సుకవి పండిత మిత్రులకు, బ్లాగు వీక్షకులకు
వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు!
స్వాగత వృత్తము:శ్రీ గణేశ! ఘన చిత్సుఖ దాతా!శ్రీ గిరీశ సుత! శ్రేష్ఠ! వరిష్ఠా!యోగి రాడ్వరద! యోగ విశేషా!స్వాగత ప్రమథ వర్గ! నమో ఽహమ్! (1)
ప్రమాణి వృత్తము:గజాననా! ఘనాకృతీ!ప్రజావళి ప్రమోద! సద్ద్విజ స్తుత! స్థిరా! చతుర్భుజా! నమో ఽస్తు తే ఽనిశమ్! (2)
ప్రణవ వృత్తము:హేరంబా! మిత హిత సంతోషా!గౌరీ నందన! కరి మూర్ధన్యా!సూరి ప్రాకట శుభ సంశ్లోకా!భూరి క్షత్ర! విముఖ! వందే ఽహమ్! (3)
శాలినీ వృత్తము:సారాచారా! నీత సత్పుణ్య దాతా!పారాశర్యామోద బాష్పోత్సుకా! క్రౌంచారి భ్రాతా! భూరి సమ్మోద పాత్రా!ధీర స్తుత్యా! హే ద్విదేహ ప్రభాసా! (4)
వంశస్థము:నమో నమో విఘ్న వినాశకాయ తే!నమో విచిత్రాయ! వినాయకాయ తే!నమః పవిత్రాంచిత నామకాయ తే!నమో సదాదాన! ఘనాయ తే నమః! (5)
వన మయూరము:హేరుక! భవాత్మజ! మహేంద్ర నుత గాత్రా!ధీర! సుముఖ! ప్రముఖ! దివ్య దరహాసా!ఘోర తర సంసృతి వికూప తరణాప్తా!చారు రుచి దంత కులిశ ప్రహరణాఢ్యా! (6)
స్రగ్విణీ వృత్తము:పార్వతీ నందనా! భారతోల్లేఖనా!సర్వ గర్వాపహా! ఛాత్ర విద్యోదయా!ఖర్వ విఘ్నోన్నతా! కార్య సిద్ధిప్రదా!శర్వ పుత్రాగ్రజా! శాంత మూర్తీ! నమః! (7)
ఇంద్ర వంశము:జీవేశ! సర్వోత్తమ! చేతన ప్రదా!దేవ స్తుతా! శాంకరి! ధీ విశేష! దివ్యా! విశ్వ సంపూజిత! వక్రతుండ! ఢుంఠీ! వేద వేద్యా! ఘన తేజ! తే నమః! (8)
భుజంగ ప్రయాతము:ద్విపాస్య! త్రి ధామ! త్రిధాతు! ప్రసిద్ధా!సుపర్వ ప్రమోదా! శుభాంగా! వృషాంకా!కపి త్థాత్త సంపృక్త భుక్త ప్రహృష్టా!కృపాంభోధి! కుబ్జాకృతీశా! నమస్తే! (9)
(శుభం భూయాత్)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి