గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, మార్చి 21, 2014

సీమాంధ్ర పార్టీలకు తెలంగాణలో సమాధికట్టండి!


సీమాంధ్రా పార్టీలను
తెలంగాణలోన బొంద
పెట్టకున్నచో మనలను
మరల బానిసల చేతురు!

రాజకీయ, భావజాల,
వ్యాపారాధిపత్యములు
తెలగాణలొ కొనసాగుచొ
వారలకును బానిసలమె!

తెలంగాణ ప్రజలారా,
సీమాంధ్రా పార్టీలను
తరిమికొట్ట రారండీ!
నడ్డివిరుగగొట్టండీ!!

సీమాంధ్రుల ప్రణాళికలు
తెలగాణకు విఘాతములు!
త్రిప్పికొట్టి, బుద్ధిచెప్పి,
ఓటు కత్తి తిప్పండీ!

చంద్రబాబు, జగనుబాబు,
కిరణుబాబు, పవనుబాబు,
ఎవరైతేనేం రాక్షస
జాతికి చెందినవారలె!

ఇదియె దేవదానవులకు
జరుగునట్టి సంగ్రామం!
దేవతలను గెలిపింపుడు!
రాక్షసులను ఓడింపుడు!!

మరల తెలంగాణ ముఖము
చూడకుండ చేయవలెను!
మన జుట్టును ఇచ్చితిమా,
అధికారము వారలదే!!

బంగారపు తెలగాణము
సాధింపగ కోరిరేని,
ఒకే ఒక్క పార్టీకే
ఓటువేసి గెలిపింపుడు!

ఎన్నికలలొ తెలగాణకు
కేంద్రమందు, రాష్ట్రమందు
చాల బలము కావలెనన,
ఒకే పార్టి గెలువవలయు!

మన రాష్ట్రము సాధనకును,
ఉద్యమమును నడిపినట్టి,
పార్టీనే గెలిపించుట
మన అందరి కర్తవ్యము!

సీమాంధ్రుల పార్టి గెలువ
రాదు, బానిసలమౌదుము!
తెలంగాణ సంక్షేమము
వారలచే దూరమౌను!

తెలంగాణ అస్తిత్వము
వెలుగొందగవలెనన్నచొ,
ఉద్యమపార్టీ గెలుచుట
అవశ్యకర్తవ్యమగును!

మరిన్ని వివరములకై:

("కట్టా - మీఠా"...కట్టా శేఖర్ రెడ్డిగారికి ధన్యవాదములతో...)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


4 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

మీ చవుకబారు విద్వేషవిషవాక్కులకు నవ్వువస్తున్నది.
జాలికూడా కలుగుతున్నది.
ప్ఛ్

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మీ చవకబారు వ్యాఖ్యకుకూడా నాకు నవ్వువస్తున్నది. నేను ఉద్దేశించింది తెలంగాణులను! మాకు అన్యాయం చేసి, మా నీళ్ళు, నిధులు, కొలువులు, భూములు అక్రమంగా కొల్లగొట్టి, మమ్మల్ని బానిసలుగా మార్చిన సీమాంధ్ర నాయకులను, పెట్టుబడిదార్లను, అక్రమార్కులను అధికారంలోకి రానివ్వకూడదంటున్నాను. మీరు సీమాంధ్రులకు వత్తాసు పలికేవాళ్ళు కాబట్టి విషం కక్కుతున్నారు. హైదరాబాద్‍లో నివసిస్తూ, తెలంగాణ నీరాహారపానములనుభవిస్తూ, తెలంగాణను, తెలంగాణులను నిందించడం, బ్లాగులలోనికి వచ్చి, విషం చిమ్మడం, చవకబారు వ్యాఖ్యలురాయడం, రెచ్చగొట్టడం చేస్తున్నారు. అందుకే మీవే విద్వేషవాక్కులు గానీ, నా ప్రజలను నేను మేల్కొల్పడం విద్వేషవాక్కు ఎలా అవుతుంది? ఆదిత్యుల వాక్కులు దైత్యులకు కర్ణకఠోరాలుగా, విద్వేషవాక్కులుగా గాక మరెలా తోస్తాయి? మీ జాలి మాకు అనవసరం. పిర్రగిచ్చి జోలపాడినట్టుంది మీ వైఖరి. మీరు తెలంగాణ ద్వేషులుగా ఉన్నంతకాలం నా మాటలు మీకు వక్రంగానే అనిపిస్తాయి. మీ వక్రపుటాలోచనలు మానండి అని హెచ్చరిస్తున్నాను. స్వస్తి.

jaya చెప్పారు...

ఆనాడు మద్రాసు నుండి విడిపోయినప్పుడు మనం ద్రావిడ పార్టీలను ఆంధ్రాలో చేరదీసామా ?
మరిప్పుడెందుకు సీమాంధ్ర పార్టీలు తెలంగాణా గడ్డపై వద్దన్నందుకు గోల .. గెలిపించుకుంటే గెలిపించు కుంటారు వారిష్టం
పోటీ చేసి ఓడిపోనివ్వండి వీరిష్టం ...
చూద్దాం ఏమి జరుగుతుందో

jaya చెప్పారు...

ఆనాడు మద్రాసు నుండి విడిపోయినప్పుడు ద్రావిడ పార్టీలను ఆంధ్రా వారు ఆడరించారా ?
ఇప్పుడూ అంతే
పోటీ చేయడం వారిష్టం .. గెలిపించడం గెలిపించాకపోవడం తెలంగాణా వాసుల ఇష్టం

కామెంట్‌ను పోస్ట్ చేయండి