గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, మార్చి 13, 2014

టీ"కోటలోపాగా" వేసిన ఆంధ్రపోలీసులు!


స్థానికతను బట్టి కాక
జనాభ ప్రాతిపదిక నిట
పోలీస్ శాఖను విభజిం
చినచో అన్యాయమె అగు!

స్థానికతను బట్టి విభజ
నమ్ము నిచట జరిపినచో,
పదోన్నతులు, ఉద్యోగాల్
క్రొత్తవి త్వరగా వచ్చును!

జనాభాను ప్రాతిపదిక
గా విభజన చేసినచో
తెలగాణలొ పరపాలన
తప్పకుండ జరుగునయ్య!

సీమాంధ్రుల కుటిలమ్మున
పోలీస్ రిక్రూటుమెంట్లు,
ప్రమోషన్లు అన్ని గూడ
ఏకపక్షముగ జరిగెను!

హైద్రబాదు నాశ్రయించి
ఉన్నతశ్రేణుల ఉద్యో
గమ్ములలో పీటముడియె
చిక్కువిడక నున్నదయ్య!

ఆప్షనిచ్చు అవకాశము
సీమాంధ్రులకిచ్చినచో,
తెలగాణను వీడనట్టి
గోమారులె అగుదురయ్య!

జరిగెనయ్య తెలగాణకు
మొదటినుండి అన్యాయమె!
నేడుకూడ ఉద్యోగుల
విభజనమున అన్యాయమె!!

కేంద్రమిపుడు తెలగాణకు
అన్యాయము జరిపినచో,
తెలంగాణ ఉద్యమించి,
లక్ష్యము సాధించగలదు!

తెలంగాణ ఉసురుతాకి
కాంగ్రెస్సే ఓడిపోయి,
అధికారము కోల్పోవుట
తథ్యమయ్య, తథ్యమయ్య!

దీనికి సంబంధించిన మరిన్ని వివరములకు

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి