గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, మార్చి 15, 2014

మాకు ఈ మేకవన్నెపులుల అవసరం లేదు!


తెలంగాణులకు ఇప్పుడు
ఆంధ్రా నాయకులు పెట్టు
మేకవన్నె పులి పార్టీల్
కావలసెనె? కోరుకొనిరె?

జనసేనయె మాకెందుకు?
"సమైక్యమ్ము" మాకెందుకు?
చలనచిత్ర వేషగాండ్ల
నటన పార్టి మాకెందుకు?

అన్నమీదికోపంతో
పార్టిపెట్టి, లాభపడగ
నెంచి, కల్లబొల్లి ఏడ్పు
లేడ్చెడివారెందుకయ్య?

తెలంగాణ ఉద్యమాన
ఎప్పుడైన కలిశావా?
మాతో "జై తెలంగాణ"
అనుచు గొంతు కలిపావా?

గోముఖవ్యాఘ్రము నమ్మగ
తెలగాణులు చెవినిపువ్వు
పెట్టుకొనియునున్నారా?
నీ పార్టీ మాకెందుకు?

"నా తెలగాణా" యంచును,
"మన తెలగాణా" యంచును,
పలుమారులు పలుకగానె
తెలంగాణుడవు ఔదువె?

తెలగాణను పుట్టిపెరిగి,
తెలంగాణ ఊపిరిగొని,
తెలంగాణ తల్లినెపుడు
భక్తిదలచు దెలగాణుడు!

వీహెచ్చును మెచ్చుకొనుచు,
జగ్గ్గారెడ్డిని పొగడుచు,
కాంగ్రెస్సును తిట్టినచో
సంతోషము వారికౌనె?

అన్న కాంగ్రెసున ఉండగ
"కాంగ్రెస్సుకు హఠావో,
దేశ్ బచావో" అనగా,
పాలి పగల మాట కాదె?

నాకు శత్రు లెవరు లేరు
అనగానే నమ్మాలా?
శత్రు లెవరు లేనప్పుడు
పార్టీ పెట్టుట ఎందుకు?

అన్న పైన కోపంతో
కాంగ్రెస్సును తిట్టగానె,
ఉత్తముడవు నీవైతివె?
అన్న దొంగె, నీవు దొంగె!

వగల ప్రేమలొలుకబోసి,
ఓట్లు కొల్లగొట్టనెంచి,
తెలంగాణ పాటపాడు
దొంగ నటుడ వీవె కాదె?

తెలంగాణ విముక్తికై
ఉద్యమించినట్టి పార్టి,
కృతజ్ఞతగ తెలగాణుని
నరనరాన నిలుచు పార్టి

తెలగాణను కాచునట్టి
ఒక్కపార్టి మాకు చాలు!
తెలంగాణ కల నెరవే
ర్చెడి పార్టియె మాకు చాలు!!

ఆంధ్రపార్టి మాకెందుకు?
నటుల పార్టి మాకెందుకు?
ఇపుడు ముంచినది చాలును,
మరల ముంచనిచ్చెదమా?

మేము కష్టపడుచుండగ,
నీవెచ్చట దాగినావు?
కష్టమ్ములు తీర్చగాను
ప్రయత్నమ్ము చేసితివే?

నటుడవైనచో చిత్రాల్
నిర్మింపుము, చూతుమయ్య!
రాజకీయములు చేయుచొ
ఖండింతుము, పోపోవయ!!

నీవు మంచివాడవైన,
పరనిందను చేయనేల?
పర ప్రశ్నకు జవాబులను
ఈయకుండ, తిట్టనేల?

ఉత్తముడవు నీవగుచో
ఫేసుబుక్కు ప్రశ్నములకు
సమాధానమీయవయ్య!
పరనిందలు మానుమయ్య!!

నీ మాటల గారడితో
అభిమానులు మెచ్చగలరు,
కల్లబొల్లి ఏడ్పులన్ని
తెలగాణులు నమ్మరయ్య!

నీ పార్టీ మాకు వలదు!
మోసగించు చేత వలదు!
నటియించెడి మాట వలదు!
మేక వన్నె పులియు వలదు!!

"తెలంగాణ" అనియు కాక,
"జై ఆంధ్రా" అనియు కాక,
మధ్యస్థమ్ముగ నుండిన
నాటకాలు కాక యేమి?

టీడీపీ మాకు వలదు,
వైసీపీ మాకు వలదు,
సమైక్యాంధ్ర పార్టి వలదు,
జనసేనయె మాకు వలదు!

మత తత్త్వము అంటుకొనని
పార్టిమాకు కావలెనయ!
సీమాంధ్రుల పొత్తులేని
పార్టి మాకు కావలెనయ!!

జనమనగానెవ్వరయ్య?
సీమాంధ్రుల? తెలగాణుల?
ఇరువురి వంచించునట్టి
నీ గానము మాకు వలదు!

సమైక్యాంధ్ర అంటావా?
తెలంగాణ అంటావా?
తెలుగుతల్లి కాక, తెలం
గాణతల్లి అంటావా?

తెలుగుతల్లి అనకుండా
ఆంధ్రనెట్లు జీవింతువు?
నాటకాలు కట్టిపెట్టి,
మూటముల్లె సర్దవయ్య!

అరువదేండ్లు మము దోచిన
సీమాంధ్రుల పొత్తు ఉన్న
పార్టీయే మాకు వలదు!
నీ జనసేనయె వలదయ!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

3 కామెంట్‌లు:

Trader చెప్పారు...

telangana kante trs ki dappu kottatanike mee blog baaga panikochetatlu undhi.. enthistunnaru endhi post post ki ??

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

తెలంగాణ బ్లాగుల్లో ఇలా అడ్డమైన రాతలు రాసే నీకు, సీమాంధ్ర పార్టీలూ, దోపిడీదార్లూ ఎంతిస్తున్నారో, అంతకంటే వెయ్యిరెట్లు ఎక్కువిస్తున్నారు! నువ్వుకూడా తెలంగాణ తల్లి ఋణం తీర్చుకుంటావా? నీకు కూడా నాకిచ్చినంత ఇస్తారు! సిగ్గులేకపోతేసరి! ఈ బ్లాగు తెలంగాణతల్లి సేవకే వినియోగ పడుతుంది. తెలంగాణతల్లి సంకెళ్ళు తొలగించడానికి కంకణం కట్టుకున్న ఉద్యమ నేతల పదసేవకే వినియోగపడుతుంది. నీలాంటి దగుల్బాజీలు ఎంత వదరుకుంటే నాకేమిటి? కుక్కబెదరించి చెప్పు ఎత్తుకుపోయినట్టు...నీ లాంటివాళ్ళ రాతలుంటాయి...నేను భయపడేది లేదు. రావద్దన్నా మళ్ళీ మళ్ళీ ఈ బ్లాగులోకి రావడం సిగ్గులేని జన్మలకే చెల్లింది. పైగా అడ్డమైన రాతలు! ఆంధ్రా...తెలంగాణా ... వేరు పడ్డాక కూడా...ఇంకా విషం చిమ్మాలా? మాకు జరుగుతున్న, జరిగిన అన్యాయాలగూర్చి మా బ్లాగుల్లో మేం సవాలక్ష విషయాల్ని చర్చించుకుంటాం. మధ్య నీ ఏడుపేమిటి? పోవయ్యా పెద్ద నీతులు చెప్పొచ్చావు!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

అన్నట్టు చెప్పడం మరిచాను! నేను నా టపాలో టీఆరెస్ విషయం ఎత్తానా? తెలంగాణ సాధనకు మా పార్టీయే కారణం అంటే మాపార్టీయే కారణం అంటూ తెలంగాణ ఎన్నికల ఓట్లుకొల్లగొట్టడానికి క్యూలో నిల్చొనున్నాయి! వీటన్నిటినీ వదలిపెట్టి నువ్వు, నేను టీఆరెస్‍నే పొగడుతున్నాననడం...తెలంగాణకై టీఆరెస్సే ఉద్యమించి, సాధించిందని ఒప్పుకొని కితాబివ్వటం అన్నమాట! మీ సీమాంధ్రులకు కూడా తెలుసు...ఎవరివల్ల తెలంగాణ సాధింపబడిందో! ఈ విషయంలో నీకు నా అభినందనలు!

కామెంట్‌ను పోస్ట్ చేయండి