గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, మార్చి 08, 2014

న్యాయమేవ జయతే!


అక్రమముగ తెలంగాణ
నోరునొక్కి, లాబీలతొ
పొత్తుగూడి, అరువదేండ్లు
పాలించియు దోచుకొనిరి!

వేరురాష్ట్రమేర్పడుటయె
న్యాయమనుచు కేంద్రమ్మే
రాష్ట్రమిడగ, సీమాంధ్రులు
న్యాయస్థానముకెక్కిరి!

న్యాయమ్మే తెలంగాణ
పక్షమ్మున నుండగాను,
అన్యాయము చేయుకొరకు
కోర్టుకెక్క, కోర్టు తన్నె!

అభియోగములేవియున్న
కేంద్రము వివరింపవలెను!
వివరణ పరిశీలించియు
విచారణము చేయుదుమనె!!

కేంద్ర వివరణమ్ము పిదప,
అవసరమని భావించుచొ,
రాజ్యాంగ ధర్మాసనముకు
బదిలీ చేయుదు మనియెను!

సీమాంధ్రులు ఎన్ని నాట
కములాడిన, స్టే కోరిన,
సరకు గొనక, స్టేను ఇడక,
తేదిలేని వాయిదిడెను!

న్యాయబద్ధమైన తెలం
గాణ రాష్ట్రమును ఎవ్వరు
ఆపలేరు, ఆపలేరు!
కుట్రలన్ని కూలిపోవు!!

ఆఖరి బాల్, బ్రహ్మాస్త్రము,
కొత్తపార్టి పిచ్చికూత,
తెలంగాణ రాష్ట్రమ్మును
ఆపలేవు, ఆపలేవు!

న్యాయమ్మీ తెలంగాణ,
ధర్మమ్మీ తెలంగాణ,
సత్యమ్మీ తెలంగాణ!
తెలంగాణ విజయమిదే!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి