గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, మార్చి 01, 2014

అసందర్భప్రలాపాలు!


"బిడ్డ పుట్టె, తల్లి చచ్చె"
అనుమాటకు అర్థమేమి?
సీమాంధ్రయు, తెలంగాణయు
తల్లీబిడ్డలు ఔదురె?

ఈ "ఆంధ్రప్రదేశ"మను
రాష్ట్రమ్మేర్పడక మునుపె
తెలంగాణమున్నదయా!
మరల పుట్టుటెట్లు జరుగు?

తల్లియె సీమాంధ్రమెట్టు
లగునో తెలుపంగవలయు!
సందిగ్ధపు మాటలున్న
విమర్శలను మానవలయు!!

సీమాంధ్రను చంపి మేము
తెలగాణను కోరితిమా?
సోదర రాష్ట్రాల్ రెండిక
కావలెనని కోరలేదె?

సీమాంధ్రులు, తెలగాణులు
సోదరులే అగుదురయ్య!
తల్లి బిడ్డలనుట తప్పు!
అవగాహన లేని మాట!!

అసందర్భ ప్రలాపాలు
ప్రజనాకర్షించుకొరకె!
ఓట్లు సీట్లు పొందుకొరకె!
అధికారమునందుకొరకె!!

సీమాంధ్రకు న్యాయమ్మును
అడిగినట్టివారలకును,
తెలగాణకు న్యాయమ్మును
చేయాలని తోచలేదె?

నీళ్ళలోన, నిధులలోన,
కొలువులందు, చదువులందు
గతంలోన అన్యాయమె,
మరల ఇపుడు అన్యాయమె!

న్యాయమేమిచేసిరయ్య
తెలగాణకు మీరలిపుడు?
పక్షపాతమును జూపెడు
మాటలు మాట్లాడుటేల?

మీతోడుగ వెంకయ్యను
చేర్చుకొనిన కారణాన,
మొగమోటముతోడ మమ్ము
బాధించుట యేలనయ్య?

న్యాయాన్యాయాల్ తెలియక,
వదరుటయే మీ పనియా?
తెలంగాణ మిమ్మెట్టులు
ఎన్నుకొనును నేతగాను?

అసందర్భప్రలాపాలు
మానుమయ్య నీ విప్పుడు!
తెలగాణకు వికటించిన
న్యాయముకై పూనుమిపుడు!!

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి