గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, మార్చి 04, 2014

ఇందుకే విలీనం చేయటంలేదు!


ఆంక్షలేమి లేనియట్టి
తెలగాణను ఇచ్చినచో
టీఆరెస్ విలీనమును
చేతుమనియె చెప్పిరయ్య!

ఆంక్షలతోడను ఇచ్చెడి
తెలగాణను కోరితిమా?
ఎంతటి ఆలస్యమ్మును
చేసినారొ యోచింపుడు!

బిల్ ఆలస్యము చేయగ
వేయిమంది బలిదానము
జరిగెను, నష్టమె తెలగా
ణకు కలిగెను  తీర్చగలరె?

బిల్ ఆలస్యము చేయగ
ప్రజలలోన భయాందోళ
నమ్ములు వ్యాపింపంగను
ఆత్మహత్యలే జరిగెను!

టీఆరెస్ సూచించిన
సవరణములు బిల్లులోన
చేయకపోవుటవల్లనె
విలీనమ్ము చేయలేదు!

పోలవరము ముంపునకును
గురియయ్యెడునట్టి గ్రామ
ములే కాక ఏడు మండ
లముల గుంజుకున్నారు!

ఉద్యోగుల పంపకమును
స్థానికతను గాక జనా
భాప్రాతిపదికగ చేయ
గాను పూనినారలిపుడు!

సీమాంధ్రను అక్రమముగ
చేపట్టిన ప్రాజెక్టుల
పేర్కొనియును తెలంగాణ
ప్రాజెక్టుల తెలుపలేదు!

ప్రాణహిత చేవెళ్ళను
జాతీయపు ప్రాజెక్టుగ
చేయమనగ వినకుండా
పెడచెవినిం బెట్టినారు!

సీమాంధ్రకు ఐదేండ్లకు
ప్రత్యేకపు ప్రతిపత్తిని
యిడియు, వెనుకబడినయట్టి
తెలగాణకు ఈయరేల?

సీమాంధ్రులు ప్రజలుగాని,
తెలగాణులు కారాయేం?
తెలగాణకు న్యాయమ్మును
జరిపింపక విడుచుటేల?

ఇన్ని కారణముల చేత
తెలగాణులు కాంగ్రెస్సును
ముందు ముందు గెలిపించుట
దుర్లభమ్ము, దుర్లభమ్ము!!

కేంద్రమునకు తెలగాణము
కనిపించక పోవుటయే
కాంగ్రెసునకు వినాశకము!
గెలువదయ్య, గెలువదయ్య!!

వోట్లకొరకె ఈ కాంగ్రెస్
ఇట్టి పనికి పూని మనకు
అన్యాయము చేసినదయ!
మనమెట్టుల సహియింతుము?

మనమంతా కలిసికట్టు
గాను కూడియుండి యిట్టి
కాంగ్రెసునకు బుద్ధిచెప్ప
వలెనయ్యా తప్పకుండ!

మన పక్షము టీఆరెస్
ఉన్నదయ్య భయమెందుకు?
తెలంగాణలోన అన్ని
చోటులందు గెలుపు మనదె!

ఒక్క సీటు కూడ ఇతర
పార్టీలకు దక్కరాదు!
మన శక్తిని, మన యుక్తిని
పెంచుకొనగవలెనయ్యా!

మనకన్యాయము చేసిన
కాంగ్రెసునకు ఈ రీతిగ
బుద్ధిచెప్పగాను ముందు
ముందు దారికిని వచ్చును!

మనమంతా సంఘటితము
అగుటచేతనే దీనిని
సాధించుట జరుగునయ్య!
మునుముందుకు రారండయ!!

ఐకమత్యమే మహా బ
లమను విషయమును స్మరించి,
అందరు ఒక్కటిగానై
సాధించగ రారండయ!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి