గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, మార్చి 30, 2014

ఆంధ్రవాళ్ళు ఆంధ్రాకే...తెలగాణులు తెలగాణకె!!


తెలంగాణలోన తిష్ఠ
వేసినట్టి ఆంధ్రవాళ్ళు,
అక్రమముగ ఉద్యోగాల్
చేయుచుండ్రి నిస్సిగ్గుగ!

హైదరబాదున తొంబది
శాతము ఉద్యోగమ్ముల
నాంధ్రవారె ఆక్రమించి,
రాజ్యమేలుచుండిరయ్య!

తెలంగాణ రాష్ట్రమ్మున
ఇంకా వారలు ఉండిన,
తెలగాణుల కుద్యోగాల్
ఎచటినుండి వచ్చునయ్య?

ఆంధ్రవారు ఆంధ్రలోన,
తెలగాణులు తెలంగాణ
లో ఉద్యోగాలు చేయ
ఇరువురికిని మేలగునయ!

తెలంగాణ వచ్చినతరి
వారిని కొనసాగించుట
తగదని యెల్లరు గట్టిగ
ఉద్యమించవలెనయ్యా!

ఆంధ్రవారి నాంధ్రకిపుడు
పంపించగవలెనయ్యా!
తెలంగాణ ఉద్యోగాల్
తెలంగాణ కీయుడయ్య!!

ఉద్యోగుల విభజనమ్ము
స్థానికతను ఆధారము
జేసికొనియు చేసినచో
న్యాయమ్మే జరుగునయ్య!

హైద్రబాదు ఉద్యోగము
లందు తెలంగాణవారు
నలుబదెనిమిది శాతమ్ము
బదులుగ పదిశాతముండ్రి!

తెలంగాణ కొలువులందు
తొంబది శాతమ్మాంధ్రులు
ఎట్టులుంద్రు? తప్పకుండ
ఆంధ్రకె పంపించవలెను!

అక్రమముగ ఉద్యోగాల్
పొందినట్టి ఆంధ్రవాళ్ళ
నందరినీ ఆంధ్రకిపుడు
తప్పక పంపగవలెనయ!

తెలంగాణలోన ఎవరు
అధికారమునకు వచ్చిన,
వారలు, ఈ ఉద్యోగుల
కొనసాగింపును మాన్పుడు!

విభజించెడి అధికారులు
గిర్‍గ్లాని కమిషను చెప్పి
నట్టి నివేదికను అమలు
పరచినచో న్యాయమగును!

అరువదేండ్లుగా తెలం
గాణకు అన్యాయమ్మును
ఆంధ్రవారు చేసినారు!
ఇపుడు కూడ చేయుదురా?

ఈ అన్యాయమ్మును ఇకపై
తెలగాణులు సహియింపరు!
స్థానికతన విభజింపక
పోయినచో ఉద్యమింత్రు!!

విభజన కమిటీ ఇప్పుడు
గతంలోన జరిగినట్టి
అన్యాయములను గ్రహించి,
న్యాయము జరిపింపవలెను!

ఆంధ్రవారి నాంధ్రాకే
తప్పక పంపించవలెను!
ఖాళీ ఉద్యోగములలొ
తెలగాణుల నింపవలెను!!

ఆంధ్రవాళ్ళ అక్రమాలు
ఇంకానా, సహియింపము!
తక్షణమే వారినిపుడు
ఆంధ్రాకే పంపవలెను!!

ఆంధ్రవార్కి ఏ ఆప్షను
ఈయరాదు, ఈయరాదు!
ఆంధ్రాకే పంపించుట
చేయవలెను, చేయవలెను!!

***     ***     ***     ***

మరిన్ని వివరాలకు

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి