గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, మార్చి 23, 2014

ప్రజా సంక్షేమాన్ని కోరేవారినే పాలకులుగా ఎన్నుకోవాలి!


తెలగాణకు మేలుచేయు
వారలెవరొ గుర్తింపుడు!
కీడుచేయునట్టివారి
మెడబట్టియు గెంటేయుడు!!

మాయ మాటలను నమ్మియు
మోసపోవు కాలమేగె!
యథార్థమును గమనించియు
ఎన్నుకొనుట మీకు బాగె!!

ఉద్యమమ్ము జరిగినపుడు
తప్పించుకు తిరిగినట్టి
నేతల స్వార్థపు కాంక్షను
ఓటుకత్తితో నరుకుడు!

ప్రజలు ఉద్యమించగాను
తోడుపడిన నాయకులను
గెలిపింపగవలెను గాని,
స్వార్థపరుల గెలిపింతురె?

మేలుచేయువారెవరో,
కీడుచేయువారెవరో,
ప్రత్యక్షముగా గాంచియు,
ఎన్నుకొనుడు, పదవులిడుడు!

తెలగాణము కోల్పోయిన
ఉద్యోగాల్ మరల నిడగ
ఉద్యమించు నేతలనే
ఎన్నుకొనుడు, పదవులిడుడు!

పోలవరము విషయంలో
తెలగాణకు మేలుచేయు
వారలనే గెలిపింపుడు,
వారలకే పదవులిడుడు!

మన చదువులు కొల్లగొట్టు
వారల కొమ్మును గాచెడి
నాయకులను ఓడింపుడు,
ఎదురుతిరిగి ప్రశ్నింపుడు!

తెలంగాణ ఉద్యమమున
పాలుగొనిన నేతలనే
ఆదరించి గెలిపింపుడు,
వారలకే పదవులిడుడు!

బంగరు తెలగాణ కొరకు
నిరంతరము శ్రమియించెడి,
తెలగాణకు కీడు నిడని
వారల గెలిపింపుడయ్య!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి