ఓట్లు గొనియు గెలుపొందెడి
అర్హత కోల్పోలేదా?
మన కష్టము బాపునట్టి,
మనకాసరనిచ్చునట్టి,
మనను ప్రేమ జూచునట్టి
పార్టీనే గెలిపింపుడు!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
2 కామెంట్‌లు:
సీమాంధ్రులకు చిప్ప చేతికిచ్చి. ఆత్మహత్యతప్ప బ్రతికేందుక్కూడా వీల్లేని దుర్భరస్థిని కలిగించటం తప్ప మరేమి చెసినా అది తెలంగాణా అనేదాని మీద కుట్రక్రిందే జమకట్టే మీ కుబుధ్ధి చూస్తే చివరకు అసహ్యం కలుగుతుంది సీమాంధ్రులకు. ఆక్కడివాళ్ళూ మనుష్యులే, వాళ్ళకూ న్యాయమూ జీవనమూ కోరే హక్కు ఉంటుందీ అన్నదే మీ చిట్టిబుఱ్ఱకు తట్టదా?
మీ సంకుచిత బుద్ధికి నేను కుబుద్ధిగానే దర్శనమీయక, సుబుద్ధిగా దర్శనమిస్తానా? అరవై ఏండ్లుగా తలంగాణ నీళ్ళూ,నిధులూ, కొలువులూ, వనరులూ దోచుకుని, తెలంగాణకు ద్రోహంచేసినవాళ్ళు మీ కంటికి సుబుద్ధులుగా కనిపించి, తెలంగాణ విమోచనకై నిరంతరం పరితపిస్తూ, ప్రత్యేక రాష్ట్రసాధనకై ఈ బ్లాగు రూపంగా పోరాటం చేస్తూ, చివరకు మా తపఃఫలంగా తెలంగాణ సిద్ధిస్తే, దాన్ని డొల్లగా ఉన్న తెలంగాణగా మార్చడానికి కృషిచేసే కుహనా నాయకుల కుట్రలను నా టపాల ద్వారా బహిర్గతం చేస్తూంటే, సహించలేక, అర్థంలేని ఉక్రోషంతో, లేని పోని అభాండాలను నాపై వేసి నన్ను నిందించటం మీలాంటి (హైదరాబాదులోని తెలంగాణుల ఉద్యోగాన్ని దక్కించుకొని, రిటైర్ అయి, పెన్షన్‍సొమ్ముగా తెలంగాణసొమ్ము అనుభవిస్తూన్న)పక్కా ఆంధ్రా వాలాకే చెల్లింది. తినేది మగని సొమ్ము, పాడేది ఇంకొకడి పాట అన్నట్టుగా ఉంది మీ వ్యవహారం. నేను చాలా సార్లు చెప్పాను. మా పోరాటం సీమాంధ్ర ప్రజలపైకాదు, సీమాంధ్ర అక్రమార్జనపరులపై, నాయకులపై,పెట్టుబడిదారులపై అని! ఐనా ప్రజలవైపే ఉన్నట్టు కనిపిస్తూ, అక్రమార్కులను వెనకేసుకొనిరావడం చూస్తుంటే మీ బుద్ధి సుబుద్ధికాదు, కుబుద్ధి అని నిరూపణ అవుతున్నది. మీరు కుబుద్ధులై నన్ను అనటం బాగాలేదు. నేను సీమాంధ్రులకు చిప్పచేతికివ్వమని ఏనాడూ అనలేదు. ఆత్మహత్య తప్ప బతికేందుకు కూడా వీల్ల్లేని దుర్భర పరిస్థితి కల్పించాలని ఏనాడూ కోరలేదు. బహుశః మీ మనస్సులో ఈ కోరిక ఉండిఉండవచ్చు. ఎందుకంటే నేను అడ్డుకుంటున్నది సీమాంధ్ర ప్రజలను కాదు. సీమాంధ్ర పెట్టుబడిదారులను, స్వార్థ నాయకులను! సీమాంధ్రులకు ఇచ్చే హక్కులతో పాటు, కేంద్రం సూచించిన తెలంగాణలోని వెనుకబడిన ఎనిమిది జిల్లాలకు కూడా హక్కులు కల్పించాలని అడుగుతున్నా. మీరు సీమాంధ్ర ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకున్నట్టు లేదు, అక్రమార్కులకు వత్తాసు పలికినట్టుగా ఉంది. నేను ఎవరిని ఉద్దేశించి అంటున్నానో అర్థం చేసుకోకుండా, సీమాంధ్రులను నేనేదో చంపుతున్నట్టుగా బిల్డప్పు ఇవ్వడం బాగాలేదు. ఇంతకన్న కుత్సితమైన ఆలోచన మరోటిలేదు. నన్ను అడ్డుకోవడమే, విమర్శించడమే పనిగా పెట్టుకున్న మీకు ఇంతకన్న సంకుచితమైన ఆలోచన రాక మరేం వస్తుంది? అరవైఏండ్లుగా మీ వంటి స్వార్థపరులమూలాన బానిసలుగా మార్చబడిన మేమూ మనుషులమనీ, మాకూ న్యాయమూ, జీవనమూ కోరే హక్కుంటుందనీ...కుట్రపూరితమైన ఆలోచనలు చేసే మీ ఘనత వహించిన బుర్రకు తట్టదా? ఒకరిని అనే ముందు, వారిని అనడానికి తగిన అర్హత తమకు ఉందోలేదో తెలుసుకొని అనాలి. నోరున్నదికదా అని ఇష్టం వచ్చినట్టు అంటే పడడానికి మేం ఇంకా మీ బానిసలం కాం. మర్యాదగా మాట్లాడి మీ పరువు దక్కించుకోండి. గౌరవప్రదంగా వాదించండి. మీరు ఏకపక్షంగా అన్యాయానికే పట్టం కడుతూ మాట్లాడటం అసహ్యకరంగా ఉంది. అనవసరనిందలు మానండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి